హెచ్ సీయూ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం ఇటీవలే కాస్త చల్లబడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ)లో మరో విద్యార్థి అదృశ్యం కలకలకం రేపుతోంది. పీహెచ్ డీ చదువుతోన్న డి. సురేశ్ జోసెఫ్(28) కొద్ది రోజులుగా కనిపించకుండాపోవడం విద్యార్థులతోపాటు అధికారులను కలవరపెడుతోంది.
ఇదే విషయమై వర్సిటీ అధికారులు గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. తప్పిపోయిన విద్యార్థి సురేశ్ జోసెఫ్ కేరళకు చెందినవాడని, కొద్దికాలంగా అతడి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హెచ్ సీయూ సీఎంఓ రవీంద్ర కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు.