EODB rankings
-
సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలకు శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను గురువారం వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధా నానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్ అఛీవర్స్, అఛీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్ ఇకో సిస్టమ్స్ అనే 4 కేటగిరీ లుగా విభజించింది. అయితే టాప్ అఛీవర్స్ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరి యాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. బిజినెస్ రిఫారŠమ్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 301 అంశాల్లో సంస్కరణలు చేపట్టాలని డీపీఐఐటీ ఆదే శించింది. అం దులో భాగంగా తెలంగాణ 301 అంశాల్లోనూ సంస్క రణలు చేపట్టి నూటికి నూరు శాతం మార్కులు సాధించింది. అయితే గతంలో ర్యాంకుల ప్రకట నలో ఎదురైన అస్పష్టతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కేటగిరీ లుగా వెల్లడించింది. 301 సంస్కరణల్లో కొన్ని రాష్ట్రాలకు ఒకటి, రెండు అంశాల్లోనూ అగ్రస్థానం దక్కిం దని, తెలంగాణ మాత్రం అనేక నిబంధనల్లో అగ్రస్థానం దక్కించు కుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈవోడీబీ ర్యాంకుల విధానం ప్రారంభంకాగా తొలిసారి 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2017లో రెండు, 2019లో మూడోస్థానంలో నిలిచింది. కాగా, ఈవోడీబీ ర్యాంకింగ్‌లో తెలంగాణకు టాప్ అఛీవర్స్ జాబితాలో చోటుదక్కడంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సులభతర వాణిజ్యంతో ప్రశాంత వాణిజ్యం కూడా సాధ్యమని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టాప్.. వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయో జనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానాన్ని సాధించింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుకు ప్రపంచస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్ అచీవర్స్‌గా ప్రకటించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 97.89%తో మొదటిస్థానంలో నిలిచింది. -
సులభతర వాణిజ్యం ర్యాంకులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వం ప్రకటించే సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల కోసం రాష్ట్రాలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుకు అద్దం పట్టే ఈ ర్యాంకులు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలోనూ కీలకమవుతున్నాయి. ఈఓడీబీ ర్యాంకుల్లో ఒక్కసారి మినహా ప్రతిసారి తొలి మూడు స్థానాల్లో నిలిచిన తెలంగాణ కూడా ఈ ర్యాంకులు ఎప్పుడు వస్తాయోనని చూస్తోంది. ఏడాదవుతున్నా కొలిక్కిరాని మదింపు ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) 2015 నుంచి ఈఓడీబీ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పాలన సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ర్యాంకుల ప్రకటనలో కేంద్రం సూచించే బిజినెస్ రిఫారŠమ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఏపీ) పాయింట్లు కీలకంగా మారుతున్నాయి. 2015 ఈఓడీబీ ర్యాంకుల్లో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2016లో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి మొదటి స్థానంలో, 2018లో రెండు, 2019లో మూడో స్థానంలో నిలిచింది. 2017లో కేంద్రం ఈఓడీబీ ర్యాంకులను ప్రకటించలేదు. 2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి డీపీఐఐటీ 301 బీఆర్ఏపీ సంస్కరణలను సూచించి గతేడాది సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించింది. డీపీఐఐటీ సూచించిన సంస్కరణలను అమలు చేసిన ప్రభుత్వం అందుకు అవసరమైన పత్రాలనూ డీపీఐఐటీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. వివిధ రాష్ట్రాల సంస్కరణల వివరాలను పరిశీలించి, సంబంధిత వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటన్నింటినీ డీపీఐఐటీ మదింపు చేస్తుంది. 2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి వివరాలు సమర్పించి ఏడాదవుతున్నా ఈ మదింపు ప్రక్రియ కొలిక్కి రావట్లేదు. మెరుగైన స్థానం వస్తుందనే ఆశతో తెలంగాణ ఈఓడీబీ ర్యాంకుల్లో 2015 మినహా మిగతా అన్ని సందర్భాల్లో రాష్ట్రం తొలి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తోంది. 2019 ర్యాంకింగులో ఉత్తరప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి. దీంతో మదింపు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2020లో సూచించిన 301 సంస్కరణలను నిర్దేశిత గడువులోగా అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్ఏపీ సంస్కరణలపై సంబంధిత వర్గాలు సానుకూలంగా స్పందించాయని సమాచారం తమకు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈఓడీబీ సంస్కరణలు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగు పరుచుకునేందుకు ఓ అవకాశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. 2020 ర్యాంకుల్లో రాష్ట్రం మెరుగైన ర్యాంకు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
సులభతర వాణిజ్యంలో నం.1 కావాలి..
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ ప్రభుత్వ విభాగాల శాఖాధిపతులతో ఈఓడీబీ ర్యాంకుల ప్రక్రియపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం కేటీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈఓడీబీ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానం సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలకు సంబంధించి వంద శాతం సంస్కరణలు, చర్యలు పూర్తయినట్లు అధికారులు వివరించారు. ర్యాంకుల కేటాయింపుల్లో యూజర్ ఫీడ్‌బ్యాక్ (వినియోగదారుల ప్రతిస్పందన) అత్యంత కీలకమని, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్న సేవలపై పారిశ్రామికవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం సమాచారం తీసుకుంటోందని అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల పనితీరుతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తూ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. గతంలోనూ ఈఓడీబీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, త్వరలో ప్రకటించే ర్యాంకుల్లోను మొదటి స్థానం సాధించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈఓడీబీ కేవలం ర్యాంకుల కోసమే కాదని, ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అద్భుతమైన అవకాశంగా కేటీఆర్ పేర్కొన్నారు. డిజిటల్ సేవలను ప్రారంభించిన మంత్రి మేధో సంపద పరిరక్షణకు సంబంధించిన అన్ని రకాల అంశాలపైనా విద్యార్థులు, స్టార్టప్ నిర్వాహకులు, సృజనాత్మక ఆవిష్కర్తలు...ఇలా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రెజల్యూట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘ఐపీ బడ్డీ రచిట్’డిజిటల్ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐటీ పరిశ్రమ ప్రిన్సినల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, రెజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఎం.కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
301 సంస్కరణలను అమలు చేయండి
సాక్షి, అమరావతి: ప్రస్తుత సంవత్సరం సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – ఈవోడీబీ) కోసం 301 సంస్కరణలను అమలు చేయాలని రాష్ట్రాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) సూచించింది. 2020–21 ర్యాంకుల కోసం 15 విభాగాల్లో ఈ సంస్కరణలను నవంబర్‌లోగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ► 2019 సంవత్సరానికి గాను 187 సంస్కరణలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల కావడంతో వీటి అమలుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ శ్రీకారం చుట్టింది. ► వీటి ప్రకారం కొన్ని చట్టాలను సవరించాల్సి ఉండగా, మరికొన్నింటి కోసం ప్రత్యేక అప్లికేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. ► సంస్కరణల అమలుకు రెండున్నర నెలలే సమయం ఉండటంతో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించి కొత్త మార్గదర్శకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ చేపట్టింది. ► ఈ సంస్కరణలను అమలు చేశాక వీటి ప్రయోజనం పొందిన వారి నంబర్లు తీసుకుని సర్వే నిర్వహించడం ద్వారా ర్యాంకులను నిర్థారిస్తారు. అయితే సర్వేకి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. ► ఈ ఏడాది కొత్తగా పర్యాటకం, టెలికాం, ఆతిథ్యం, ట్రేడ్ లైసెన్స్, హెల్త్ కేర్, తూనికలు–కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్‌లకు సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. ► సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ దరఖాస్తు నమోదు దగ్గర్నుంచి రుసుంల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. -
ఈవోడీబీలో రాష్ట్రానికి 3వ ర్యాంకు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) శనివారం 2019 సంవత్సరానికి గాను సులభతర వాణిజ్య వి«ధానం (ఈవో డీబీ) ర్యాంకులను ప్రకటించింది. సులభతర వాణిజ్యానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాలు సాధించాయి. 2018 జూలైలో ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకింగుల్లో తెలంగాణ రెండో స్థానం సాధించగా ప్రస్తుత ర్యాంకింగ్‌లో ఒక స్థానం దిగువకు పడిపోయి మూడో స్థానంలో నిలిచింది. 2015లో తొలిసారి ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకింగ్‌లో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ... 2016లో ఏపీతోపాటు మొదటి స్థానంలో నిలిచింది. 2017లో ఎలాంటి ర్యాంకులు ప్రకటించలేదు. గతేడాది రెండో స్థానంలో నిలిచింది. న్యాయ సంస్కరణలు అమలు కానందుకే నష్టం.. రాష్ట్రాలు ‘బిజినెస్ రిఫారŠమ్స్ యాక్షన్ ప్లాన్’ (బీఏపీఆర్)లో భాగంగా అమలు చేసే సంస్కరణల ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకులు నిర్ణయిస్తారు. బీఏపీఆర్ 2019లో 45 అంశాలకు సంబంధించి 181 సంస్కరణలు అమలు చేయాలని డీపీఐఐటీ నిర్దేశించింది. అయితే న్యాయ విభాగానికి సంబంధించి రెండు సంస్కరణలు అమలు కాకపోవడంతో తెలంగాణ నాలుగు పాయింట్లు కోల్పోయింది. కమర్షియల్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, కమర్షియల్ కోర్టుల సేవల వినియోగంలో తెలంగాణ పాయింట్లను కోల్పోవడంతో గతేడాదితో పోలిస్తే ర్యాంకింగ్‌లో ఒక స్థానం కోల్పోయింది. ర్యాంకింగ్‌లో పారదర్శకతపై అసంతృప్తి... ఈఓడీబీ ర్యాంకుల్లో పారదర్శకతపై రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఏకంగా రెండో స్థానానికి ఎగబాకిన తీరుపై అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈఓడీబీ ర్యాంకులకు బదులుగా 2019 నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెడతామని ప్రకటించిన కేంద్రం... తిరిగి ర్యాంకుల విధానంవైపు మొగ్గు చూపడాన్ని పరిశ్రమల శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈఓడీబీ 2020 ర్యాంకులకు సంబంధించి బీఏపీఆర్‌లో 305 సంస్కరణలు చేయాల్సిందిగా డీపీఐఐటీ నిర్దేశించింది. నవంబర్ 30లోగా సంస్కరణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా గడువు విధించింది. -
సులభతర వాణిజ్యానికి గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానాల ద్వారా పారిశ్రామికీకరణ, తద్వారా ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డిప్) ప్రతీ ఏటా రా ష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) కోసం ఆయా రాష్ట్రాలు చేపట్టే సంస్కరణల ఆధారంగా.. ప్రపంచ బ్యాంకు సహకారంతో డిప్ ఈ ర్యాంకులను నిర్ణయిస్తోంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి 340 అంశాల్లో రాష్ట్రాలు చేపట్టే వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బ్రాప్)ను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులను ఏటా ప్రకటిస్తున్నారు. అయితే ఈ ర్యాంకింగ్‌ల విధానంపై తెలంగాణ, గుజరాత్ సందేహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఈఓడీబీ ర్యాంకింగ్ విధానాన్ని సమీక్షించిన డిప్.. 2019 నుంచి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ర్యాంకులకు బదులుగా గ్రేడింగ్ విధానం పారిశ్రామికీకరణలో ముందంజలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ర్యాంకింగులో వెనుకబడి పోవడం కూడా ఈఓడీబీ ర్యాంకింగ్‌పై సందేహాలకు కార ణమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి మార్కులు కేటాయించే విధానానికి స్వస్తి పలికి.. గ్రేడింగ్ విధానం పాటించాలని డిప్ నిర్ణయించగా, మార్కులకు బదులుగా దశాంశమాన పద్ధతిలో పాయింట్లు కేటాయిస్తోంది. ఒక్కో సంస్కరణకు సంబంధించి కనీసం 75కు పైగా పాయింట్లు వస్తేనే గ్రేడింగ్ సాధ్యమవుతుంది. గతంలో ఇచ్చిన ర్యాంకింగుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసిన డిప్.. ఈ ఏడాది పరిశ్రమల శాఖ అందిస్తున్న సేవలను గ్రేడ్ల కేటాయింపులో ప్రాతిపదికగా తీసుకుంటోంది. బడ్జెట్లో ఏటా నిధులు కేటాయిస్తున్నా.. విడుదల కాకపోవడంపై పారిశ్రామికవర్గాలు డిప్ సర్వేలో ప్రతికూలంగా స్పందిం చే అవకాశముంది. ర్యాంకుల స్థానంలో టాప్ అచీవర్ (95 శాతానికి పైగా పాయింట్లు), అచీవర్ (90 నుంచి 95), ఫాస్ట్ మూవర్ (80 నుంచి 90), ఆస్పైరర్స్ (80 కంటే తక్కువ పాయింట్లు) పేరిట డిప్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడ్లను ప్రకటించనుంది. ఈ ఏడాది గ్రేడింగ్‌పై ప్రభావం ఈ ఏడాది సులభతర వాణిజ్య గ్రేడింగ్‌లో తొలి స్థానం చేరుకునేందుకు అవసరమైన సంస్కరణల అమలుపై తెలంగాణ పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ అంశాలకు సంబంధించి చేపట్టిన సంస్కరణలపై.. పారిశ్రామికవర్గాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడింగ్‌లో కీలకం కానుంది. డిప్ నిర్వహించే సర్వేలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధిం చిన ప్రతిస్పందన కీలకంగా మారే అవకాశముంది. -
వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజ
సాక్షి, అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో కీలకమైన వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2019 ఈవోడీబీ ర్యాంకులకు సంబంధించి వ్యాపార సంస్క రణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్–బీఆర్ఏపీ)లోని మొత్తం 187 సంస్కరణల అమలు తీరును ఆధారంగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తారు. రాష్ట్రాల్లో ఆయా సంస్కరణల అమలు తీరును కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని ‘డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్’ విభాగం పరిశీలించి వాటికి ఆమోదం తెలుపుతుంది. ఆ మేరకు ఏపీకి సంబంధించి శుక్రవారం నాటికి 186 సంస్కరణలకు ఆమోదం లభించింది. మరో సంస్కరణకు అదనపు సమాచారం అడిగారని, దీనికి కూడా 15 రోజుల్లో సమాధానం ఇవ్వనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. వ్యాపార సంస్కరణలు ఆమోదం పొందడంలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఇంకా 56 సంస్కరణలకు, కర్ణాటకలో 34 సంస్కరణలకు ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఆంధ్రా, తెలంగాణ తర్వాత మూడో స్థానంలో నిలిచిన హర్యానా సంస్కరణల ఆమోదంలో మన రాష్ట్రంతో గట్టిగా పోటీపడుతోంది. హర్యానాకు సంబంధించి ఇప్పటికే 183 సంస్కరణలకు ఆమోదం లభించగా, నాలుగు సంస్కరణలకే ఆమోదం లభించాల్సి ఉంది. మొత్తంగా ఈ 187 సంస్కరణలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కమిటీ ఆమోదం తెలుపుతుంది. వీటి ఆధారంగా ఈవోడీబీ ర్యాంకులు నిర్ణయమవుతాయి. సులభతర వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాన్ని ఈ ర్యాంకులు సూచిస్తాయి. ఈ ర్యాంకుల ఆధారంగానే ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నదానిపై పారిశ్రామికవేత్తలు నిర్ణయం తీసుకుంటారు. ఫీడ్‌బ్యాకే కీలకం... ఈసారి ఈవోడీబీ ర్యాంకుల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి తీసుకునే ఫీడ్‌బ్యాక్ కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 187 సంస్కరణలకుగాను 80 సంస్కరణల అమలు తీరుకు సంబంధించి నేరుగా వ్యాపారవేత్తల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఒక్కో రంగం నుంచి కనీసం 20 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి అభిప్రాయాలు సేకరిస్తారు. ఇందులో కనీసం 14 మంది సంస్కరణల అమలుపై అనుకూలంగా చెపితేనే పాయింటు వస్తుంది. గతేడాది రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోపాటు పరిశ్రమల ప్రతినిధుల ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నారు. ఈసారి పూర్తిగా పరిశ్రమల ప్రతినిధుల నుంచే తీసుకోనున్నారు. అలాగే ఈ సర్వే ఎప్పుడు, ఎలా చేస్తారో అన్నది బయటకు తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పరిశ్రమల శాఖ ‘ఔట్ రీచ్’ పేరిట అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తూ స్థానిక పారిశ్రామికవేత్తల సందేహాలు, సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ సదస్సులకు మంచి స్పందన వస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సదస్సులు నిర్వహించామని, మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్టు చెప్పారు. -
‘ఈఓడీబీ’లో రాష్ట్రానికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ర్యాంకుల్లో తమకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈఓడీబీలో మెరుగైన మార్కులు సాధించినా సాంకేతిక కారణాల వల్ల ర్యాంకు మారిపోయిందని ఆరోపిస్తోంది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ర్యాంకులూ తారుమారైనట్లు అభిప్రాయపడుతోంది. కేంద్ర ప్రభుత్వ అధికారుల తప్పిదాల వల్లే తెలంగాణకు మొదటి ర్యాంకు రాలేదని, ఈ ప్రక్రియ ఈఓడీబీ ర్యాంకుల ప్రామాణికతనే ప్రశ్నార్థకంగా మార్చిందని వాదిస్తోంది. ఈ మేరకు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. గణనలో తప్పులు 2017–18కి గాను కేంద్ర పరిశ్రమల శాఖ రాష్ట్రాల వారీగా ఈఓడీబీ ర్యాంకులను జూలై 10న ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్థానం, తెలంగాణకు రెండో స్థానం లభించింది. హరియాణా మూడో స్థానంలో నిలిచింది. ర్యాంకుల ప్రకటనలో 372 సంస్కరణల తాలూకు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ 372 అంశాల అమలు, పరిశ్రమ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ర్యాంకులు ఖరారు చేశారు. అయితే ర్యాంకుల మూల్యాంకనంలో తప్పులు దొర్లాయని, కొన్ని రాష్ట్రాలకు నష్టం జరిగేలా గణన జరిగిందని తెలంగాణ ఆరోపిస్తోంది. ‘ఫీడ్‌బ్యాక్’ ఏదీ? తుది ర్యాంకులు ప్రకటించే ముందు పరిశ్రమల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మార్కులను రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుపుతామని కేంద్రం గతంలో ప్రకటించింది. కానీ సమాచారం లేకుండానే ర్యాంకులు ప్రకటించింది. ర్యాంకుల తర్వాత కూడా మూల్యాంకనం తీరుపై సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు. దీంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిని కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇవ్వకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుబాటులో ఉన్న సమాచారంతో కేంద్ర పరిశ్రమల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా గణన చేసింది. గణనలో ఏపీతోపాటు తెలంగాణకూ అగ్రస్థానం దక్కాల్సినన్ని మార్కులొచ్చాయి. 368 ప్రశ్నలకు వందశాతం మార్కులు 372 ప్రశ్నలకు జరిగిన మూల్యాంకనంలో 368 ప్రశ్నలకు 100 శాతం మార్కులు తెలంగాణకు వచ్చాయి. మిగిలిన 4 ప్రశ్నలు తెలంగాణకు సంబంధించినవి కాకపోవడంతో 100 శాతం మార్కులను జ్యూరీ ప్రకటించింది. ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించిన 78 ప్రశ్నల్లోనూ తెలంగాణకు 83.95 శాతం మార్కులొచ్చాయి. సంస్కరణల అమలు మరియు ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించిన అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత తెలంగాణకు 98.3 శాతం మార్కులు దక్కాయి. మరోవైపు ఏపీకి కూడా 372 ప్రశ్నల్లో 368 ప్రశ్నలే మూల్యాంకనం జరిగాయి. మిగిలిన 3 ప్రశ్నలు ఏపీకి సంబంధం లేనివి కాగా ఒక ప్రశ్నకు సంబంధించిన సంస్కరణను అమలు చేయలేకపోయింది. దీంతో తెలంగాణతో సమానంగా ఏపీకీ 368 ప్రశ్నలకు మార్కులొచ్చాయి. ఫీడ్‌బ్యాక్ అంశాల్లోనూ 86.5 శాతం మార్కులు లభించాయి. మొత్తంగా ఏపీకీ 98.3 మార్కులొచ్చాయి. ఆ మేరకు ఏపీ, తెలంగాణలకు కలిపి అగ్రస్థానం ఇవ్వాలి. కానీ కేంద్రం తెలంగాణకు 2వ ర్యాంకు కట్టబెడుతూ తుది ర్యాంకులు ప్రకటించింది. జార్ఖండ్‌కు మూడుకు బదులు నాలుగు మూల్యాంకనం, మార్కుల గణనలో జరిగిన తప్పులను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులు ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణనలో లోపాల వల్ల ఇతర రాష్ట్రాల ర్యాంకుల్లోనూ తేడాలొచ్చాయని.. మూడో స్థానంలో ఉండాల్సిన జార్ఖండ్ నాలుగో స్థానంలో, ఆరో స్థానంలో నిలవాల్సిన మధ్యప్రదేశ్ 7వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీంతో మరిన్ని రాష్ట్రాలు సైతం కేంద్ర పరిశ్రమల శాఖ ర్యాంకుల డొల్లతనంపై విమర్శలు చేస్తున్నాయి. -
ఈవోడీబీలో తెలంగాణకు రెండో ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: సరళీకృత వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ఈవోడీబీ) ర్యాంకింగ్స్‌లో గతేడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ.. ఈ ఏడాది త్రుటిలో ఆ ర్యాంకును కోల్పోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ (డీఐపీపీ) మంగళవారం 2017 సంవత్సరానికి సంబంధించిన ఈవోడీబీ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో 98.42 శాతం స్కోరుతో ఏపీ తొలి ర్యాంకు కైవసం చేసుకుంది. 98.33 శాతం స్కోరుతో (0.09 శాతం తక్కువ) తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. 98.07 శాతం స్కోరుతో హరియాణా మూడు, 97.99 శాతం స్కోరుతో జార్ఖండ్ నాలుగు, 97.96 శాతం స్కోరుతో గుజరాత్ ఐదో స్థానంలో నిలిచాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లోని సంస్కరణల అమలు ఆధారంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు డీఐపీపీ ర్యాంకులు కేటాయించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, తనిఖీలు, సింగిల్ విండో విధానం, పరిశ్రమలకు స్థలాల లభ్యత, కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతుల విధానం, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ, పారదర్శకత, సమాచార లభ్యత, కార్మిక విధానాలు తదితర 12 అంశాల్లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకుని ఈవోడీబీ ర్యాంకులను కేటాయించింది. 2016 సంవత్సరంలో తెలంగాణ, ఏపీలు 98.78 శాతం స్కోరు సాధించి ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలిచాయి. ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణ వెనకడుగు వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లో భాగంగా 3,725 సంస్కరణలను అమలు చేయాలని డీఐపీపీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తించే సంస్కరణలను మినహాయించాక రాష్ట్రం అమలు చేయాల్సిన మొత్తం 368 సంస్కరణలను తెలంగాణ అమలు పరిచింది. దీంతో సంస్కరణల అమలు (రిఫార్మ్ ఎవిడెన్స్) విభాగంలో తెలంగాణకు 100 శాతం స్కోరు లభించింది. ఏపీ అమలు చేయాల్సిన 369 సంస్కరణలకు గాను 368 సంస్కరణలను అమలు చేసి 99.73 శాతం స్కోరు సాధించింది. అయితే రాష్ట్రాల్లో సంస్కరణల అమలుపై కొత్త పరిశ్రమలు, పాత పరిశ్రమలు, ఆర్కిటెక్టులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, న్యాయవాదుల నుంచి డీఐపీపీ సేకరించిన ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణకు 83.95 శాతం స్కోరు లభించగా, ఏపీ 86.5 శాతం స్కోరు సాధించింది. ఫీడ్‌బ్యాక్ స్కోరులో తెలంగాణ కంటే మెరుగైన స్కోరు సాధించడంతో ఏపీ ఈ సారి ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించింది. -
ఈఓడీబీలో మళ్లీ మనమే!
సాక్షి, హైదరాబాద్: సరళీకృత వ్యాపార విధానం (ఈఓడీబీ) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోబోతోంది. అయితే, ఈ సారి మరో ఐదు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో కలసి మొదటి ర్యాంక్‌ను పంచుకోబోతోంది. సరళీకృత వ్యాపార సంస్కరణల అమలు విషయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడంలో 100 శాతం స్కోర్ సాధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ సహా హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఇప్పటికే స్థానం సంపాదించగా, మరో 12 రాష్ట్రాలు 100 శాతం స్కోర్ సాధించే దిశగా ముందుకు పోతున్నాయి. 2017కి సంబంధించిన వ్యాపార సంస్కరణల ప్రణాళిక అమలులో రాష్ట్రాలు పూర్తి చేసిన లక్ష్యాలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిర్వహిస్తున్న మదింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దీంతో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తుది స్కోర్లపై ఇంకా స్పష్టత రాలేదు. మదింపు ప్రక్రియ ముగిసిన తర్వాత తుది ర్యాంకులను ప్రకటించనుంది. సరళీకృత వ్యాపార విధాన సంస్కరణల అమలులో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయడంలో రాష్ట్రాల సాధించిన పురోగతిని మదించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఏటా ర్యాంకులను కేటాయిస్తోంది. 2017 సంబంధించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను గత ఆగస్టులో కేంద్రం ప్రకటించింది. ఈ ప్రణాళికలోని 372 సిఫారసుల అమలులో రాష్ట్రాలు సాధించిన పురోగతి ఆధారంగా 2018కి సంబంధించిన ర్యాంకులను త్వరలో కేంద్రం ప్రకటించనుంది. 12 ప్రధాన అంశాల్లో సంస్కరణల అమలు విషయంలో రాష్ట్రాలు పాటిస్తున్న నియంత్రణ ప్రక్రియలు, విధానాలు, అమలు తీరు, పద్ధతుల ఆధారంగా ఈ స్కోర్‌ను కేటాయిస్తోంది. కార్మికుల నమోదు, ఫ్యాక్టరీలకు లైసెన్స్‌ల జారీ, ఫ్యాక్టరీల భవన నిర్మాణ అనుమతులు, బాయిలర్ల రిజిస్ట్రేషన్, షాపులు, స్థాపన చట్టం కింద లైసెన్స్‌ల జారీ, వాణిజ్య వివాదాల పరిష్కారం, కాగితపు రహిత న్యాయ స్థానాలు, ఆన్లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్, సరళీకృత తనిఖీలు, ఆన్లైన్ సింగిల్ విండో విధానం తదితర సంస్కరణల అమలు ఆధారంగా కేంద్రం రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించనుంది. -
తొమ్మిది నెలల కష్టానికి ఫలమిది
-
తొమ్మిది నెలల కష్టానికి ఫలమిది
► ఈవోడీబీ ర్యాంకుపై కేటీఆర్ ► 22 చట్టాలను సవరించాం.. ► 58 జీవోలిచ్చాం ► అన్ని శాఖలతో 66 సార్లు సమావేశాలు నిర్వహించాం ► విప్లవాత్మక సంస్కరణలతోనే ► ఈ విజయం వచ్చిందన్న మంత్రి ► అన్ని శాఖల అధికారులకు అభినందనలు సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో తెలంగాణకు నంబర్ వన్ ర్యాంకు రావడం ఆషామాషీ వ్యవహారం కాదని.. దాని వెనుక 9 నెలల కష్టముందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం.. అన్ని శాఖల మధ్య సయోధ్య, సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఐఏఎస్ అధికారులు అరవింద్‌కుమార్, నవీన్ మిట్టల్, శాంతికుమారి, అహ్మద్ నదీం, అనిల్‌లతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో పెట్టుబడులు ఎలా వస్తాయి, రాష్ట్రం ఎలా ముందుకెళుతుందని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణకు పారిశ్రామికంగా అగ్రస్థానం దక్కడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. సీఎం కేసీఆర్ పాలనా విధానం, రాష్ట్ర ప్రగతి తీరుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నో చర్యలు తీసుకున్నాం ఈవోడీబీ ర్యాంకు రావడానికి చాలా చర్యలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రపంచమంతా అబ్బురపడేలా టీఎస్ ఐపాస్ విధానాన్ని తెచ్చామన్నారు. ‘‘గత తొమ్మిది నెలలుగా 66 సార్లు రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాం. 22 శాఖలను సమన్వయపరిచాం. ఏకంగా 22 చట్టాలను సవరించాం. 58 జీవోలిచ్చాం. 121 సర్క్యులర్లు జారీ చేశాం. 113 ఆన్లైన్ సేవలను ప్రారంభించాం. 19 పోర్టల్స్‌ను అప్డేట్ చేశాం. కేంద్రం అడిగిన 340 అంశాలకుగాను 324 సంస్కరణలు చేపట్టాం. 12 అంశాలు తెలంగాణకు వర్తించవు. నాలుగు అంశాలను మాత్రమే కేంద్రం ఆమోదించలేదు. ఫలితంగా 98.78 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగలిగాం..’’అని కేటీఆర్ వివరించారు. 15 రోజుల్లో అనుమతులివ్వకుంటే ఆటోమేటిక్‌గా అనుమతి లభించేలా ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ జారీ చేయడంతో పాటు ఫ్యాక్టరీల తనిఖీ విధానంలోనూ సంస్కరణలు తెచ్చామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో ఒక ఫ్యాక్టరీని 30 సార్లు తనిఖీ చేసేవారని, ఆ విధానాన్ని మార్చేసి పెద్దగా ప్రమాదకరం కాని పరిశ్రమల్లో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే తనిఖీలు చేసేలా నిబంధనలు రూపొందించామని తెలిపారు. రిజిస్టర్ల నిర్వహణ, అనుమతులు, రెన్యూవల్‌లను పూర్తిగా సరళీకరించామన్నారు. పరిశ్రమలు, కార్మిక శాఖలతోపాటు వివిధ శాఖల అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైందంటూ ఆయా శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ విషయంలో నిర్మాణాత్మక సలహాలిచ్చిన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాంకులతో పొంగిపోకుండా అవినీతి రహితంగా వ్యవహరించాలనే కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఉత్తమ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఏపీ కాపీ కొట్టినా.. ర్యాంకు పంచుకోవడం సంతోషమే తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టిందంటూ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన అంశాన్ని మీడియా ప్రస్తావించగా... ఏపీ కాపీ కొట్టినా ర్యాంకు పంచుకోవడం సంతోషమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ కాపీ కొట్టిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం. ర్యాంకు ఎవరితో పంచుకుంటారని ఒకవేళ కేంద్రం అడిగితే మేం ఏపీనే ఎంచుకునేవాళ్లం. ఎంత కాదన్నా ఇన్నాళ్లు కలసి ఉన్నాం. తెలుగు వాళ్లం కదా..’’ అని వ్యాఖ్యానించారు. సర్వేలు, ర్యాంకులన్నీ బోగస్ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. ప్రైవేటు సంస్థలు సర్వేలు చేస్తే బోగస్ అన్నారని.. మరి ఇప్పుడు కేంద్రమే ర్యాంకు ఇచ్చిందని, ప్రధాని మోదీ కూడా కేసీఆర్‌ను మెచ్చుకున్నారు కదాని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రంలో తాము భాగస్వామి కూడా కాదని, అయినా నోరుపారేసుకుంటే ఏం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ల అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఏమీ అనలేమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో తెలంగాణకు కొద్దిమేర ఇన్సెంటివ్‌లు వచ్చాయని, మిగతా వాటిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామంటూ అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు. -
ఎంతయినా తెలుగు వాళ్లం కదా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) జాతీయ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి ర్యాంకులో నిలవడంపై తెలంగాణ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవే ర్యాంకులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ లో పొందుపర్చిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చోరీ చేసిన వ్యవహారం గతంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టిందంటూ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్న కేటీఆర్.. ప్రపంచవ్యాప్తంగా మేథో సంపత్తి రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారు. 'ఏపీ కాపీ కొట్టిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశాం. అయితే.. ఒకటి మాత్రం వాస్తవం.. మొదటి ర్యాంకు ర్యాంకు ఎవరితో పంచుకుంటారని ఒకవేళ కేంద్రం అడిగిఉంటే మేం ఆంధ్రప్రదేశ్నే ఎంచుకునేవాళ్లం. ఎంత కాదన్నా ఇన్నాళ్లు కలిసి ఉన్నాం. తెలుగు వాళ్లం కదా!' అని కేటీఆర్ అన్నారు. (తప్పక చదవండి: ఏపీ.. కాపీ) హైదరాబాద్ లో మంగళవారం విలేకరులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ దక్కడం ఆషామాషీ వ్యవహారందని, దీనివెనుక 9 నెలల కష్టముందని చెప్పారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చామని, అన్ని శాఖల మధ్య సయోధ్య, సమన్వయంతోనే మొదటిర్యాకు కైవసం అయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా విధానం, రాష్ట్రం ప్రగతి తీరుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ర్యాంకులతో పొంగిపోకుండా అవినీతి రహితంగా వ్యవహరించాలనే కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ నాణ్యమైన సేవలందిస్తామన్నారు.