Hebei Province
-
5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి
బీజింగ్: బీజింగ్ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500 పడకలుగల ఆస్పత్రిని శనివారానికి నిర్మించిందని జిన్హువా న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. హెబెయ్ ప్రావిన్సుల్లో మొత్తం ఆరు ఆస్పత్రులను నిర్మించేందుకు సిద్ధం కాగా అందులో ఇది మొదటిది. మొత్తం 6,500 పడకలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 130 కొత్త కేసులు రాగా, వాటిలో 90 కేసులు హెబెయ్ ప్రావిన్సులోనే వచ్చాయి. గత శుక్రవారం నాటికి షిజాఝంనంగ్ నగరంలో కోటి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. -
భారీ వర్షాలు : 114కు పెరిగిన మృతులు
బీజింగ్: చైనాలోని హీబీ ప్రావిన్స్ భారీ వర్షాలు, వరదతో అతలాకుతలం అవుతుంది. ఈ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో మృతి చెందిన వారి సంఖ్య 114కు పెరిగింది. అలాగే 111 మంది గల్లంతు అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా దాదాపు 52,900 ఇళ్లు కుప్పకూలాయని... అలాగే 15,5000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సైనికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. దాదాపు 1200 మంది ప్రజల సహకారంతో సహాయక చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. వరద ముంపునకు గురైన గ్రామాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితిని అంచనా వేసేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు విశదీకరించారు. -
బొమ్మ హోటల్ బాగుందమ్మా..
వీళ్ల పేర్లు ఫూ, లూ, షౌ. సంపదకు, ఆయుష్షుకు, అదృష్టానికి ప్రతీకలైన వీళ్లు చైనా దేవుళ్లు. చైనాలోని హెబై ప్రావిన్స్‌లో వీరి విగ్రహాలు ఉన్నాయి. అయితే, విషయం అది కాదు. ఈ విగ్రహాలు వాస్తవానికి ఓ హోటల్! అంటే.. 10 అంతస్తుల హోటల్‌ను ఇలా తీర్చిదిద్దారన్నమాట. ప్రపంచంలో అతి పెద్ద ఇమేజ్ హోటల్‌గా ఈ టయాంజీ హోటల్ గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కింది.