చరిత్ర విస్మరించిన యోధుడు రాంజీ
భారత ప్రథమ స్వాతంత్య్ర పోరాటం అంటేనే సహజంగా స్ఫురించేది 1857 సిపాయిల తిరుగు బాటు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాం తంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలోని రాంజీగోండు ఆధ్వర్యంలో రోిహల్లా తిరుగుబాటు (1836-60), కొమురం భీం నేతృ త్వంలో జోడెన్ ఘాట్ తిరుగుబాటు (1938-40) దేశంలోనే ఆదివాసీ తొలి చారిత్రక పోరాటాలుగా నిలిచాయి. రోహిల్లాల తిరుగుబాటుకు చరిత్రకారులు మన చరిత్రకారులు స్థానం కల్పించలేదు. గోండుల వీర యోధుడైన మార్సికోల్లా రాంజీ గోండ్‌ను స్మరించుకునే వారే కనబడరు.
మధ్యభారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకుల రాక పూర్వమే ఏర్పడి ఉన్నది. గోండుల పాలన క్రీ.శ 1240-1750 వరకు సుమారు 5 శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్కంఠ్షా (క్రీ.శ 1735- 49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమిం చుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాం తం మరాఠీల ఆధీనమైనా, వారు బ్రిటిష్ వారికి తలొగ్గి గోండ్వా నాను తెల్లదొరలకు అప్పగించారు. దీం తో గోండులపాలన అంతమై, ఆంగ్లే యుల, నైజాం పాలన ఆరంభమైంది. వీరి పీడనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైంది.
ఆదిలాబాద్ జిల్లాలోని మార్సికొ ల్లా రాంజీ 1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్) కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరి జన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డి ఝాన్షీ లక్ష్మిబాయి వీరమరణం పొందిన తర్వాత నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియా అనుచ రులైన రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహా రాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, ఆంధ్రప్ర దేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. వీరి నేతగా ప్రక టించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడ గొట్టి, బ్రిటిష్ వాళ్లను తరిమేయాలని పోరాటానికి పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణలో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసేక్రమంలో బ్రిటి ష్ సైన్యానికి పట్టుబడ్డాడు. యావజ్జీవశిక్ష అనుభవిస్తూ అండమాన్ జైలులో 1860 లో మరణించాడు. రాంజీ నేతృత్వంలో తిరుగుబాటు తీవ్రమైంది.
రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీగోండ్ సారథ్యంలో తిరుగుబాటు ఉధృతంగా మారింది. ఈ తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1860 మార్చి ఏప్రిల్‌లో జరిగింది. బానిస బతుకులు వెళ్లదీస్తున్న గోండు గిరిజనులు వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. ఆదిలాబాద్ ఏజె న్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లో లంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలసి నిర్మల్ సమీ పంలోని కొండలను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పట్టారు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశా యి. ఆధునిక ఆయుధాల ముందు ఆదివాసులు నిలవలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆది వాసులను నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకుని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ఊడలమర్రి చెటు ్టకు 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రి చెట్టు వెయ్యి ఉరిల మర్రిచెట్టుగా ప్రసిద్ధి.
తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రిచెట్టును తర్వాతి కాలంలో అంటే 1995లో నరికివేశారు. రాంజీగోండ్ నాయకత్వంలో సాగిన ఇంతటి వీరోచిత పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ పోరాట మూలాలను వెతుక్కుం టూ తనదైన చరిత్రను పునర్నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీ చరిత్రను వెలుగులోకి తేవాలి. రాంజీ గోండ్ పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించాలి. నిర్మల్‌లోని ఉర్ల మర్రి చెట్టు స్థానంలో రాంజీ గోండు స్మారక స్థూపాన్ని, అలాగే ట్యాంక్ బండ్‌పైన కూడా నిర్మించాలి.
(ఏప్రిల్ 9, రాంజీగోండ్ 155వ వర్థంతి.)
(గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల సంఘం) మొబైల్ : 9951430476