government not responce
-
తపాలా ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం
అనకాపల్లిటౌన్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పదహారు రోజులుగా తపాలా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని గ్రామీణ తపాలా ఉద్యోగుల జేఏసీ సంఘ ప్రతినిధి కె.మనోహర్ అన్నా రు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన రిలే నిరాహారదీక్షల్లో ఆయన మాట్లాడారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను తక్షణమే ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీ త్రీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, ఏఐజీడీఎస్ సంఘం డివిజన్ ఆర్గనైజర్ వి.ప్రకాశరావు, ఎఫ్ఎన్పీవో డివిజన్ కార్యదర్శి ఎ.లోవరాజు, అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ మద్దతు గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మళ్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 22 నుంచి తపాలా ఉద్యోగులు సమ్మె చేపడతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం అన్నారు. వారు చేపడుతున్న ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సంఘ నాయకులు పి.ఎన్.వి.పరమేశ్వరరావు, దాకారపు శ్రీనివాసరావు, ఎస్.బ్రహ్మాజీ, ఎం.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర లక్ష్యమేదీ
పుష్కర ఎత్తిపోతల పథకం పనుల్లో సర్కారు అలక్ష్యమే కనిపిస్తోందిl నిర్దేశించిన ఆయకట్టుకు నీరేదీ...? పురుషోత్తపట్నం టెండర్లలో అవకతవకలు కాగ్ అక్షింతలు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బెత్తం తీసింది. ఎత్తిపోతల పథకాల్లో చూపెడుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది. పుష్కర ఎత్తిపోతల పథకం లక్ష్యం ఏమిటి...? ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించింది. పురుషోత్త పట్నం ఎత్తిపోతల పథకం టెండర్లపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : పుష్కర ఎత్తిపోతల పథకం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడాన్ని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) తప్పుపట్టింది. కాగ్ విడుదల చేసిన తాజా నివేదికలో జిల్లాలోని పుష్కర ఎత్తిపోతల పథకంతోపాటు చంద్రబాబు సర్కార్ ఇటీవలనే చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తీరును తప్పుపట్టడం గమనార్హం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మెట్ట ప్రాంత రైతుల కోసం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని రాజానగరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో బీడువారిన లక్షా 87వేల ఎకరాల్లోని బీడు భూముల్లో గోదావరి జలాలను మళ్లించి మెట్ట రైతులకు సిరులు కురిపించాలని నాడు వై.ఎస్. కలలుగన్నారు. సీఎం వై.ఎస్. 2008లో యూపీఏ చైర్పర్స¯ŒS సోనియాగాంధీతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభింపజేశారు. ఈ ఆయకట్టు కింద సన్న, చిన్న కారు రైతులు సుమారు రెండు లక్షలకు పైబడే భూములు సాగు చేసుకుంటున్నారు. పథకం ప్రారంభించాక వైఎస్ హయాంలో ట్రైల్ ర¯ŒS నిర్వహించి తొలుత సుమారు 60 వేల ఎకరాలకు గోదావరి జలాలను అందించారు. అనంతరం దశలవారీగా పెంచుతూ ప్రస్తుతం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందిస్తున్న విషయాన్ని కాగ్ తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లక్షా 50వేల ఎకరాలకు మాత్రమే సాగుకు నీరందిస్తున్నారు. వాస్తవానికి ఈ ఎత్తిపోతల పథకం నిర్థేశించిన లక్ష్యం నెరవేరాలంటే విశాఖ జిల్లా పాయకరావుపేట వరకు సాగునీరందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు తుని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే నీరు సరఫరా అవుతోందని కాగ్ ఆ నివేదికలో ఎత్తి చూపించింది. ఈ పుష్కర ఎత్తిపోతల ద్వారా సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న పాయకరావుపేట రైతులకు నిరాశనే మిగిల్చారు. సుమారు 30 వేల ఎకరాల్లో సాగునీరు అందించలేని పరిస్థితులు, అందులో సర్కార్ వైఫల్యాన్ని కాగ్ తాజా నివేదికలో ఎండగట్టింది. రూ.600 కోట్లు కుమ్మరించినా నిర్దేశించిన సాగు లక్ష్యం లక్షా 87వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయకపోవడాన్ని తప్పు పట్టింది. పురుషోత్తపట్నంపై కూడా... పురుషోత్తపట్నంలో టెండర్లు పిలవడంలో అవకతవకలు పాల్పడ్డారని ‘కాగ్’ తప్పుపట్టింది. పుష్కర ఆయకట్టుకు పూర్తిగా నీరివ్వ లేదని తప్పు పట్టిన కాగ్ అదే చేత్తో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం టెండర్ల తీరును ఎత్తిచూపింది. రూ.1638 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ఎత్తిపోతల ద్వారా ఏలేరు ప్రాజెక్టును అనుసంధానించాలనేది సర్కార్ ప్రణాళిక. ఈ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను తప్పు పట్టింది.