discreas
-
ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన కరోనా వైరస్ ఉధృతి
-
ఎరువుల ధరలు తగ్గాయోచ్..
ఖమ్మం వ్యవసాయం : గతంలో ఉన్న ధరలకన్నా.. కొంతమేర ఎరువుల ధరలు తగ్గడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రసాయన ఎరువుల ధరల వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ గురువారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు విడుదల చేసింది. ఈ మేరకు వివిధ కంపెనీలకు చెందిన ఎరువుల ధరలను జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.మణిమాల వివరించారు. కొంత మేర తగ్గిన ధరలను ఇకనుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయాధికారులు నిర్ణయించిన ధరలతో(తగ్గిన) ఎరువుల విక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే నిబంధనల మేరకు చర్యలుంటాయని ఆమె పేర్కొన్నారు. తగ్గిన ఎరువుల ధరలు ఇలా.. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కంపెనీ పేరు డీఏపీ రూ.లలో ఎంఓపీ రూ.లలో ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కోరమాండల్ ఇండియా లిమిటెడ్ 1,155 577 ఇఫ్కో 1,155 ––– స్పిక్ 1,155 ––– ఐపీఎల్ 1,140 577 ఆర్ఎల్ఎఫ్ 1,102 603 పీపీఎల్ 1,156 570 జడ్ఐఎల్ 1,156 578 జీఎస్ఆర్ఎఫ్ 1,155 –––– ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– డీఏపీ : డైఅమోనియా పాస్పేట్ ఎంఓపీ : మ్యూరేట్ ఆఫ్ పొటాష్ -
వరి.. సరి..
రాష్ట్రంలో రబీలో తగ్గిన సాగు సాక్షి, హైదరాబాద్: ఈ సారి రబీలో రైతులు వరి వైపు చూడలేదు. రబీలో సహజంగా 6.5 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుంది. ఈ సారి ఇప్పటివరకు 45 వేల హెక్టార్లలోనే వరి సాగు చేశారు. నీటి వనరులు ఉన్నచోటే వరి సాగు జరి గింది. ఎక్కువగా జొన్న పంట వేశారు. ఆరుతడి పంటలే వేయాలని వ్యవసాయ శాఖ చేసిన ప్ర చారం ఫలితాన్నిచ్చింది. రబీలో 61 వేల హెక్టార్లలో జొన్న సాగు చేయాల్సి ఉండగా 48 వేల హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 1.52 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 99 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఆహారధాన్యాలు 10.41 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండ గా 2.98 లక్షల హెక్టార్లలోనే సాగయింది. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇదిలావుండగా వర్షపాత లోటు తీవ్రంగా ఉండడంతో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రబీ సీజన్లో (బుధవారం నాటికి) 61 శాతం వర్షపాత లోటు నమోదైంది. అంటే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు ఛాయలు రాష్ట్రాన్ని కమ్మేశాయని వ్యవసాయశాఖ నివేదిక లో స్పష్టంచేసింది.