‘గద్వాల జిల్లాపై ప్రభుత్వం సానుకూలం’
గద్వాల : నూతన జిల్లాల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గద్వాల జిల్లా ఏర్పాటుపై సానుకూల దక్పథంతో ఉందని ఐక్య కార్యాచరణ వేదిక చైర్మన్ నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కన్వీనర్ మధుసూదన్‌బాబు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రాజశేఖర్‌రెడ్డిలు చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రివర్గ ఉప సంఘం నూతన జిల్లాలపై జరిగిన సమీక్షా సమావేశంలో గద్వాల జిల్లా పట్ల సానుకూల సందేశాలు వ్యక్తమయ్యాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాల ప్రకటనలో గద్వాల లేదనే సంకేతాలతో నడిగడ్డ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురై పలు ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో 21 రోజుల పాటు రిలే దీక్షలు కొనసాగించామని చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం కన్వీనర్ మహిమూద్అలీ, మంత్రులు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, జూపల్లి కష్ణారావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలను కలిసి గద్వాల జిల్లా కోసం వినతిపత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. జిల్లాల ప్రకటనపై ఎలాంటి ముసాయిదా రాలేదని మంత్రులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే, పాలనా సౌలభ్యాన్ని దష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. ఒకవేళ గద్వాలకు అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అంపయ్య, వాల్మీకి, వినోద్‌కుమార్, చిన్నయ్య, కోళ్ల హుసేన్ తదితరులున్నారు.