fake 2000 notes
-
ఏటీఎంలో నకిలీ రూ. 2వేల నోటు
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే అందులో రూ.2వేల నకిలీ నోటు రావడంతో బాధితుడు ఖంగుతిన్న సంఘటన భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్ముఖిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు దుర్గం లింగస్వామి తెలిపిన వివరాల ప్రకారం..దేశ్ముఖిలోని నిజాం ఇంజనీరింగ్ కళాశాలలో ఇండిక్యాష్ ప్రైవేట్ ఏటీఎం ఏర్పాటు చేశారు. లింగస్వామి ఏటీఎం నుంచి రూ. 10వేల చొప్పున రెండు సార్లు మొత్తం రూ. 20వేలు డ్రా చేశాడు. అనంతరం నోట్లను లెక్కిస్తుండగా అందులో రూ. 2వేల నకిలీ నోటు కనిపించింది. నిశితంగా పరిశీలించగా ‘భారతీయ బచ్చోంక బ్యాంకు, దో హాజార్ అంక్ ’ అని ఆ నోట్‌పై రాసి ఉంది. వెంటనే బాధితుడు ఏటీఎంలోని స్క్రీన్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయగా రిజర్వు బ్యాంకును సంప్రదించాలని వారు సలహా ఇచ్చారు. నకిలీ నోటు వల్ల తాను రూ.2వేలు నష్టపోయానని బాధితుడు వాపోయాడు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
దిస్ ఈజ్ షాటింగ్ పర్పస్ ఓన్లీ..
సాక్షి, బొమ్మనహళ్లి : బెంగళూరులో మంగళవారం ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేయగా అందులో రూ.2వేల నకిలీ నోటు రావడంతో కంగుతిన్నాడు. దయానందరెడ్డి అనే యువకుడు లక్కసంద్ర రెండో క్రాస్‌లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి రూ.6 వేల నగదు డ్రా చేయగా మూడు రూ.2 వేల నోట్లు వచ్చాయి. సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లిన దయానందరెడ్డి రూ.2 వేల నోటు ఇవ్వగా అది నకిలీ నోటు అని సిబ్బంది గుర్తించారు. దీంతో బాధితుడు అవాక్కయ్యాడు. నోటును నిశితంగా పరిశీలించగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట, దిస్ ఈజ్ షాటింగ్ పర్పస్ ఓన్లీ అని ఆంగ్ల అక్షరాల్లో ముద్రించి ఉంది. దీనిపై లక్కసంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వీకరించలేదని, యాక్సిస్ బ్యాంక్‌కు వెళ్లి నకిలీ నోటును చూపించినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు. అసలు నోట్లను గుర్తించండిలా.. కొత్త రూ.2 వేల నోటు ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పొడవు 66 మి.మీ, వెడల్పు 166 మి.మీ.గా ఉంటుంది. ముందు భాగం 1. లైటు వెలుతురులో రూ.2000 సంఖ్యను గమనించవచ్చు. 2. నోటును కొంచెం వొంచి చూస్తే 2000 సంఖ్య కనిపిస్తుంది. 3. దేవ నాగరి లిపిలో రూ.2000 సంఖ్య రాసి ఉంటుంది. 4. మహాత్మా గాంధీ బొమ్మ మధ్య భాగం వైపునకు ఉంటుంది. 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 ఉంటాయి. 6. నోటును ఏటవాలుగా పట్టుకుంటే దారం పోగు ఆకుపచ్చ రంగు నుంచి నీలం రంగుకు మారుతుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు 8. మహాత్మగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్ 9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలు ఎడమ నుంచి కుడికి పెద్దవి అవుతూ కనిపిస్తాయి 10. కింది భాగంలో కుడివైపున రూపాయి చిహ్నంతో సహా రంగు మారే సిరాతో (ఆకుపచ్చ నుంచి నీలం) 2000 ఉంటుంది. 11. కుడి వైపున అశోక స్థూపం చిహ్నం అంధుల కోసం 12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.2000 సంఖ్య ఉన్న దీర్ఘచతురస్రాకారం ఉంటుంది. 13. కుడి వైపున, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముంద్రించిన ఏడు చిన్న చిన్న గీతలు ఉంటాయి. వెనుక భాగం 14. నోటు ముద్రించిన సంవత్సరం ఎడమ వైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. 16. మధ్య భాగంలో వివిధ భాషల ప్యానల్ ఉంటుంది. 17. మార్స్ పైకి ఇస్రో చేపట్టిన ప్రయోగాన్ని ప్రతిబింబిస్తూ మంగళయాన్ చిత్రం ముద్రించారు. -
మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!
-
మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!
గత సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఓ యువ ఇంజనీరు చూపించిన ప్రతిభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతడిని ఎంతగానో ప్రశంసించారు. కానీ.. మోదీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త 2000 రూపాయల నోట్లకు నకిలీనోట్లను ముద్రించినందుకు పోలీసులు అతడిని పంజాబ్‌లోని మొహాలీలో అరెస్టుచేశారు. అతడి వద్ద రూ. 42 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ వర్మ అనే ఈ యువ ఇంజనీరుతో పాటు, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌పాల్‌లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు ముగ్గురూ ప్రజల వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని, తాము ముద్రించిన 2000 రూపాయల నోట్లను కమీషన్ పద్ధతిలో ఇస్తున్నారు. కొత్త నోట్లు ఇచ్చినందుకు వాళ్ల దగ్గర 30 శాతం కమీషన్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఇంతా చేస్తే.. వాళ్లిచ్చేది దొంగనోట్లు. ఆ విషయం తెలియక ఇప్పటికి ఎంతమంది వాళ్ల బుట్టలో పడ్డారో తెలియదు. వీళ్లు ముగ్గురూ కేవలం వీవీఐపీలు మాత్రమే వాడాల్సిన ఎర్రబుగ్గతో అత్యాధునికమైన సరికొత్త ఆడి ఎస్‌యూవీలో వెళ్తుండగా తాము ఆపి తనిఖీ చేశామని మొహాలీ నగర ఎస్పీ పర్మీందర్ సింగ్ చెప్పారు. అప్పుడే ఈ 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయన్నారు. ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నారని, కానీ ఆ ఇద్దరూ పారిపోయారని పోలీసులు చెప్పారు. మోదీ ఎందుకు మెచ్చుకున్నారు.. అభినవ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటుచేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అతడు తయారుచేశాడు. వాటి సాయంతో అంధులు కర్రకు ముందు ఏముందో కూడా తెలుసుకోవచ్చు. గోతులు గానీ, రాళ్లు గానీ ఏవైనా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు మోదీ ఇతడిని జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అభినందించారు. కానీ, చండీగఢ్‌లోని తన కార్యాలయంలో ఇప్పుడు అతడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు చెప్పారు.