ధనికుల జబ్బు... గౌట్!
మెడి క్షనరీ
ఆ జబ్బుకు డిసీజ్ ఆఫ్ రిచ్ అని పేరు. రాజులకు వచ్చే జబ్బు అని మరో పేరు కూడా ఉంది. దాని పేరే ‘గౌట్’. ఈ జబ్బుకు ఇంగ్లిష్లో ‘పొడగ్రా’ అని మరో పేరు కూడా ఉంది. కీళ్లకు వచ్చే చాలా రకాల జబ్బుల్లో ఇదీ ఒకటి. రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు ఎక్కువై, అది ఒక రాయిగా ఘనీభవించడం వల్ల ఇది బొటనవేలి దగ్గర వాపు, మంట వస్తుంది. ఇది ధనికులకూ, రాజులకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. వేటమాంసాన్ని లేదా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం కారణంగా వచ్చే ఈ జబ్బు సాధారణ ప్రజల్లో కూడా కనిపిస్తుంటుంది. అయితే మన దేశంలో ఒకప్పుడు రాజులు, బాగా ధనికులు మాత్రమే మాంసాహారాన్ని ఎక్కువగా తినేవారు. అప్పట్లో అలాంటి ఆహారం తీసుకునే వారిలోనే ఇది ఎక్కువగా కనిపించేదీ కాబట్టి దీనికి ధనికులకు వచ్చే జబ్బు లేదా రాజులకు వచ్చే వ్యాధిగా పేరొచ్చింది.