అలరించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలు
డింyì
స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువతులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల పాటలకు స్టెప్పులేస్తూ అలరించారు. కార్యక్రమంలో పీఎస్ఐ రాఘవేందర్‌గౌడ్, చైతన్య యువజన సంఘం అధ్యక్షులు ఎలకుర్తి రమేష్, కటికర్ల పర్వతాలు, ఏ.టి. కృష్ణ, సముద్రాల రమేష్, మూఢావత్ రవి, వెంకటయ్య, రమేష్, శ్రీనివాసులు, సందీప్, కుకుడాల శ్రీను, మాధవ్‌గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.