Homo Sex
-
స్వలింగ సంపర్కం.. బ్యాంక్ అధికారి నిర్వాకం
సాక్షి, అమీర్‌పేట(హైదరాబాద్) : స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ ఓ బ్యాంకు అధికారి ఆన్లైన్లో విటుడ్ని బుక్ చేసుకుని న్యూసెన్సు చేశాడు. దీంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్ శాఖలో పనిచేసే ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. ఆన్లైన్లో చాటింగ్ చేసి ఎస్ఆర్నగర్ సమీపంలోని బస్తీకి చెందిన విటుడ్ని 5 వేలకు బుక్ చేసుకున్నాడు. (చదవండి: కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..) విటుడ్ని కలిసేందుకు ఆ అధికారి ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో బస్తీకి వచ్చాడు. ఓ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న విటుడి వద్దకు వెళ్లాడు. అతడు వికలాంగుడు కావడంతో నిర్ఘాంతపోయిన బ్యాంకు అధికారి వెనుతిరిగాడు. అయితే డబ్బు ఇవ్వాల్సిందేనని వికలాంగుడు పట్టుబట్టడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెద్దది కావడం, ఇదే సమయంలో మంచినీటి సరఫరా జరుగుతుండంతో నీళ్లు పట్టుకునేందుకు బయటికి వచ్చిన మహిళలు దొంగేమోనని అనుమానించి అధికారిని పట్టుకున్నారు. 100కు డయల్ చేయడంతో పెట్రోలింగ్ సిబ్బందికి అక్కడకు చేరుకుని బస్తీలో న్యూసెన్సుకు పాల్పడ్డ ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 8వ తేదీన బ్యాంకు అధికారితో పాటు విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రాచకొండలో నకిలీ డాక్టర్ హల్చల్) -
వివక్షపై విజయానికి రెండేళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. ఎల్జీబీటీలపై (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) 157 ఏళ్ల పాటుసాగిన విపక్షపై విజయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయాన్ని లిఖించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్‌నటి ప్రియాంక చోప్రా నాటి జడ్జ్మెంట్ను గుర్తుచేస్తూ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. చారిత్రాత్మక తీర్పుకు రెండేళ్లు అంటూ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా తీవ్ర వివక్షకు గురవుతున్న ఎల్జీబీటీకు సుప్రీం తీర్పుతో న్యాయం జరిగిందని గ్లోబర్ స్టార్ ప్రియాంక అభిప్రాయపడ్డారు. కేసు పూర్వాపరాలు తెలుసుకుందాం.... స్వలింగ సంపర్కం నేరం కాదని 2019 సెప్టెంబర్ 6న చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కింద గే సెక్స్‌లో పాల్గొనే వారికి శిక్ష విధించడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ డీవై చంద్రచుద్, రోహింటన్ ఫాలి నారీమన్, ఏఎం ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాలతో కూడిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గే సెక్స్‌ను నేరంగా పరిగణించడం సహేతుకం కాదని జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ)లకు కూడా ఇతర పౌరుల్లాగే సమాన హక్కులు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 ప్రకారం ఇప్పటి వరకూ హోమో సెక్స్ నేరం. అంటే ప్రకృతి విరుద్ధంగా.. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో లేదా జంతువులతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడటం శిక్షార్హం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. 1861 నాటి చట్టం ప్రకారం గే సెక్స్‌లో పాల్గొనే వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 1533 నాటి (బగ్గరీ యాక్ట్) ఆధారంగా నాటి బ్రిటీష్ పాలనలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. హోమో సెక్స్ సహా అసహజ శృంగారానికి పాల్పడటం సెక్షన్ 377 ప్రకారం నేరం. ఈ చట్టం తొలినుంచి వివాదాస్పదమవుతూనే ఉంది. హిజ్రాలను థర్డ్ జెండర్‌గా గుర్తించాలి... సెక్షన్ 377 వివాదం తొలిసారిగా 2001లో తెరమీదకు వచ్చింది. నాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీవోతోపాటు ఎయిడ్స్ బేదభావ్ విరోధ్ ఆందోళన్లు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు వేయగా.. వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. హోమో సెక్సువాలిటీ నేరం కాదని ఎనిమిదేళ్ల తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. కానీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయగా.. 2013లో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హిజ్రాలను థర్డ్ జెండర్‌గా గుర్తించాలని 2014లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వారిని ఓబీసీ కోటాలో చేర్చాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే నాజ్ ఫౌండేషన్ జడ్జిమెంట్‌ను పునః పరిశీలించాలని కోరుతూ ఐదుగురు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ పిటీషన్‌ను పరిశీలించింది. ఈ కేసును ఐదుగురు సభ్యుల బెంచ్‌కు రిఫర్ చేశారు. దీనిపై జోక్యం చేసుకుని తమ అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా కేంద్రాన్ని సైతం సుప్రీం కోరింది. ఈ రిట్ పిటీషన్లను చర్చిల సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు, కొన్ని ఎన్జీవోలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గత జులైలో సెక్షన్ 377 విషయం సుప్రీంలో వాదనకు వచ్చింది. హోమో సెక్సువాలిటీ అనేది ఉల్లంఘన కాదు, వైవిధ్యం మాత్రమేనని జూలై 12న విచారణ సందర్భంగా జస్టిస్ ఇందు మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఇలాంటి వారు తమకు నచ్చుకున్నా అపోజిట్ సెక్స్ ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల బై సెక్సువాలిటీ, ఇతర మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సెక్షన్ 377 కాలరాస్తోందని పిటిషనర్లు వాదించారు. సెప్టెంబర్ 6, 2018న హోమోసెక్సువాలిటీ నేరం కాదని ఐదుగురు జడ్జిల బెంచ్ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. చరిత్ర క్షమాపణ చెప్పాలి చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లు) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. -
సమాజం మనసు మారుతుందా..?
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఇందుకు అనుగుణంగా వివాహం, దత్తత, వారసత్వ హక్కుల వంటి అంశాల్లో మార్పులు జరగాల్సి ఉంది. ఇన్నాళ్లూ వివక్షకు గురవుతున్న ఎల్జీబీటీక్యూ (లెస్బియన్లు, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్..) లకు పౌర హక్కులు దక్కాల్సి ఉంది. ఈ పరిణామాలు సమాజం ఆలోచనల్లో మార్పు తెస్తాయా? స్వలింగ సంపర్కులను సాటి ప్రజలు సరిగా అర్థం చేసుకుంటారా? ఈ విషయంలో ప్రపంచ దేశాల అనుభవాలు వంటి అంశాలపై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ పరిశోధకులు చార్లెస్ కెన్నీ, దేవ్ పటేల్ అధ్యయనం చేశారు. వ్యతిరేకిస్తున్న యువత ♦ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) అధ్యయనం ప్రకారం భారతీయ యువత స్వలింగ సంపర్కాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. 61 శాతం మంది ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీల మధ్య ప్రేమ సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతి నలుగురిలో ఒక్కరేగే/లెస్బియన్ సంబంధాలను ఆమోదిస్తున్నారు. ♦ 15–17 ఏళ్ల యువతలో 31 శాతం మంది ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ తప్పుకాదంటున్నారు. 30–34 ఏళ్ల యువకుల్లో ఇలా ఆలోచిస్తున్న వారు 21 శాతమే. ♦ ఎలాంటి మత భావనల్లేని వారితో పోల్చుకుంటే మత విశ్వాసం ఉన్న వారిలోనే ఎక్కువ మంది స్వలింగ సంపర్కాన్ని ఆమోదిస్తున్నారు. ♦ పెద్ద నగరాలతో పోల్చుకుంటే.. చిన్న నగరాలు, గ్రామాల్లో స్వలింగ సంపర్కాన్ని ఆమోదించేవారు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. నగరాల్లోనే ఇలాంటి ‘ప్రేమలు’ ఉంటాయనే అభిప్రాయంలో వాస్తవం లేదని సర్వే తేల్చింది. తీర్పు అనంతరం పరిస్థితులేంటి..? సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పొందిన ఎల్‌జీబీటీక్యూలు ఇప్పుడు తమ ఇతర హక్కుల సాధనపై దృష్టి సారిస్తున్నారు.తమకూ వివాహం, వారసత్వం, సరోగసీ, దత్తత వంటి అంశాల్లో హక్కులు కల్పించాలని ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. స్వలింగ సంపరాన్ని నేరం కాదన్న అంశం వరకే ధర్మాసనం పరిమితం కావాలని, ఇతర హక్కుల జోలికి వెళ్లొద్దని అదనపు సొలిసిటర్ జనరల్ సెక్షన్ 377 కేసు విచారణలో సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. దీన్ని బట్టి వారికి ఇతర హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని స్పష్టం అవుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం తీర్పుతో వారికి ప్రాథమిక హక్కు లభించింది కాబట్టి వివాహం, వారసత్వం, బీమా హక్కులు కూడా ఇందులో భాగమవుతాయని,ఈ హక్కులను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని 377 కే సు పిటిషనర్లలో ఒకరైన సునీల్ మెహ్రా అన్నారు. వివాహాన్ని ఆమోదించదు స్వలింగ సంపర్కం నేరం కాదన్నంత వరకు బాగానే ఉందని, అయితే వారి వివాహాన్ని కూడా చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌ను మాత్రం ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఆర్ఎస్ఎస్కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.‘ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు పెళ్లిచేసుకోవడం ప్రకృతి విరుద్ధం.దీన్ని సమర్థించబోం.ఇలాంటి సంబంధాలను గుర్తించే సంప్రదాయం భారతీయ సమాజంలో లేదు’అని ఆరెస్సెస్ ప్రతినిధి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. సెక్షన్ 377 రద్దును కాంగ్రెస్ స్వాగతించినా గేలకు ఇతర హక్కుల విషయంలో తనవైఖరి తెలియజేయలేదు. ఇతర హక్కుల జోలికెళ్లని ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు వారి ఇతర హక్కుల జోలికి వెళ్లలేదు. సామాజిక నిబంధనలు గేల రాజ్యాంగ హక్కులను ఎలా నియంత్రించజాలవో తన తీర్పులో వివరించిన ధర్మాసనం వివాహం, వారసత్వం వంటి ఇతర హక్కుల గురించి ఏమీ ప్రస్తావించలేదు. -
హోమో సెక్స్‌లో పాల్గొనలేదని చంపేశారు!
ప్రకాశం, దర్శి: ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడిని పార్టీ ఉందంటూ పిలిచారు. అనంతరం హోమో సెక్స్(స్వలింగ సంపర్కం)లో పాల్గొనాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఒప్పుకోని ఆ యువకుడు, విషయాన్ని అందరికీ చెబుతానని హెచ్చరించడంతో గొంతునులిమి చంపేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో గత జూన్ 26న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బ్రహ్మారెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. ఓ మైనర్ సహా నలుగురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఓ నిందితుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన పెదరామిరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (27) ఇటీవల టెట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నాడు. గత జూన్ 26న దర్శి నుంచి తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని ఓ సుబాబుల్ తోటలో అనుమానస్పద స్థితిలో అతడు మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దర్శికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అందరికీ చెబుతానని హెచ్చరించడంతో... దర్శికి చెందిన సాయికిరణ్‌కు ఫేస్బుక్లో బ్రహ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. జూన్ 26న పార్టీ ఉందంటూ అతడు బ్రహ్మారెడ్డిని తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని సుబాబుల్ తోట వద్దకు తీసుకెళ్లాడు. అతడితో పాటు తన స్నేహితులు జలపాటి శ్రావణ్‌కుమార్, పందిటి నరసింహారావు, మరో మైనర్ బాలుడితో కలిసి మద్యం సేవించారు. అనంతరం బ్రహ్మారెడ్డిని తమతో పాటు స్వలింగ సంపర్కంలో పాల్గొనాలని ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించడంతో చెట్టుకు కట్టేశారు. మీరు ఇలాంటి వారని అందరికీ చెబుతానంటూ హెచ్చరించడంతో.. పరుపు పోతుందని భావించిన వారు అతడి గొంతు నులిమి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని శ్రావణ్ తన తండ్రి బ్రహ్మయ్యకు చెప్పడంతో అతడు నిందితులు పారిపోయేందుకు సహకరించడంతోపాటు సాక్ష్యాలు దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితులతో పాటు బ్రహ్మయ్యను కూడా అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం
అన్నానగర్: స్వలింగ సంపర్కం ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. స్నేహితుడిని హత్య చేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చెన్నైలో సోమవారం చోటుచేసుకుంది. చెన్నై పార్క్ ప్రాంతానికి చెందిన జలకేష్‌కుమార్ అన్నాసాలై రిచ్ వీధిలో ఎలక్ట్రిక్ దుకాణం నడుపుతున్నాడు. ఇతని దుకాణంలో చింతాద్రిపేటకి చెందిన శరవణన్ (30), గోవిందన్ వీధికి చెందిన ప్రభు (28) వీరిద్దరూ పని చేస్తున్నారు. వీరిద్దరూ స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డారు. ఈ విషయం ప్రభు ఇంట్లో తెలియడంతో అతన్ని మందలించారు. దీంతో ప్రభు శరవణన్‌ను దూరం పెట్టాడు. ఈ క్రమంలో దుకాణం వద్ద తనను కలవాలని ప్రభును శరవణన్ బతిమాలాడు. దీంతో ప్రభు ఆదివారం రాత్రి దుకాణం వద్దకు వెళ్లాడు. అప్పుడు ప్రభుని స్వలింగ సంపర్కానికి శరవణన్ పురమాయించాడు. అందుకు ప్రభు అంగీకరించకపోవడంతో ఆవేశం చెందిన శరవణన్ కత్తితో ప్రభు గొంతు కోశాడు. ఈ ఘటనలో ప్రభు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు విచారణకు భయపడి శరవణన్ దుకాణంలో ఉన్న ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పటిలాగే మహిళా కార్మికురాలు సోమవారం ఉదయం దుకాణం తెరవగా ప్రభు, శరవణన్ వీరిద్దరూ మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న చింతాద్రిపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడే నిందితుడు..!
నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామంలో ఈ నెల 7వ తేదీన వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హోమోసెక్స్‌కు ఒత్తిడి చేయడంతోనే స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ కేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌పల్లి (నకిరేకల్) : నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి (25), చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన మాదాసు ఆరోగ్యం ఇద్దరూ స్థానిక ఐడియల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు బావ, బావమరుదుల వరసతో పిలుచుకుంటూ తిరిగేవారు. వీరు తమ ఫోన్లలో పలుమార్లు అశ్లీల చిత్రాలు చూసేవారు. అందులో ఇద్దరు మగవారు కలిసి చేసుకునే హోమోసెక్స్‌కు ఆకర్షితులై కొంత కాలంగా పలుమార్లు ఆ విధంగా కలుసుకున్నారు. స్నేహితుడిని ఓదార్చేందుకు.. గత నెల 13న ఆరోగ్యం చిన్న కూతురు మృతిచెందింది. ఆ బాధలో ఉన్న ఆరోగ్యాన్ని స్నేహితులు ఓ దార్చే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఆరోగ్యాన్ని స్నేహితులందరూ కలిసి ఆరోగ్యాన్ని జాన్‌పహాడ్ దర్గా వద్దకు తీసుకెళ్లి పార్టీ చేస్తున్నారు. బెదిరించి.. జానపహాడ్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం జాన్‌రెడ్డి ఫోన్‌చేసి ఆరోగ్యాన్ని కలుసుకోవాలని ఒత్తిడి చేశాడు. అతను రానని చెప్పడంతో అసహనానికి గురైన జాన్‌రెడ్డి వారిద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపెడతానని బెదిరించాడు.తన భార్యని కూడా కలవాలని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన ఆరోగ్యం జాన్‌రెడ్డి బతికిఉంటే ఎప్పటికైన ప్రమాదమే అనుకుని చంపాలని పథకం వేశాడు. ఒత్తిడి చేసి పిలిపించుకుని.. జాన్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌చేసి ఒత్తిడి చేయడంతో ఆరోగ్యం విసిగిపోయాడు. దీంతో అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.అప్పటికే తాగి ఉన్న జాన్‌రెడ్డిని చంపడానికి అనుకూల సమయమని నిర్ధారించుకున్న ఆరోగ్యం తనతో పాటు చిన్నకత్తిని వెంట తెచ్చుకున్నాడు. ఎప్పటిలాగే వ్యవసాయబావి వద్ద మంచంపై దుస్తులు లేకుండా మంచానికి జాన్‌రెడ్డిని కట్టివేసి ఆరోగ్యం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి చంపాడు. మృతుడి కాల్‌డేటా ఆధారంగా నిందుతుడిని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో శా లిగౌరారం సర్కిల్ సీఐ క్యాస్ట్రోరెడ్డి, ఎస్ఐ గోవర్థ న్, సిబ్బంది మధు, రమేష్, జనార్ధన్ ఉన్నారు. -
హిజ్రాలపై చిన్నచూపు తగదు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:హిజ్రాలపై చిన్నచూపు తగదని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యు డు బి.ఎల్.నర్సింగరావు అన్నారు. మంగళవారం ఎన్సీఎస్ రోడ్డులో ఒక ఫంక్షన్ హాలులో హిజ్రాలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రధా న వక్తగా నర్సింగరావు మాట్లాడుతూ సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూడడం, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని అనుచితంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని చెప్పారు. అటువంటి సంఘటనలు తమ దృష్టికి తీసుకువస్తే తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో స్త్రీ, పురుషులతో సమానంగా హిజ్రాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు హిజ్రాలకు సరైన ఆదరణ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషులతో సమానంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఓటరు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇతర సంక్షేమ పథకాల అమలులో తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఎక్కువ మంది హిజ్రాలున్నారని, వారికి స్వయం ఉపాధి కల్పించాలన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరి గా ఇక్కడ కూడా హిజ్రాల దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు హరీష్ రావు, రాజు, వన్‌టౌన్ ఎస్ఐ రమణయ్య, హిజ్రాస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు కుమారమ్మ, అధ్యక్షురాలు దవడ మీన, కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువు గట్టుపై ప్రత్యేక పూజలు పెద్ద చెరువు గట్టుపై నవదుర్గా ఆలయ నిర్మాణ పనులు విజయవంతం జరగాలని హిజ్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు కంటోన్మెంట్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ నవదుర్గ ఆలయాన్ని జూన్ 20వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామానికి చెందిన ఇటుక గ్రామస్థులు ఉచితంగా ఇటుకలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.నవదుర్గ విగ్రహాలను నాయుడు ఫంక్షన్ హాల్ అధినేత, ఆయన స్నేహితులు విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. -
వ్యాపారి దారుణ హత్య
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గవర్నర్‌పేటలో ఫ్లైవుడ్ షాపు నిర్వహించే వ్యాపారి నాలం రామ్మోహనరావు (52)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సూర్యారావుపేటలో తాను నివాసముండే భవనంలోనే హతమార్చి శవాన్ని పొరుగింటి వెనుక ఖాళీ ప్రదేశంలో పడవేశారు. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యకు గురైన రామ్మోహనరావు సూర్యారావుపేటలోని పూసపాటి వారి వీధిలో నివసిస్తున్నారు. శనివారం రాత్రి షాపు నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి, తన పొరుగింటి పెరట్లో శవమై తేలారు. హతుడి ముఖం కనపడకుండా పార్శిల్ టేప్ దట్టంగా చుట్టి ఉంది. ఆదివారం రాత్రి 10-30 గంటల సమయంలో తమ కాంపౌండ్‌లో ఏదో కిందపడిన శబ్దం వినపడిందని మృతదేహం పడి ఉన్న రెండంతస్తుల భవనంలో నివసించే వారు చెబుతున్నారు. భవనంపై టాప్‌ఫ్లోర్‌లో గెస్ట్ రూమ్ వద్ద నెత్తుటి మరకలు ఉండడం, హతుడి ముఖంపై వేసిఉన్న పేపర్ టేప్ ముక్కలు, చిన్నచిన్న తాళ్లు దొరకడంతో రామ్మోహనరావును అక్కడే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. టాప్‌ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ల వద్ద నెత్తుటి మరకలు కడిగిన ఆనవాళ్లు కూడా గుర్తించారు. టాప్‌ఫ్లోర్ నుంచి మృతదేహాన్ని పడేశారా, లేదా దాన్ని ఎక్కడికైనా తరలించే ప్రయత్నంలో జారి పడిపోయింద అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. హతుడి ఒంటిపై షర్టు, డ్రాయర్ మాత్రమే ఉన్నాయి. దేహానికి పరజా సంచి చుట్టి ఉంది. రామ్మోహనరావును ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హోమోసెక్స్ కారణమా? రామోహ్మహ నరావుకు హోమోసెక్స్ అలవాటు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. తన ఇంటి సెకండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్న ఓ యువకుడి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హతుడు తనతో హోమోసెక్స్‌లో పాల్గొనేవాడని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రమే రామ్మోహనరావును ఆ యవకుడు హత్యచేసినట్లు సమాచారం. రామ్మోహనరావు ఒంటిపై ఉన్న బంగారం గొలుసును కూడా పోలీసులు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.