ప్రియుడితో కలిసి ఉడాయించిన వివాహిత
హొసూరు : ప్రియుడితో కలిసి ఓ వివాహిత ఉడాయించింది. ఘటనపై వివాహిత భర్త ఫిర్యాదు మేరకు ఉద్దనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... ఉద్దనపల్లి సమీపంలోని క్రిష్ణకొత్తూరు గ్రామానికి చెందిన ఆనందప్ప, సుజాత(32) దంపతులు. వీరికి రెండేళ్ల బాలుడు ఉన్నాడు. హొసూరు పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న ఆనందపప్ప, ఈ నెల 20న రాత్రి తొందరగా పనిముగించుకుని ఇంటికి చేరుకున్నాడు.
ఆ సమయంలో ఇంటిలో తన భార్య ఆమె ప్రియుడు రాజప్పతో కలిసి ఉంది. విషయాన్ని గుర్తించిన ఆనందప్ప ఆగ్రహంతో ఇద్దరిని చితకబాదాడు. ఆ సమయంలో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అవమానాన్ని భరించలేని సుజాత, రా జప్ప పరారయ్యారు. వారం రోజుల పాటు తన భార్య తిరిగి వస్తుందని ఎదురు చూసిన ఆనందప్ప ఆమె రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.