The future
-
తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియా లైకులు, ఫాలోయింగ్లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.టైమ్ మేనేజ్మెంట్స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.క్రిటికల్ థింకింగ్ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్‌ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్ డిస్కషన్స్‌లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఫైనాన్షియల్ లిటరసీఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్‌చేయడం వంటివి టీనేజ్లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.రెజిలియెన్స్ అండ్ అడాప్టబులిటీ జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్‌లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్షిప్ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్‌ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్ సక్సెస్‌కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. -
ముహమ్మద్‌కు అభ్యర్థన
ప్రవక్త జీవితం ‘అయ్యా! మేము అన్యాయం చేయలేదు. న్యాయమే చేశాం. ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎన్నోసార్లు మా గోడు మీకు చెప్పుకున్నాం. కానీ ఒక్కసారీ మాపై దయ తలచలేదు. ఒక్క ప్రతిపాదనకూ సిద్ధపడలేదు’ అన్నాడు ఒక పెద్దమనిషి అనునయంగా! ‘అదేమీ కాదు. మీరసలు న్యాయంగానే మాట్లాడడం లేదు. నన్ను అగౌరవపరచడానికే నిర్ణయించుకున్నట్లు ఉన్నారు’ అన్నారు అబూ తాలిబ్ ఒకింత బాధగా! ‘లేదు లేదు. మీ పట్ల మేము న్యాయంగానే ప్రవర్తిస్తున్నాం. ముహమ్మద్ విషయంలో మేము ఎన్నోసార్లు మీకు ఫిర్యాదు కూడా చేశాం. అయినా మీరు పట్టించుకోలేదు. ఇకనైనా అతణ్ణి కాస్త మందలించి నోరు మూయించండి. ఇక నుండి ముహమ్మద్ గనక మా దేవతల్నీ, మా పూర్వీకుల్నీ పల్లెత్తు మాట అన్నా, మమ్మల్ని అజ్ఞానులని విమర్శించినా సహించేది లేదు. ఇన్నాళ్ళూ ఓపిక పట్టాం కానీ, ఇక ఊరకునేది లేదు. ఎంతదూరం వెళ్ళడానికైనా మేము సిద్ధం. ముహమ్మద్‌తో, మీతో, మీకు సహకరించే వారితో యుద్ధం చేయడానికి కూడా వెనుకాడేది లేదు’ అంటూ బెదిరింపు ధోరణిలో హెచ్చరించి వెళ్ళిపోయారు. అబూ తాలిబ్ తల పట్టుకున్నారు. తీవ్ర ఆలోచనలో పడిపోయారు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.‘ఖురైషీయులతో శతృత్వం పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే! అలా అని ప్రాణసమానమైన ముహమ్మద్‌ను వదులుకోలేను. ఏం చేయాలి? ఏమిటీ కర్తవ్యం? ఏమైనా సరే... అబ్బాయిని పిలిచి మాట్లాడాలి. ఎలాగైనా ఇస్లామ్ ప్రచారం ఆపమని చెప్పాలి. ఎన్నాళ్ళింకా వీళ్ళతో ఈ గొడవ. దీనివల్ల ఖురైషుల ఐక్యతకూ భంగం కలుగు తోంది’ అనుకొన్నారు అబూ తాలిబ్. తర్జనభర్జనల తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే ముహమ్మద్ (స)ను పిలిచి, జరిగిన వృత్తాంతమంతా వినిపించారు. ఇస్లామ్ ప్రచారాన్ని ఆపమని నచ్చజెప్పారు. దీనివల్ల ఖురైషులకు కలిగే ఇబ్బందుల్ని కూడా విశదీకరించారు. ఇకనైనా ధర్మ ప్రచారం ఆపకపోతే భవిష్యత్తులో సంభవించే కష్టనష్టాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఎందుకు చెబుతున్నానో వినమనీ, తన వయసును చూసైనా జాలిపడమనీ, మోయలేని భారాన్ని ఈ ముసలితనంలో తనపై వేయవద్దనీ ఒకింత ఆవేదనగా అభ్యర్థించారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
గర్భశోకమే.. మిగిలింది
శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావి ఘటన విషాదంతమైంది. చిన్నారి శాన్వి (2) కాపాడేందుకు సుమారు 12 గంటల పాటు రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యాధికారులు తమ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టినా కాపాడలేక పోయారు. తెల్లవారుజామున బయటకు తీసిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 4.30 గంటలకు శాన్వి ఇక లేదంటూ అధికారులు ధ్రవీకరించారు. ఈ ఘటన మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. బోరుబావులు వేసే విషయంలో చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యమో.. పాలకుల ఉదాసీనతో.. లేక రైతుల అలసత్వమో గానీ.. ఎంతో విలువైన, బంగారు భవిష్యత్ కలిగిన చిన్నారుల జీవితాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి బాధ్యులెవరైనా.. బలైపోయేది మాత్రం అభం శుభం తెలియని చిన్నారులే.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘోర సంఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అందుకు వల్లాల గ్రామంలో జరిగిన చిన్నారి శాన్వి ఘటనే ఉదహారణ. బతుకు దెరువు కోసం వచ్చి...బోరుబావిలో పడిన చిన్నారి శాన్వి తల్లిదండ్రులగు వరికుప్పల స్వామి, సుస్మితల స్వగ్రామం నల్లగొండ మండలం దీపకుంట గ్రామం. వడ్డెర కులానికి చెందిన వారు వృత్తిరీత్యా వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం స్వామి తన భార్య, కుమార్తెతో అత్తగారి గ్రామమైన వల్లాల గ్రామానికి రెండు వారాల క్రితం వలస వచ్చాడు. బావమరిది బొంత వెంకన్న వద్ద ఉంటూ ఇదే గ్రామానికి చెందిన కట్టగూరి అంజయ్య అనే రైతు భూమిలో బావిని తీసేపనులను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం పనులకు వెళ్లిన వారు తమ కుమార్తె శాన్విని వెంట తీసుకెళ్లారు. 12 గంటలు బోరుబావిలోనే..అప్పటి వరకుతల్లితో పాటే ఉన్న శాన్వి నిమ్మతోటలో ప్రమాదవశాత్తు వేసిన బోరుగుంతలో పడింది. వెంటనే గమనించిన శాన్వి తల్లిదండ్రులు లబోదిబోమనడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు, అధికారులకు, గ్రామస్తులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3.35 గంటలకు బోరుబావిలో చిన్నారి పడిపోగా 4.30 గంటలకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. చిన్నారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చివరకు 3.10 గంటలకు చిన్నారి శాన్విని బోరుబావిలోంచి బయటకు తీసి అర్ధగంటలో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బండరాళ్లతో అంతరాయం.. బోరుబావిలో చిన్నారిని కాపాడేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా రెండు భారీ పొక్లెయిన్లతో బావిని తవ్వారు. 150 అడుగుల లోతున్న బోరుబావిలో 25 అడుగుల లోతులో చిన్నారి శాన్వి చిక్కినట్లు అధికారులు గుర్తించారు. అందుకోసం 25 అడుగుల లోతు బావిని తవ్వారు. కానీ సమాంతర బావి అడుగు భాగంలో బండరాళ్లు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వారిని అనుమతించి ఉంటే.. సంఘటన విషయం తెలుసుకుని బోరుబావిలో పడిన చిన్నారులను ప్రత్యేకంగా తయారు చేసుకున్న పనిముట్లతో సురక్షితంగా బయటకు తీసే పనిలో నైపుణ్యత కలిగిన జిల్లాలోని మార్గులపల్లి, కోదాడ, తిప్పర్తి మండలాల చెందిన పలువురు సోమవారం రాత్రి సంఘటన స్థలానికి తరలివచ్చారు. చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అక్కడ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వారిని అందుకు అనుమతించలేదు. దీంతో వారు ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ వారిని అనుమతించి ఉంటే చిన్నారిని బయటకు తీసి ఉండేవారేమోనని, చిన్నారి ప్రాణాలతో బయటపడేదని పలువురు ఆవేదనవ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల వైఖరిని తప్పుపట్టడంతో పాటు నిర్లక్ష్యవైఖరే శాన్వి ప్రాణాలు తీసిందంటూ దుయ్యబట్టారు. బావితవ్వకానికి 12 గంటల సమయం బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు బోరుబావికి సమాంతరంగా తీసిన 25 అడుగుల బావితవ్వకానికి 12 గంటల సమయం పట్టింది. వల్లాల గ్రామంలోనే రోడ్డు విస్తరణ పనుల్లో ఉన్న రెండు భారీ పొక్లెయిన్లు మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పనులు చేపట్టినా సరైన సమయంలో సరైన సలహాలు అధికారుల నుంచి అందకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు. బోరు ఫెయిల్ కావడంతోనే..వల్లాల గ్రామానికి చెందిన రైతు కట్టగూరి అంజయ్య తనకున్న నిమ్మతోటలో ఓ వ్యవసాయ బావి తవ్వాడు. కానీ ఆ బావిలో నీరు సరిపడా పడకపోవడంతో పక్కనే వారంరోజుల క్రితం బోరు వేశాడు. కానీ వేసిన బోరు ఫెయిలయ్యింది. దీంతో ఉన్న వ్యవసాయ బావినే మరింత లోతు తవ్వించేందుకు పనులు చేపట్టాడు. అందులో భాగంగానే వ్యవసాయ బావి తవ్వకం పనులను చిన్నారి శాన్వి తండ్రి వరికుప్పల స్వామి కుదుర్చుకున్నాడు. ఒకవేళ ఆ రైతు వేసిన బోరు పడిఉంటే వ్యవసాయ బావిని మరింత లోతుకు తవ్వేవాడు కాదు.. అతను బావిని తవ్వకుంటే స్వామి వల్లాలకు వలస వచ్చేవాడు కాదు.. స్వామి వల్లాలకు వలస రాకుంటే శాన్వి బతికి ఉండేదని పలువురు వాపోయారు. ఆ బోరు ఫెయిల్ కావడమే దీనంతటికీ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. -
ఎవరి మాటా వినలేదు
‘నువ్వు చెయ్యలేవు’ ‘నీతో కాదు’ ‘ఎంత కష్టమో తెలుసా?’... ఇలా... ఎవరేం చెప్పినా, ఎవరెన్ని చెప్పినా వీరు వినలేదు! అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకే మనం అనేక జాగ్రత్తలు చెబుతాం. ఇక వీళ్లలా వైకల్యం ఉన్న పిల్లలకి ఎన్ని చెప్పాలి? చెప్పారు. తల్లిదండ్రులు చెప్పారు. అయినవాళ్లూ చెప్పారు. అయినా వీళ్లు వినలేదు. జీవన పోరాటంలో ధైర్యంగా ముందుకు దూసుకెళ్లారు. ఏ జాగ్రత్తలను, ఏ హెచ్చరికలను, ఏ భయాలనూ... లెక్క చెయ్యక ... మౌనంగా ఎదుగుతున్నారు. ధీశాలురైన ఈ యువరాజులకు సాక్షి సలామ్. మూర్తి స్వస్థలం నెల్లూరు జిల్లా. పుట్టుకతోనే వికలాంగుడు. డిగ్రీ పూర్తి చేశాడు. తెలిసిన వారి ద్వారా ఓ కాల్ సెంటర్‌కి జాబ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. తల్లీతండ్రీ కూడా కొడుకుతో పాటు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. మూర్తి జాబ్‌కు ఎంపికయ్యాడు. అయితే పేరెంట్స్ వద్దన్నారు. ‘పట్టణంలో ఒక్కడివే ఉండగలవా, ఆఫీస్‌కు వెళ్లి రావాలంటే ఒక్కడివే వెళ్లాలి. అంత దూరం కర్ర పట్టుకొని ఎలా వెళతావు? బస్సులల్లో తిరగగలవా..? ఎందుకింత కష్టం.. ఇన్నాళ్లూ బతికించలేదా.. మేమున్నంతవరకు నీకే లోటూ రాకుండా చూసుకుంటాం..’ అని తిరిగి ఊరికి తీసుకెళ్లారు. ఇప్పుడు మూర్తి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఏ పనీ లేదు. భవిష్యత్తు బెంగతో ఉన్నాడు. నల్లగొండకు చెందిన వెంకట్‌దీ ఇలాంటి కథే. చిన్నప్పుడు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయాడు. ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఫార్మా కంపెనీలో జాబ్ వచ్చింది. ఉండటానికి, తినడానికి వసతి సదుపాయాలు ఆ కంపెనీయే కల్పిస్తోంది. అందుకు సరే అంటే ఉద్యోగంలో చేరచ్చు అని చెప్పారు కంపెనీవాళ్లు. దీంతో వెంకట్ పేరెంట్స్ -‘చిన్నప్పటి నుంచి మా వాడు మమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండింది లేదు. వాడు అలా ఉండలేడు. ఇంటికి-ఆఫీస్‌కు అప్ అండ్ డౌన్ చేసే జాబ్ అయితే చేస్తాడు. తనుగా ఎప్పుడూ ఒంటరిగా వెళ్లలేదు. కాబట్టి క్యాబ్ సదుపాయం ఇస్తే బాగుంటుంది’ అన్నారు.’ కంపెనీ రూల్స్ ఒప్పుకోవన్నారు. సెలక్ట్ అయిన జాబ్ పోయింది. ఏడాది పూర్తయినా వెంకట్‌కి ఇంకా జాబ్ రాలేదు. నిజానికే అంగవైకల్యం శరీరానికే గానీ మనసుకు కాదు. నేటి రోజుల్లో అంగవికలురు ఎన్నింటిలోనో తమ సత్తా చాటుకుంటున్నారు. కుటుంబసభ్యుల మీద ఆధారపడి బతుకు భారంగా నెట్టుకురాకుండా కొత్త ఆశలతో తమకు తాముగా నిలబడుతున్నారు. కొందరు తమలాంటి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అయితే, ‘అంగవైకల్యం ఉన్నవారిని వారి కుటుంబసభ్యులే భయంతో వెనక్కి లాగుతున్నారు’ అంటున్నారు హైదరాబాద్‌లోని ‘యూత్‌ఫర్ సేవా అనేబుల్ వింగ్’ కి కో ఆర్డినేటర్‌గా ఉన్న విజయ్. ‘పెద్ద పెద్ద కంపెనీల వాళ్లు కూడా డిసేబుల్ వాళ్లను పనిలో పెట్టుకోడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. వికలాంగులు పనులు నిబద్ధతో చేయడమే అందుకు కారణం’ అని ఆయన అంటున్నారు. స్వేచ్ఛ ఇస్తేనే ఎదుగుదల... వ్యాపారం, వృత్తి, ఉద్యోగం.. ఏదైనా నచ్చిన పని చేయడానికి తగినంత స్వేచ్ఛ ఉండాలి. అందుకు తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. వికలాంగులు అవడం వల్ల పిల్లలు కష్టపడతారేమో అని వారు ఆలోచిస్తున్నారు కానీ, ‘వచ్చిన అవకాశాల్ని పోగొట్టుకుంటూ... మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వస్తాయే రావో అనే సందిగ్ధంలోనే మాలో చాలామంది రోజులను వెళ్లబుచ్చుతున్నాం’ అంటున్నారు మూర్తి. వికలాంగుడైన మూర్తి ఉద్యోగ ప్రయత్నాలు చేసి, అమ్మానాన్నలకు ఉన్న భయాల కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు. ‘నాకేం అవసరం.. అమ్మవాళ్లే అన్నీ చూస్తున్నారు కదా అనే ఫీలింగ్‌లో మరికొందరు ఉంటున్నారు. ‘నాకు నేనుగా బతకాలనే ఆలోచన కలగడం లేదు. పెద్ద చదువులు చదివాను, ఈ జాబే వస్తుందని.. ఇంటి దగ్గరే కూర్చోవడం కన్నా చిన్నవైనా సరే బతుకుదెరువు ప్రయత్నాలు చేయడం మంచిద’ని సూచిస్తున్నారు మహేష్. బధిరుడైన మహేష్ డిగ్రీ వరకు చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నారు. మహేష్‌తో పాటు మరో ఎనిమిదిమంది బదిరులు ఈ హోటల్లో ఉద్యోగం చేస్తున్నారు. వికలాంగ పిల్లల పెంపకంలో చాలామంది తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలతో వారి ప్రతి అడుగుకూ భయంతో అడ్డు పడడం సహజమే కానీ... అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ప్రేమ, రక్షణ వలయాలు పిల్లల చుట్టూ ఒక సన్నని పొరలా మాత్రమే ఉండాలే తప్ప అవి ఇనుపకంచెలా మారకూడదు. పిల్లలు తడబడే అడుగులేస్తున్నపుడు పడిపోతారని భయపడి ఎపుడూ ఎత్తుకుని తిప్పితే నడక వస్తుందా..! ఎప్పుడూ తామే వెంట ఉండాలనుకుంటే జీవితం విలువ తెలుస్తుందా..! వికలాంగుల తల్లిదండ్రులూ ఈ విషయాన్ని గుర్తించాలి. - నిర్మలారెడ్డి పనులన్నీ పెద్దలే ఎందుకు చేస్తారు? మేం చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాం కాబట్టి మా పిల్లలకు ఎలాంటి కష్టం కలగకుండా చూడాలి అనుకుంటారు తల్లీతండ్రి. అందుకని పిల్లల పనులన్నీ తామే పూర్తి చేయాలని చూస్తారు. పిల్లలకు సంబంధించిన వార్తలు చూసి లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. పిల్లలు ఒంటరిగా బయటకు వెళితే వారికేదైనా కీడు జరుగుతుందేమో అని ఇంటికే పరిమితం చేస్తారు. పిల్లలను స్నేహితులతో కలవకుండా కట్టడి చేసే తల్లిదండ్రులున్నారు. ఇది పిల్లల భావి జీవితానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను దూరం చేస్తుంది.చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమీ తెలియదని, అనుక్షణం వెయ్యి కళ్లతో కాచుకోవల్సిందేనని భావిస్తుంటారు. ఇష్టంతో చేరాలి... నేను ఇంజనీరింగ్ చేశాను. యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థలో డీటీపీ ఆపరేటర్ గా చేరాను. నాలాంటి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడే డిసేబుల్డ్ వింగ్‌ని ఎంచుకున్నాను. ఇప్పటి వరకు డిసేబుల్ పర్సన్స్‌కి వందల మందికి ఉద్యోగాలు రావడానికి శిక్షణ ఇచ్చాం. వికలాంగులైనా సరే ఇష్టంతో పనిచేయడం మొదలుపెడితే అది ఎంత కష్టమైనా భరిస్తారు. మా సంస్థ వికలాంగులకు ఆంగ్లం, గణితం, కంప్యూటర్ విద్యలలో ఉచిత శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తయ్యాక వ్యాపార సంస్థలలో (కె.ఎఫ్.సి, మ్యాక్స్, లైఫ్‌స్టైల్, హాలీడ్ ఇన్...వంటి వాటిలో) అర్హతను బట్టి నియామకాలు ఉంటాయి. - విజయ్, యూత్‌ఫర్ సేవా డిజేబుల్ వింగ్ కో ఆర్డినేటర్ మానసిక ఎదుగుదల చూడాలి... ఎంత వయసు వచ్చినా పిల్లలు తమనే అంటి పెట్టుకుని ఉండాలనుకుంటారు చాలామంది పేరెంట్స్. ఎప్పుడూ వెంటే ఉండటం వల్ల తల్లిదండ్రులతో పిల్లల అనుబంధాలు బాగుండవచ్చు. కానీ, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం కావచ్చు. మానసిక ఎదుగుదల లేకపోతే జీవితాంతం వారికి వారే భారం కావచ్చు. - గీతా చల్లా, సైకాలజిస్ట్ మాది మహబూబ్‌నగర్ జిల్లా. బధిరుడిని కావడంతో ఎలా బతుకుతానో అని అమ్మనాన్నలకు బెంగగా ఉండేది. నేను ఇంటి నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నాను. గచ్చిబౌలి దగ్గర ఓ పెద్ద హోటల్లో జాబ్‌లో చేరాను. నెల జీతం 10 వేలు. ఆరువేల రూపాయలు ఇంటికి పంపిస్తాను. - హరి ఓబులేషు మాది మెదక్ జిల్లా. ఇంటర్‌తో చదువు ఆపేశాను. మా ఫ్రెండ్ జాబ్ ద్వారా విజయ్ అన్నను కలిశాను. ఈ హోటల్లో హౌజ్‌కీపింగ్ ఎంచుకున్నాను. నాకు తెలుగులో రాయడం మాత్రమే వచ్చు. ఎలా అని మొదట చాలా భయపడ్డాను. ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. - మహేష్ ఎక్కువ చదివాను.. నాకు ఫలానా జాబే వస్తుందని.. ఇంటి దగ్గరే కూర్చోవడం కన్నా చిన్నవైనా సరే బతుకుదెరువు ప్రయత్నాలు చేయడం మంచిది. మూగవాడిని అని కూర్చుంటే నా భుక్తి ఎప్పటికీ అమ్మనాన్నలమీదే ఆధారపడి ఉండేవాడిని. అలా ఉండకూడదనే హోటల్లో జాబ్ చేస్తున్నాను. - హరిబాబు అమ్మనాన్నలకు వారి భయాలు వారికుంటాయి. అది సహజమే. కానీ, నిలబడగలం అనే ధైర్యం.. ముందు మనలో ఉండాలి. ఏడాదిగా ఇక్కడ పనిచేస్తున్నాను. పనిలో మంచి పేరు తెచ్చుకున్నాను. ముందు జీవితం అంతా ఎలాగైన బతకగలనన్న ధీమా ఉంది. - మధు ఏమీ రాదని కూర్చుంటే జీవితం ఇలాగే గడిచిపోతుంది. మా స్నేహితుల ద్వారా హోటల్లో ఉద్యోగం సంపాదించాను. సొంత కష్టం ద్వారా సంపాదించినది ఎప్పుడూ ఇంకా ఇంకా బలాన్నే ఇస్తుంది. ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుంది. - జహీర్ -
తమాషాగా ఉందా..!
సమస్యలు చెప్పుకునేందుకు వచ్చి ప్రజలపై సీఎం ఆగ్రహం పనిచేయని అధికారులకు హెచ్చరికలు విశాఖలో పారిశుధ్యం, కాలుష్యం, అభివృద్ధి పనుల పరిశీలన ‘ఏయ్.. తమాషాగా ఉందా.. తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా.. నువ్వేంటమ్మా.. విను ముందు.. మీకు టాయిలెట్లు ఉన్నా బయటకే వెళతారు. నాకు తెలియదా..మాట్లాడకండి.’అంటూ విశాఖ వాసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం: విశాఖ నగర అభివృద్ధిపై భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు స్పష్టమైన అవగాహన తెచ్చుకోవడానికంటూ విశాఖ నగరంలో సీఎం ఆదివారం పర్యటించారు. ఒక బస్సులో నగరంలోని కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులను, మూడు బస్సుల్లో అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని ఉదయం 6.30 గంటలకు సర్క్యూట్‌హౌస్ నుంచి ప్రత్యేక బస్సులో బయలు దేరి భీమిలి వరకూ వెళ్లి మధ్యాహ్నం 2గంటలకు కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఏడున్నర గంటల పాటు అనేక ప్రాంతాల్లో కలియతిరిగారు. వివిధ ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రాంనగర్ సెవెన్‌హిల్స్ ఆసుపత్రి సమీపంలో మురుగు కాలువను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రెయిన్‌కు మరమ్మతులు చేపట్టి చుట్టూ మొక్కలు నాటాల్సిందిగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలకు భారీగా కేబుల్స్ ఉండటాన్ని గమనించి వాటిని తొలగించాలని అక్కడే ఉన్న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజుకు సూచించారు. అండర్‌గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించగా, ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సీఎండీ బదులిచ్చారు. రహదారులు మరమ్మతులు చేస్తున్నప్పుడే అండర్‌గ్రౌండ్ విద్యుత్ పనులు చేసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న వుడా సెంట్రల్ పార్కును సందర్శించారు. పార్కును ఆధునీకరించడానికి ప్రణాళికలు తయారు చేయడంతో పాటు నగరానికి చిహ్నంగా ఎక్కడోచోట డాల్ఫిన్ అక్వేరియం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులో యోగా సెంటర్ కావాలని వాకర్స్ కోరగా యోగా సెంటర్‌తో పాటు ధ్యాన మందిరాన్ని కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపల మార్కెట్‌ను పరిశీలించి మార్కెట్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం మాత్రమే కాకుండా రోజూ చేపలు విక్రయించవచ్చుకదా అని అడగగా సౌకర్యాలు లేవని వారు బదులిచ్చారు. 29వ వార్డు అచ్చెయ్యమ్మపేటలోని దిడ్డి జగన్నాధరావు కల్యాణ మండపం వద్ద మురుగు కాల్వ పనులను పరిశీలించారు. అక్కడి యాచకురాలికి తన సొంత డబ్బులు రూ.2 వేలు అందజేశారు. పనిచేయకుంటే ఇంటికి పంపిస్తా 24గంటల్లో పనులు పూర్తిచేయకపోతే ఉద్యోగం ఉండదని జోనల్ కమిషనర్ వై.శ్రీనివాసరావును హెచ్చరించారు. ప్రజామరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు కల్యాణ మండపాన్ని పరిశీలించారు. దానితో పాటు నగరంలోని 29 కల్యాణ మండపాలను స్వాధీన పరుచుకుని ఆధునీకరించి, తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. విశాఖ పోర్టు సమీపంలో బొగ్గు నిల్వలను సీఎం పరిశీలించారు. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాల్సిందిగా పోర్టు డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరినాథ్‌ను ఆదేశించారు. ఎస్సార్ కంపెనీ వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై సంస్థతో పాటు సంబంధిత అధికారులు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సింహాచలం రోడ్డులో స్థానికులు తమను ఆలయ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పుకున్నారు. వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే సీఎం ముందుకు కదిలారు. సింహాచలం బీటీఆర్ కారిడార్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. విమ్స్‌ను బస్సులో నుంచే సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమిలి పార్కును పరిశీలించి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. భీమిలి-విశాఖ బీచ్ రోడ్డును పరిశీలించారు. బీచ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఏయు కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించారు. నిధుల మంజూరు చేస్తామని, డిసెంబర్ 20లోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. -
కశ్మీర్...మా జీవనాడి
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్య ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్‌ను తమ దేశ జీవనాడిగా అభివర్ణించారు. ఏటా ఈనెల 5న ఆనవాయితీగా నిర్వహించే కశ్మీర్ సంఘీభావ దినాన్ని పురస్కరించుకొని ముజఫరాబాద్‌లోని పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. కశ్మీర్‌తో తనకు బాల్యం నుంచి అనుబంధం ఉందన్నారు. కశ్మీర్...పాక్ జీవనాడి అని, అందువల్ల కశ్మీరీల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నా రు. కశ్మీర్‌పై సరైన తీర్మానం ద్వారానే దక్షిణాసియాలో శాంతి సాధ్యమన్నారు. 150 కోట్ల మందికిపైగా ఉన్న ప్రజల భవిష్యత్తు కశ్మీర్ అంశంతో ముడిపడి ఉందని షరీఫ్ చెప్పారు. కశ్మీరీలకు స్వీయనిర్ణయాధికార హక్కు కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు. కాగా, కశ్మీర్‌ను పాక్ జీవనాడిగా షరీఫ్ అభివర్ణించడంపై భారత్ విరుచుకుపడింది. ఎన్నటికీ దక్కదని తెలిసినా తమది కాని దాన్ని(కశ్మీర్) కోరుకోవడాన్ని పాక్ ఆపాలని హితవు పలికింది. -
ఉద్యమమే ఊపిరి..
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఆందోళనలు పార్టీ బలోపేతానికి మహాసభల్లో కార్యాచర ణ రూపొందిస్తాం ‘సాక్షి’తో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ ఉద్యమానికి తమ పార్టీ జిల్లాలో ఊపిరిలూదిందని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమ పాత్ర కీలకమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు తెలిపారు. ఈనెల 17, 18 తేదీలలో భద్రాచలంలో పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణ, ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మూడు సంవత్సరాలుగా జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కదిలించామని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, గిరిజనులకు పోడు భూముల పట్టాలు తమ ఉద్యమ ఫలితమేనని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తదితర అంశాలపై పోరాడుతామని వివరించారు. అవి ఆయన మాటల్లోనే... ‘దేశవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు, బూర్జువా వర్గాలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నాయి. గత ఎన్నికల్లో వామపక్ష శక్తులు బలంగా ఉన్న చోట విపరీతంగా డబ్బు ఖర్చుచేయడంతో పాటు రకరకాల ప్రలోభాలకు పాల్పడ్డారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వామపక్షాలు అగ్రభాగాన నిలవడం కొన్ని శక్తులకు, సంస్థలకు కంటగింపుగా మారింది. అందుకే వామపక్ష వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ బలోపేతానికి కృషి.. జిల్లాలో అన్ని మండలాల్లో సీపీఐ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోంది. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక ఆందోళనలు చేపట్టాము. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరిని ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు, కొత్త ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఆందోళనలు నిర్వహించడం, ప్రజల్లో రాజకీయ, సైద్ధాంతిక అవగాహన కల్పించడం ద్వారా కొద్ది రోజుల్లో పూర్వ వైభవాన్ని సాధిస్తాం... సమస్యలపై వామపక్షాలు పోరాడుతాయి... ఖమ్మం జిల్లా వామపక్ష ఉద్యమానికి పురిటిగడ్డ.. సైద్ధాంతికంగా కొన్ని విభేదాలున్నా సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుతున్నాము. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలు ఐక్యంగా చేపట్టిన పలు ఆందోళనలకు ప్రజల మద్దతు లభించింది. భవిష్యత్తులో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం. ఇక ముందు కూడా ప్రధానమైన సమస్యలపై కలసి పోరాడేందుకు సీపీఐకి ఎటువంటి ఇబ్బంది లేదు. వామపక్ష ఉద్యమంలో ఎన్నికలు ఒక అంకం మాత్రమే. ప్రజా ఉద్యమాలతో ఎన్నికల ఫలితాలను పోల్చడం సరికాదు. కాంగ్రెస్‌తో పొత్తు కలిసి రాలేదు.. 2014 ఎన్నికల్లో జిల్లాలో సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు అంతగా కలిసి రాలేదు. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ శక్తులు కమ్యూనిస్టు అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. దీనికితోడు మిగిలిన పార్టీలు ఎన్నడూ లేనంతగా విచ్చలవిడిగా చేసిన ఖర్చు కూడా సీపీఐ ఓటమికి కారణమైంది. మిత్రపక్షం సహకారం పూర్తిస్థాయిలో లభించకపోవడం, ఎన్నికల్లో పెరిగిన ధన ప్రభావం ఓటమికి కారణమని మా సమీక్షలో తెలిసింది. మహాసభల్లో ప్రత్యేక కార్యాచరణ... 17 నుంచి జరిగే జిల్లా మహాసభల్లో విస్తరణ దిశగా కార్యాచరణ రూపొందిస్తాము. జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు అవకాశాలున్నాయి. ఐక్యంగా ముందుకు వెళ్లనున్నాము. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటిపైనా చర్చించి వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నాము. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న కార్యక్రమాలు, చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కమ్యూనిస్టు పార్టీ మార్గంలో పయనించాలని ఆహ్వానిస్తాము. గ్రామ గ్రామాన కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం అయ్యేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి. జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యే 600 మంది ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తాము. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు... ప్రధానంగా పోడు భూముల సమస్య జిల్లా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోం ది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నాము. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌చేస్తూ ప్రత్యేక ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నాము. పారిశ్రామిక ప్రగతికి జిల్లాలో సానుకూలంగా ఉన్నందున స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమ లు రూపొందించాలని ఆందోళన చేపడతాము. సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటాలు నిర్వహిస్తాము.ప్రజాసంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాము’. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ సింగరాచార్య ముగిసిన ఇంటర్ విద్యార్థుల ఇన్స్పైర్ క్యాంపు కేయూ క్యాంపస్ : విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాచార్య సూచించారు. కేయూ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆ విభాగం సెమినార్ హాల్లో ఇంటర్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఐదు రోజుల ఇన్స్పైర్ సైన్స్ క్యాంప్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో సింగరాచార్య ముఖ్యఅతిథిగా మాట్లాడారు. భారతదేశంలో అనేక వనరులు ఉండి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే, వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం వల్లే సమస్యల పరిష్కా రం సాధ్యం కావడం లేదన్నారు. ఈ మేరకు విద్యార్థులు శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడమే కాకుండా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. ఇంటర్ పూర్తి కాగానే నిర్ణయించుకోవాలి.. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇన్స్పైర్ ప్రోగ్రాంలు దోహదం చేస్తాయని నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి అన్నార. క్యాంపులో భాగంగా పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు చెప్పిన అంశాలను సోపానంగా చేసుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కాకుండా అంతకంటే మెరుగైన ఉపాధి కల్పించే ఎన్నో కోర్సులు ఉన్నాయని తెలిపారు. అయితే, విద్యార్థులు ఇంటర్ పూర్తి కాగానే తమ భవిష్యత్ ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకుని దాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఇన్స్పైర్ క్యాంపు కోఆర్డినేటర్ ఎం.కృష్ణారెడ్డి, జువాలజీ విభాగాధిపతి స్వామి మాట్లాడారు. కాగా, చివరి రోజు సెషన్లో భాగంగా ఎన్జీ రంగా యూనివర్సిటీ శాస్త్రవేత్త ఉమారెడ్డి అగ్రికల్చర్ బీటెక్ ప్రాధాన్యతను వివరించారు. హైదరబాద్ ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ సీహెచ్.రాజిరెడ్డి మాట్లాడుతూ మానవాళి సంక్షేమం, నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులు, ఆహార పదార్థాల్లో కెమిస్ట్రీ ఉపయోగాలను తెలి పారు. ఆ తర్వాత క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు రక్షిత, అరుణ్,అభినవ్, మహేష్ మాట్లాడుతూ తాము నేర్చుకున్న అంశాలు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అయితే, పదో తరగతిలో 9 జీపీఏ వచ్చిన వారికే కాకుండా 8 జీపీఏ వచ్చిన వారికి క్యాంపులో పాల్గొనే అవకాశం కల్పించి పది రోజుల పాటు నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముగింపు సమావేశంలో భాగంగా పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
పడి లేచిన కెరటం!
అమితాబ్‌కు పరాజయం కొత్తేమీ కాదు. చాలా పాత చుట్టం. అయితే ఆ చుట్టాన్ని చూసి బెదిరి పోలేదు. చిన్నబుచ్చుకోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. విజయపతాకాన్ని ఎగరేశారు. అమితాబ్ రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ కాలేదు. హీరో కావడానికి సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు- ‘‘ఈ గొంతుతో ఎలా హీరో అవుదామనుకున్నావయ్యా!’’ అని ఒకరు. ‘‘ఇంత ఎత్తుతో ఎలా హీరో అవుతావు!’’ అని ఒకరు. ఒక్కరా ఇద్దరా? అమితాబ్ మనసు విరిగే మాటలెన్నో వినబడేవి. అయితే అవి అతని పట్టుదలను రెట్టింపు చేశాయి తప్ప నిరుత్సాహం నింపలేదు. సూపర్‌స్టార్ అయ్యేవరకు మడమ తిప్పలేదు. ‘అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్’ లిమిటెడ్ (ఎ.బి.సి.ఎల్). పేరుతో సొంత కంపెనీ మొదలుపెట్టారు బిగ్‌బి. ఈ కంపెనీ నుంచి విడుదలైన తొలి సినిమా ‘తేరే మేరే సప్నే’ పరాజయం మూటగట్టుకుంది. ‘ఎ.బి.సి.యల్’ భవిష్యత్‌కు ఇదో సూచనలా మిగిలింది. యాక్షన్ హీరోగా మరోసారి పలకరించడానికి 1997లో ‘మృత్యుదాత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు అమితాబ్. తన సొంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా పరాజయం పొందింది. నష్టాలు తెచ్చింది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో నష్టాలు. ఒకానొక దశలో కంపెనీ ఊహించని రీతిలో దివాళా తీసింది. ఇండియన్ ఇండస్ట్రీస్ బోర్డ్ ‘ఎ.బి.సి.ఎల్’ను ‘ఫెయిల్డ్ కంపెనీ’గా ప్రకటించింది. నష్టాల నుంచి కోలుకోవడానికి బాంబేలోని బంగ్లాను, రెండు ఫ్లాట్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ‘‘అమితాబ్ పని అయిపోయింది’’ అనుకున్నవాళ్లు ఉన్నారు. ‘‘అంత పెద్ద స్టార్ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది’’ అని జాలి పడిన వాళ్లు ఉన్నారు. అమితాబ్ మాత్రం ఓటమిని చూసి పలకరింపుగా నవ్వారు. ఆ నవ్వులో ‘నేను మళ్లీ గెలుస్తాను’ అనే ఆత్మవిశ్వాసం ఉట్టిపడింది. యాభై అయిదు సంవత్సరాల వయసులో మరో విజయం కోసం నడుం బిగించాడు. అప్పుడంటే యవ్వనోత్సాహం ఉంది. సంపూర్ణ ఆరోగ్యం ఉంది. ఒక్కసారి కిందపడినా పదిసార్లు లేచే ఓపిక ఉంది. మరి ఇప్పుడు? ఉత్సాహం ఉందిగానీ...వయసు తోడుగా లేదు. ఆరోగ్యం ఉందిగానీ...సంపూర్ణ ఆరోగ్యం లేదు. అప్పటితో పోల్చితే ‘లేదు’లు బోలెడు ఉన్నాయి. అయితే ఆయన దగ్గర ఈ వయసులోనూ ఒకే ఒకటి ఉంది. ‘ఒక్కసారి కింద పడినా పదిసార్లు లేచే శక్తి’ ‘తనలోని శక్తి ఏమిటో కనుగొనేవాడే..నిజమైన శక్తిమంతుడు’ అంటారు. మరి తనలోని శక్తి ఏమిటి? వ్యాపారం...కాదు. రాజకీయాలు...కాదు. తన శక్తి ఏమిటో తనకు తెలుసు. అదే ‘నటన’ ఏ నటనతోనైతే తాను పైగా ఎదిగాడో, అదే నటనతో మళ్లీ తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడు. ‘బడే మియా చోటే మియా’(1998) సినిమాతో కొద్దిగా పైకి లేచి యశ్‌చోప్రా ‘మహబ్బతే’(2000)తో విజయం అనే క్రీజ్‌లో నిలుదొక్కుగోలిగారు. సినిమా నటులు బుల్లితెరపై నటించడాన్ని తక్కువగా చూసే రోజుల్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో బుల్లితెరకు కొత్త వెలుగు ఇచ్చారు. తన విజయ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు అమితాబ్ వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ‘ఓటమి’ భూతం కనికరం లేకుండా అతడిని పలకరించినా... మళ్లీ లేచి కాలరు ఎగరేసే సత్తా ఆయనకు పుష్కలంగా ఉంది. -
కొనే ముందే ఆలోచించాలి..
మార్కెట్లోకి వచ్చే కొంగొత్త గ్యాడ్జెట్స్.. లగ్జరీ ఉత్పత్తులు మనసుకు నచ్చితే ఒకోసారి ఖరీదెంతయినా కొనేస్తుంటాము. కొత్తల్లో బాగానే ఉంటుంది. కొన్నాళ్లు గడిచాక.. వాటిని ఎప్పుడో గానీఉపయోగించకుండా ఓ మూలన పడి మూలుగుతున్నప్పుడో లేదా జాగ్రత్తపెట్టడానికి తగినంత జాగా లేనప్పుడోఅనిపిస్తుంది.. అనవసరంగా కొన్నామేమోనని. ఇలా అత్యుత్సాహంతో కొనేసి.. ఆ తర్వాత తీరిగ్గా బాధపడకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. అలాంటివే ఇవి. ఏదైనా సరే తక్కువకి లభిస్తోందంటే.. అవసరమున్నా, లేకున్నా కొనేయాలనిపించడం సహజమే. నిజానికి మనకు ఆదా అయ్యేది తక్కువే అయినా కూడా సేల్‌లో కొనుక్కోకపోతే ప్రయోజనాలు కోల్పోతున్నామేమో అని బాధగా ఉంటుంది. అయితే, ఇలాంటప్పుడే సంయమనం పాటించాలి. కొనేసేయడానికి ముందు సదరు వస్తువు అవసరమా, తీసుకుంటే ఎంత వరకూ ఉపయోగపడుతుంది అన్నది కాస్త ఆలోచించాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఒకవేళ ఆఫర్ లేకపోయినా దాన్ని కొని ఉండే వారమా అన్నది ఒకసారి బేరీజు వేసుకుంటే అనవసర కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయొచ్చు. రేప్పొద్దున్న కోసం కొనొద్దు.. భవిష్యత్ గురించి ప్రణాళిక వేసుకోవడం మంచిదే. అయితే, ఎప్పుడో ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో సంవత్సరాల తరబడి ముందుగా కొని పెట్టుకోవడం మాత్రం అంత సరికాదు. పెపైచ్చు వాటిని ఏళ్ల తరబడి దాచిపెట్టడం ఒక పెద్ద పని కాగా.. నిజంగా వాడే సమయం వచ్చేటప్పటికి అవి పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. అవసరాన్ని బట్టే షాపింగ్.. నిత్యావసరాల కొనుగోలుకు బైల్దేరే ముందు ఇంట్లో ఏవేవి ఎంతెంత ఉన్నాయో ఒకసారి చూసుకోవడం ఉత్తమం. లేకపోతే..షాపుకి వెళ్లిన తర్వాత తడుముకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న వాటినే మళ్లీ కొనే అవకాశమూ ఉంది. ఫలితంగా డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టినట్లవుతుంది. అలాగే టేబుల్ క్లాత్ లాంటివి కొనడానికి వెడుతున్న పక్షంలో ముందుగా ఎంత సైజువి తీసుకోవాలో ఇంటి దగ్గరే ఆయా వస్తువుల కొలతలు తీసుకెళ్లాలి. అలా చేయకుండా ఏదో ఒకటి కొని తెచ్చుకుని, తీరా అది సరిపోకపోతే తలపట్టుకోవాల్సి వస్తుంది. కాస్త ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తే సమయమూ, డబ్బూ ఆదా చేసుకోవచ్చు. ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్‌తో జాగ్రత్త.. బ్రెడ్ మేకర్లు, ఐస్‌క్రీమ్ మేకర్లు, జ్యూసర్లులాంటి ఫ్యాన్సీ ఉత్పత్తులతో పని చాలా సులువవుతుంది కానీ.. వీటిని ఎప్పుడో తప్ప ఎక్కువగా ఉపయోగించము. మొదట్లో ముచ్చట కొద్దీ బాగానే ఉపయోగించినా .. ఆ తర్వాత మాత్రం చాలా రోజుల పాటు ఇవి అటకెక్కి దుమ్ముకొట్టుకుంటూ ఉంటాయి. ఇంటి దగ్గరే ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు చేసుకోవడం అప్పుడప్పుడు సరదాగా అనిపించినా.. అంత కష్టపడనక్కర్లేకుండా సులభంగా షాపు నుంచి కొనుక్కొచ్చుకోవడానికే ఓటేస్తుంటాం. కనుక, ఇలాంటివి కొనుక్కోవడానికి ముందుగా ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాటిని కొద్ది రోజుల కోసం తీసుకుని వాడి చూడండి. అది మీకు నచ్చి, మీ ఇంట్లో తగినంత జాగా కేటాయించగలిగిన పక్షంలో కొనుక్కోవడంపై నిర్ణయం తీసుకోండి. అప్‌గ్రేడ్.. ఇది అన్ని కొనుగోళ్లకూ వర్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు. ఏదైనా వస్తువును పూర్తిగా ఉపయోగించిన తర్వాతే దాని అప్‌గ్రేడ్ గురించి ఆలోచించండి. చేతిలో ఉన్న దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకున్న తర్వాతే కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు కొనడంపై దృష్టి పెట్టొచ్చు. అప్‌గ్రేడ్ కోసం ఒకటి తీసుకుంటున్న పక్షంలో దాని పాత వెర్షన్‌ని ఏదో రకంగా సాగనంపడానికి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు పాత టీవీలు, కంప్యూటర్ మానిటర్లు వంటి వాటిని దాచడానికి జాగా కోసం వెతుక్కోనక్కర్లేదు. ఇక, చివరిగా డిస్కౌంటు ఆఫర్లిస్తున్నారని కొనేయడమూ, కొంగొత్త ఉత్పత్తులతో ప్రయోగాలు చేయడమూ అప్పుడప్పుడైతే ఫర్వాలేదు కానీ.. ఇదే అలవాటుగా మారితే మాత్రం కష్టమేనని గుర్తుంచుకోవాలి. అవసరం లేనివి ఎడాపెడా కొనేస్తుంటే డబ్బు వృథా కావడంతో పాటు వాటిని సరిగ్గా భద్రపర్చలేకపోతే ఇల్లంతా గందరగోళంగా మారే అవకాశమూ ఉంది. -
బుధియా...ఇప్పుడో ‘గుడియా’
బుధియా సింగ్.. ఈ పేరెక్కడో విన్నట్లుంది కదూ.. అవును.. ఈ పరుగుల బుడతడి గురించి తెలియని క్రీడాభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.! 2005-06లో దేశవ్యాప్తంగానే కాదు... ప్రపంచ వ్యాప్తంగా బాగా మార్మోగిన పేరు బుధియా. నాలుగేళ్లకే 48 సార్లు మారథాన్ (42 కిలోమీటర్ల పరుగు) పూర్తి చేసి అప్పట్లో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రీడా పండితులైతే ఒకడుగు ముందుకేసి అతన్ని భారత అథ్లెటిక్స్‌కు భవిష్యత్ తారగా అభివర్ణించారు. 8 ఏళ్ల తర్వాత.. బుధియా ఇప్పుడో గతం.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.. ఒకప్పుడు అతని పరుగును చూసి భేష్ అని మెచ్చుకున్న వాళ్లే ఇప్పుడు అతన్ని చూసి... ప్చ్.. అని జాలిపడిపోతున్నారు. ఇందుకు కారణం.. అప్పటి పరుగుల బుడతడు ఇప్పుడు ఓ బొమ్మ(గుడియా)లా మారిపోయాడు. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ఇప్పుడు ఎక్కడున్నాడు..? 2002లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జన్మించిన బుధియా వయస్సు ఇప్పుడు 11 ఏళ్లు. నాలుగేళ్ల వయసులోనే మారథాన్‌లో సంచలనాలు సృష్టించిన బుధియా సింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి.. కానీ ఇప్పుడా కుర్రాడు.. భువనేశ్వర్‌లోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ఓ సాధారణ అథ్లెట్ మాత్రమే. అక్కడున్న క్రీడాకారులతో పాటే అతడూ శిక్షణ పొందుతున్నాడు. అతనికంటూ ఓ స్పెషల్ కోచ్ లేడు. మామూలు గ్రౌండ్‌లోనే పరిగెత్తుతున్నాడు. అలాగని అరకొర సౌకర్యాల మధ్యే బుధియా రోజూ మారథాన్ పూర్తి చేస్తున్నాడనుకుంటే పొరపాటే . ఎందుకంటే అతడు పరుగెత్తేది కేవలం ఒకట్రెండు రౌండ్లే..! ఇప్పుడు బుధియాలో ఎలాంటి ప్రత్యేకతలు లేవు. చిన్న పిల్లాడిగా ఉన్న సమయంలో కిలోమీటర్ల కొద్దీ పరుగెత్తిన అతడికి ఇప్పుడు ఆ శక్తి లేదు.. ప్రత్యేక గుణాలు అంతకన్నా లేవు. ఇప్పుడంతా అతన్ని చూసి జాలిపడిపోతున్నారు.. కానీ జాలి పడాల్సింది ఈ వ్యవస్థను చూసి..! ‘హాస్టల్లో బుధియా అందరిలాంటి వాడు.. అతనిలో ఎలాంటి ప్రత్యేక గుణాలు లేవు. ఫిట్నెస్ కూడా అంతంత మాత్రమే. నా దృష్టిలో బుధియా మామూలు అథ్లెట్ మాత్రమే. 600 మీటర్ల దూరం పరిగెత్తడానికి కూడా అతడు ఇంకా చిన్నవాడే’. - రూపన్విటా పాండా, అథ్లెటిక్స్ కోచ్ నాలుగేళ్లకే స్టార్... అది 2006... మే నెల... భువనేశ్వర్ నుంచి పూరీ వరకు మండుటెండను సైతం లెక్కచేయకుండా 65 కిలోమీటర్ల దూరాన్ని నాలుగేళ్ల బుధియా కేవలం ఏడు గంటల్లో పూర్తి చేశాడు. దీంతో అతడు ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయాడు. టీవీల్లో హల్చల్ చేశాడు. కొన్ని ప్రకటనల్లో నటించాడు. బుధియాను అద్భుతమైన అథ్లెట్‌లా తయారు చేసేందుకు మేమున్నామంటూ స్పాన్సర్లు కూడా ముందుకు వచ్చారు. అలా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తన ప్రమేయం లేకుండానే వివాదాల్లోకి బుధియా ఎంతవేగంగా పైకొచ్చాడో.. అంతే వేగంగా తనకు తెలియకుండానే వివాదాల్లో ఇరుక్కున్నాడు. డబ్బులు అమాంతం వచ్చిపడటంతో అతని తల్లికి, కోచ్ బిరంచిదాస్కి మధ్య వివాదాలు తలెత్తాయి. చివరికి తన కొడుకును హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది అతని తల్లి. ఇదే బుధియా పతనానికి నాంది పలికింది. 11 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఇలా పరిగెత్తకూడదంటూ ఉన్న నిబంధనను అమల్లోకి తెచ్చిన ఒడిశా ప్రభుత్వం... 2007లో బుధియా లాంగ్ డిస్టెన్స్ రన్‌పై నిషేధం విధించింది. అతన్ని స్పోర్ట్స్ హాస్టల్‌కు పంపింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మారథాన్ వైపు బుధియా అడుగులు పడనే లేదు. ఒకప్పుడు గంటల కొద్దీ గ్రౌండ్‌లోనే గడిపిన కుర్రాడు... ఇప్పుడు చదువుకు మాత్రమే పరిమితమయ్యాడు. నిషేధం కారణంగా మైదానంలో గడపలేకపోతున్నాడు. మర్చిపోవాల్సిందేనా..? అంతర్జాతీయ స్థాయిలో మెరికల్లాంటి అథ్లెట్లను తయారు చేసేందుకు చాలా దేశాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు శిక్షణనిస్తారు. చైనాలో అయితే మూడు నుంచి ఆరేళ్ల లోపు వారికే ఆయా క్రీడాంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. చిన్న వయసులోనే శిక్షణ ఇస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నది వారి భావన.. బుధియా లాంటి వాడు చైనాలో పుట్టుంటే ఇప్పటికే లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా మెరిసే వాడేమో.. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. కొద్ది నెలల్లోనే అతనిపై ఉన్న నిషేధం తొలగిపోనుంది. అది ముగిసిన వెంటనే బుధియాను తిరిగి మునుపటిలా లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌ను తయారు చేయవచ్చు. అయితే ఇది సాధ్యమేనా ? నాకు స్పోర్ట్స్ హాస్టల్లో ఉండాలని లేదు... కిలోమీటర్ల కొద్ది పరుగెత్తే అవకాశం లేదు. ఒకప్పుడు గంటలకొద్దీ ఫీల్డ్‌లో ఉండేవాణ్ని. ఇప్పుడు అదే సమయాన్ని చదువుకోవడానికి కేటాయిస్తున్నా.. ఇక్కడ సరైన శిక్షణ లేదు. సరైన పౌష్టికాహారం అందడం లేదు - బుధియా -
పసి పిల్లలు ఎందుకు నవ్వుతారు?
అధ్యయనం పిల్లలు ఎందుకు నవ్వుతారు?’ అని అడిగితే- ‘నవ్వొచ్చింది కాబట్టి’ అని జవాబు చెప్పడం తేలికేగానీ బ్రిటన్ పరిశోధకుడు డా.ఆడ్‌మన్ ఈ తేలికైన సమాధానంతో తృప్తి పడదలుచుకోలేదు. పసిపిల్లల నవ్వుల వెనక కారణాలను తెలుసుకోవడానికి నడుం కట్టాడు. దేశదేశాలు తిరిగి పరిశోధనలు చేశాడు. ఏ సమయంలో నవ్వుతారు? ఎందుకు నవ్వుతారు? మొదలైన వాటితో ఒక ప్రశ్నావళిని రూపొందించి తల్లిదండ్రుల ముందుంచి లోతైన అధ్యయనానికి పూనుకున్నాడు ఆడ్‌మన్. నవ్వు, చిరునవ్వులు... అనేవి పిల్లలు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరును ప్రతిఫలిస్తాయి అంటాడు ఆడ్‌మన్. మగ శిశువులతో పోల్చితే, ఆడ శిశువులు తక్కువగా నవ్వుతారట. మగ శిశువులు రోజులో 50సార్లు నవ్వితే, ఆడశిశువుల మాత్రం 37 సార్లు నవ్వుతారట. గోడకు రకరకాల జంతువుల స్టికర్లు అతికించి పిల్లలకు వాటిని చూపి స్పందన తెలుసుకోవడం(కొందరు నవ్వుతారు... కొందరు నవ్వరు) కూడా ఈ పరిశోధనలో భాగమే. దీంతో పాటు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆడ్‌మన్ పరిశోధన తీరును చూస్తే భవిష్యత్‌లో పిల్లల నవ్వులకు సంబంధించి విలువైన సమాచారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
విద్యార్థుల బంగారు భవిష్యత్తులో గురువుల పాత్ర కీలకం
సాక్షి, బళ్లారి : విద్యార్థుల బంగారు భవిష్యత్తు రూపకల్పనలో తల్లిదండ్రులతోపాటు గురువుల పాత్ర కూడా కీలకమని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఆయన సోమవారం నగరంలోని నంది స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. హైస్కూల్ స్థాయి నుంచి క్రీడల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తన మాదిరిగా క్రికెట్లో ఎదగడం చాలా సులభమన్నారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీలో కూడా 100 మంది భారత క్రికెట్‌కు ఎంపిక అవుతారని సూచించారు. నంది స్కూల్ యజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల, కాలేజీ ఎంతో చక్కగా ఉందని కొనియాడారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. తాము చదువుకునే రోజుల్లో వసతులు చాలా తక్కువ ఉండేవని, అయితే నేడు ఎన్నో సౌకర్యాలున్నాయని విద్యార్థులు వాటిని ఉపయోగించుకుని ముందుకెళ్లాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వాలు కూడా విద్యకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి పౌరులుగా ఎదిగి దేశానికి కీర్తి తీసుకుని రావాలని అభిలషించారు. అనంతరం నంది స్కూల్ విద్యార్థుల క్రీడలను ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ చేతన్‌సింగ్ రాథోడ్, నంది పాఠశాల చైర్మన్ ఉమేర్ అహ్మద్, ఏఎస్పీ సీకే బాబా తదితరులు పాల్గొన్నారు.