పుష్కర లక్ష్యమేదీ | pushkara project works issue | Sakshi
Sakshi News home page

పుష్కర లక్ష్యమేదీ

Published Sat, Apr 1 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

pushkara project works issue

పుష్కర ఎత్తిపోతల పథకం పనుల్లో సర్కారు అలక్ష్యమే కనిపిస్తోందిl
నిర్దేశించిన ఆయకట్టుకు నీరేదీ...?
పురుషోత్తపట్నం టెండర్లలో అవకతవకలు 
కాగ్‌ అక్షింతలు
 
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) బెత్తం తీసింది.  ఎత్తిపోతల పథకాల్లో చూపెడుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది. పుష్కర ఎత్తిపోతల పథకం లక్ష్యం ఏమిటి...? ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించింది. పురుషోత్త పట్నం ఎత్తిపోతల పథకం టెండర్లపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. 
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : 
పుష్కర ఎత్తిపోతల పథకం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడాన్ని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) తప్పుపట్టింది. కాగ్‌ విడుదల చేసిన తాజా నివేదికలో జిల్లాలోని పుష్కర ఎత్తిపోతల పథకంతోపాటు చంద్రబాబు సర్కార్‌ ఇటీవలనే చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తీరును తప్పుపట్టడం గమనార్హం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మెట్ట ప్రాంత రైతుల కోసం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని రాజానగరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో బీడువారిన లక్షా 87వేల ఎకరాల్లోని  బీడు భూముల్లో గోదావరి జలాలను మళ్లించి మెట్ట రైతులకు సిరులు కురిపించాలని నాడు వై.ఎస్‌. కలలుగన్నారు. సీఎం వై.ఎస్‌. 2008లో యూపీఏ చైర్‌పర్స¯ŒS సోనియాగాంధీతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభింపజేశారు. ఈ ఆయకట్టు కింద సన్న, చిన్న కారు రైతులు సుమారు రెండు లక్షలకు పైబడే భూములు సాగు చేసుకుంటున్నారు. పథకం ప్రారంభించాక వైఎస్‌ హయాంలో ట్రైల్‌ ర¯ŒS నిర్వహించి తొలుత సుమారు 60 వేల ఎకరాలకు గోదావరి జలాలను అందించారు. అనంతరం దశలవారీగా పెంచుతూ ప్రస్తుతం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందిస్తున్న విషయాన్ని కాగ్‌ తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లక్షా 50వేల ఎకరాలకు మాత్రమే సాగుకు నీరందిస్తున్నారు. వాస్తవానికి ఈ ఎత్తిపోతల పథకం నిర్థేశించిన లక్ష్యం నెరవేరాలంటే విశాఖ జిల్లా పాయకరావుపేట వరకు సాగునీరందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు తుని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే నీరు సరఫరా అవుతోందని కాగ్‌ ఆ నివేదికలో ఎత్తి చూపించింది. ఈ పుష్కర ఎత్తిపోతల ద్వారా సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న పాయకరావుపేట రైతులకు నిరాశనే మిగిల్చారు. సుమారు 30 వేల ఎకరాల్లో సాగునీరు అందించలేని పరిస్థితులు, అందులో సర్కార్‌ వైఫల్యాన్ని కాగ్‌ తాజా నివేదికలో ఎండగట్టింది. రూ.600 కోట్లు కుమ్మరించినా నిర్దేశించిన సాగు లక్ష్యం లక్షా 87వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయకపోవడాన్ని తప్పు పట్టింది. 
పురుషోత్తపట్నంపై కూడా...
పురుషోత్తపట్నంలో టెండర్లు పిలవడంలో అవకతవకలు పాల్పడ్డారని ‘కాగ్‌’ తప్పుపట్టింది. పుష్కర ఆయకట్టుకు పూర్తిగా నీరివ్వ లేదని తప్పు పట్టిన కాగ్‌ అదే చేత్తో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం టెండర్ల తీరును ఎత్తిచూపింది. రూ.1638 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టిన ఈ  ఎత్తిపోతల ద్వారా ఏలేరు ప్రాజెక్టును అనుసంధానించాలనేది సర్కార్‌ ప్రణాళిక. ఈ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను తప్పు పట్టింది.
 

Advertisement
Advertisement