చైనా మొబైల్ తో నోకియా డీల్
హెల్సింకి : చైనా మొబైల్ తో నోకియా కార్పొరేషన్ 15 కోట్ల డాలర్ల(1.5 బిలియన్ డాలర్లు) ఫ్రేమ్ వర్క్ డీల్ కుదుర్చుకుంది. ఏడాదిపాటు కొనసాగే ముసాయిదా ఒప్పందంపై నోకియా సంతకం చేసింది. ఈ విషయాన్ని ఫినిష్ మల్టీనేషనల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ నోకియా సోమవారం వెల్లడించింది. అదేవిధంగా ఫ్రెంచ్ గ్లోబల్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ కంపెనీ అల్కాటెల్-లూసెంట్ విలీన కార్యకలాపాలతో నోకియా ..మార్కెట్ షేరు కోల్పోతున్నట్టు కూడా భయాందోళను వ్యక్తచేసింద. నోకియా నెట్ వర్క్ ఎక్విప్ మెంట్ అమ్మకాలు మొదటి త్రైమాసికంలో అంచనా వేసిన దానికంటే అధికంగా పడిపోయాయి. అల్కాటెల్ అనుసంధాన ప్రక్రియతో కొనుగోలుదారులు నోకియా నుంచి తరలిపోయారు.
చైనాలో నోకియాకు చైనా మొబైల్ అతిపెద్ద వినియోగదారుడిగా ఉంది. చైనా మొబైల్ తో నోకియా ముసాయిదా ఒప్పందం కుదుర్చుకుందన్న ప్రకటన నేపథ్యంలో పాత నోకియా, పాత అల్కాటెల్ లు తమ స్థానాలను బలపర్చుకుంటున్నాయని నోర్డియా విశ్లేషకుడు సామీ సర్కామిస్ చెప్పారు. చైనా మార్కెట్ ఈ ఏడాది మంచిగానే ఉంటుందని, అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఫ్రాంకో-అమెరికా సంస్థ అల్కాటెల్-లూసెంట్ ను 15.6 బిలియన్ యూరోలకు నోకియా ఈ ఏడాది మొదట్లో కొనుగోలు చేసింది. ఈ డీల్ తో స్వీడన్ ఎర్సికన్, చైనా హ్యువాయ్ తో ఫిక్స్ డ్ లైన్-మొబైల్ నెట్ వర్క్ ఎక్విప్ మెంట్ లో పోటీ పడుతోంది. ఈ కొనుగోలు ఒప్పందంతో కంపెనీ గ్లోబల్ గా 10 వేల నుంచి 15 వేల వరకు ఉద్యోగాల్లో కోత విధించడం లేదా 14 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని భావిస్తున్నారు.