భగవద్గీత సాక్షిగా ఆస్ట్రేలియా ఎంపీ ప్రమాణం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఎంపీ డానియల్ మూకీ (32) హిందూ మత పవిత్ర గ్రంధం భగవద్గీత సాక్షిగా మంగళవారం ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఆయనే. డానియల్ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. డానియల్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు తానేనని, దీన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని డానియల్ చెప్పారు.