చెవిలో పూలు పెట్టుకుని కార్మికుల నిరసన
తిరుమలగిరి (నల్గొండ జిల్లా) : తిరుమలగిరి గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం చెవిలో పూలు పెట్టుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కడెం లింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.