విజేత దిమిత్రోవ్‌ | Grigor Dmitrov win a tenis Tournament | Sakshi
Sakshi News home page

విజేత దిమిత్రోవ్‌

Published Tue, Nov 21 2017 12:28 AM | Last Updated on Tue, Nov 21 2017 12:28 AM

Grigor Dmitrov win a tenis  Tournament - Sakshi

లండన్‌: పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో... దిమిత్రోవ్‌ 7–6, 4–6, 6–3తో డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై గెలిచాడు. 1998లో అలెక్స్‌ కొరెత్యా (స్పెయిన్‌) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్‌ గుర్తింపు పొందాడు.

విజేతగా నిలిచిన దిమిత్రోవ్‌కు 25,49,000 డాలర్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు), రన్నరప్‌ గాఫిన్‌కు 11,58,000 డాలర్లు (రూ. 7 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ప్రదర్శనతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దిమిత్రోవ్‌ మూడో స్థానానికి, గాఫిన్‌ ఏడో స్థానానికి ఎగబాకారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement