నేనేం ఫోర్ట్వంటీని కాదు: నారా లోకేష్
రామచంద్రాపురం(చిత్తూరు): 'నేనేం ఫోర్ ట్వంటీ ని కాదు. తండ్రికి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ప్రవర్తించను. మీరు పార్టీకి అండగా ఉండండి...మీకు నేను అండగా ఉంటాను' అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిరుపతిలో మహానాడు విజయవంతం చేశారంటూ టీడీపీ వాలంటీర్లకు శుక్రవారం రామచంద్రాపురంలో సన్మాన సభను నిర్వహించారు.
పార్టీ మండల అధ్యక్షుడు ఉమాపతి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలను ధమ్ముంటే నిరూపించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు. తన ప్రసంగంలో కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు జగన్పై ఆరోపణలు చేస్తున్నా కార్యకర్తల నుంచి స్పందన లభించకపోవడం గమనార్హం.