నేనే చంపేశాను..
కుల్కచర్ల,న్యూస్‌లైన్:పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైంది. ‘నేనే చంపేశాను..’ అంటూ నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన ఆదివారం కుల్కచర్ల మండల కేంద్రంలో వెలుగుచూసింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె హన్మయ్య, హన్మమ్మ(58) దంపతులు. హన్మయ్య వికలాంగుడు, దీం తో ఆయన స్థానికంగా భిక్షాటన చేస్తు ండగా హన్మమ్మ కూలిపనులు చేస్తో ంది. అదే గ్రామానికి చెందిన వడ్డె రాములుతో దంపతులకు పాత కక్షలు ఉన్నాయి. ఈక్రమంలో నాలుగురోజు ల క్రితం హన్మమ్మ, రాములు గొడవపడ్డారు. దీంతో హన్మమ్మ రాములుపై కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయమై పోలీసులు రాములును అదుపులోకి తీసుకొని విచారించి శనివారం వదిలేశారు. శనివారం రాత్రి రాములు హన్మమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా ఆమె దుర్భాషలాడింది. తనపై అప్పటికే హన్మమ్మ ఠాణాలో ఫిర్యాదు చేయడం, తిరిగి దూషించడంతో రాములు తీవ్ర ఆగ్రహానికి గురయ్యా డు. అక్కడే ఉన్న ఓ రాయితో హన్మమ్మపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే ప్రాణం విడిచిం ది. ఎవరూ గమనించకపోవడంతో రా ములు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం స్థాని కులు హన్మ మ్మ మృతదేహంగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ నాగేష్ తమ సిబ్బం దితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడి వివరాలు సేకరణకు జాగిలాలు రప్పిం చేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోనే రాములు అక్కడికి వచ్చి ‘నేనే హన్మమ్మను చంపేశాను’ అని లొంగిపోయాడు. అనంతరం పోలీసు జాగిలం కూడా రాములు వద్ద ఆగిపోయింది. హన్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాములను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈమేరకు సీఐ వేణుగోపాల్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.