గ్రూప్2 స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు కసరత్తు
పరీక్షా కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్లకు ఏపీపీఎస్సీ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతనెల 8న జారీచేసిన గ్రూప్2 నోటిఫికేషన్‌కు అత్యధిక సంఖ్యలో 6.55 లక్షల మంది దరఖాస్తు చేయడంతో స్క్రీనింగ్ టెస్టు నిర్వహణపై కమిషన్ అధికారులు ముందునుంచే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరీక్షలకు అనువైన పరీక్ష కేంద్రాలను గుర్తించాలని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు.
జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను అనుసరించి పరీక్షకు వసతి ఏర్పాట్లు చేయించాలని సూచించారు. కాగా, 150 మార్కులకు నిర్వహించనున్న ఈ స్క్రీనింగ్ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్ వివరాలను ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. పరీక్ష మూడు కేటగిరీల్లో ఉంటుంది.