అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అనంతపురం: అప్పుల బాధతో కూడేరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వడ్డే వెంకటప్ప (56) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు...వెంకటప్పకు ఐదెకరాల పొలం ఉండగా, మరో ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వేరుశనగ సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడులు, ఇంటి అవసరాలకు రూ. 5 లక్షలు అప్పులు చేశాడు. ఇటీవల రుణదాతల ఒత్తిడి అధికం కావడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
(కళ్యాణదుర్గం)