నల్లగొండలో లావణ్య విత్ లవ్ బాయ్స్
రాంనగర్ : రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై లావణ్య విత్ లవ్‌బాయ్స్ సినిమా షూటింగ్ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల బృందావన్ కాలనీలో ప్రారంభమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి కెమెరా స్విచ్ఆన్ చేయగా, ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి క్లాప్ కొట్టారు. దాంతో హీరోహీరోయిన్‌పై మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు.
ఈ సందర్భంగా సినీ డైరెక్టర్ డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ మాట్లాడుతూ యూత్ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ సెంటిమెంట్, మంచి పాటలు, ఆసక్తికర సన్నివేశాలతో చిత్ర నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ సినిమాకు నిర్మాతలుగా రాజ్యలక్ష్మి, నర్సింహులు, పటేల్శెట్టి, కెమెరా తోట వి.రమణ, మేకప్ ఈశ్వర్ మల్లెమూడి వ్యవహరిస్తున్నారు. డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాథ్, పావని, హేమసుందర్, యోధ, సాంబ, కిరణ్, యోగా, వైభవ్, సత్కళ సత్యనారాయణ నటిస్తున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.