Grigor Dmitrov
-
విజేత దిమిత్రోవ్
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో... దిమిత్రోవ్ 7–6, 4–6, 6–3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. 1998లో అలెక్స్ కొరెత్యా (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్ గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన దిమిత్రోవ్‌కు 25,49,000 డాలర్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు), రన్నరప్ గాఫిన్‌కు 11,58,000 డాలర్లు (రూ. 7 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ప్రదర్శనతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దిమిత్రోవ్ మూడో స్థానానికి, గాఫిన్ ఏడో స్థానానికి ఎగబాకారు. -
‘సిన్సినాటి’ చాంప్స్ దిమిత్రోవ్, ముగురుజా
ఒహాయో: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సన్నాహక టోర్నీల్లో భాగమైన సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌లో గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), మహిళల సింగిల్స్‌లో ముగురుజా (స్పెయిన్) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో దిమిత్రోవ్ 6–3, 7–5తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై... నాలుగో సీడ్ ముగురుజా 6–1, 6–0తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై విజయం సాధించారు. చాంపియన్స్‌గా నిలిచిన దిమిత్రోవ్‌కు 9,54,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 12 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... ముగురుజాకు 5,22,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 35 లక్షలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.