బుల్లెట్ రాణి, బుల్లెట్ రాజాల సాహసయాత్ర
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై దర్జాగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఇద్దరినీ ఎక్కడో చూసినట్లనిపిస్తోందికదా! అవును. ఆయన 'సుత్తి'తో దుష్టులను అంతం చేసే 'థోర్' హీరో క్రిస్ హేమ్స్ వర్త్ కాగా, ఆవిడ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' హీరోయిన్ ఎల్సా పాట్కీ. వీళ్లిద్దరూ భార్యభర్తలుగా కంటే గొప్ప స్నేహితులుగా, ఒకరికోసం ఒకరన్నట్లు జీవించే ప్రేమపక్షులుగా ప్రసిద్ధి. ఆ బంధాన్ని మరింత దృఢపర్చుకునేందుకు ఈ వాలెంటైన్స్ డేనాడు ఇద్దరూ కలిసి మరో సాహసకృత్యానికి సిద్ధమయ్యారు.
సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి.. అడ్వెంచర్ టూరిస్టులకు అడ్డాగా మారిన ఇండియాకు కుటుంబంతోసహా విచ్చేసిన ఈ హాలీవుడ్ జంట ఇప్పటికే గోవా, లడాఖ్ ప్రాంతాలను చుట్టేశారు. వారి తర్వాతి గమ్యం హిమాలయాల్లో ట్రెక్కింగ్. సరిగ్గా ప్రేమికులరోజునాడే హిమాలయ సాహసయాత్రను ప్రారంభించనున్నారీ ప్రేమజంట. స్పెయిన్ కు చెందిన 'ప్లానెటా ఛలేజా(ప్లానెట్ ఛాలెంజ్)' అనే అడ్వెంచర్స్ అంస్థ వీరి టూర్ ను గైడ్ చేస్తోంది.