అన్నదాతకు తీపి కబురు
సాక్షి, ఏలూరు : సాగు ఖర్చులు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అన్నదాతలకు ఇదో తీపి కబురు. కూలీలు దొరక్కపోవడమో లేక ఎక్కువ కూలి అడుగుత ున్నారనో వ్యవసాయ పనులను సకాలంలో పూర్తిచేసుకోలేకపోతున్న ైరైతులకు, రైతు మిత్ర గ్రూపులకు వ్యవసాయ శాఖ 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు సరఫరా చేయనుంది. ఇప్పటివరకూ
రైతు మిత్ర గ్రూపులకు మాత్రమే కల్పిస్తున్న ఈ ప్రయోజనాన్ని ఇకనుంచి రైతులకూ అందించనున్నారు. దీనికోసం జిల్లాకు రాష్ట్ర బడ్జెట్ కింద రూ.417.95 లక్షలు, ఆర్కేవీవై కింద రూ.465.29 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాన్ని జిల్లాలోని 12 వ్యవసాయ డివిజన్లకు.. అక్కడి నుంచి మండలాలకు కేటాయించారు.
ట్రాక్టర్ల సాయంతో నడిపే పనిముట్లు, కల్టివేటర్లు, డిస్క్హెరొలు, లెవె లింగ్ బ్లేడ్లు, ఎంబీ నాగళ్లు, రోటోవేటర్లు, వరికోసే యంత్రాలు, రిపర్లు, మొక్కజొన్న ఆడే యంత్రాలు మొదలైన వాటిని రైతులు ఇకనుంచి వ్యక్తిగతంగా సబ్సిడీపై పొందవచ్చు. తైవాన్ స్ప్రేయర్లు, చేతి పంపులు, చిన్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్, డీజిల్ ఇంజిన్స్, టార్పాలిన్ వంటివి కూడా వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. రైతుమిత్ర గ్రూపులు (ఆర్ఎమ్జీఎస్), జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లకు ప్రతి పంటకు సంబంధించిన యంత్ర సముదాయాన్ని ప్యాకేజీ రూపంలో ఇస్తారు. దీనిలో వరి, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ పంటలలో ప్రటట పంటకు మొదటి నుండి చివరి వరకు అవసరమయ్యే అన్ని పరికరాలను ఒక ప్యాకేజీ రూపంలో 50 శాతం సబ్సిడీపై గ్రూపునకు అందజేస్తారు. దీనిని కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సి) అంటారు. గ్రూపు సభ్యులు వీటిని గ్రామంలోని రైతులకు అద్దెకు ఇవ్వవచ్చు.
అదేవిధంగా గ్రూపులకు ఆ గ్రా మంలో అవసరమయ్యే ట్రాక్టర్‌తో నడిచే పని ముట్లను కూడా ప్యాకేజీలో 50 శాతం సబ్సిడీతో అందజేస్తారు. దీనిని ఇంప్లిమెంట్ సర్వీస్ స్టేషన్ (ఐఎస్ఎస్) అంటారు. దీనిద్వారా గ్రామ రైతులకు పనిముట్లు అందుబాటులో ఉం టాయి. పైన తెలిపిన పరికరాలు కావాల్సిన రైతులు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ సూచించారు.