30లక్షల మందితో మహాసభ
వీరన్నపేట (మహబూబ్నగర్) : ఎస్సీ వర్గీకరణ కోసం 23ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు గాలి యాదయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాదిగ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. యాద య్య మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టాలని నవంబర్ 20న హైదరాబాద్లోని నిజాం కళాశాల గ్రౌండ్లో 30లక్ష ల మంది మాదిగలతో ధర్మయుద్ధ మహా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభ నిర్వహణలో భాగంగా ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు అంబేద్కర్ కళాభవన్లో సమాయత్త సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ రానున్నారని అన్నారు. సమావేశంలో వెంకటేష్ మాస్టర్, సువార్తమ్మ, ఎ.రాములు, పి.చెన్నయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.