ఔరా.. బీర !
బీరకాయలు సాధారణంగా మూరెడు లేదంటే అంతకంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ గూడూరు మండలం పొనుగోడు గ్రామంలోని బెజ్జం రమేష్ ఇంట్లో బీర చెట్టుకు కాసిన కాయలు సుమారు అర మీటరుకు పైగా ఉండడం విశేషం. అలాగే, ఒక్కో కాయ కేజీన్నరకు పైగా బరువు తూగుతోంది. ఈ కాయ ఒక్కటి కూర వండుకుంటే కుటుంబం మెుత్తానికి సరిపోతుందంటూ గ్రామస్తులు పలువురు రమేష్ ఇంటి నుంచి తీసుకువెళ్తున్నారు.
– గూడూరు