యువీ దూకుడు.. యూసఫ్ మెరుపులు
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 182 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక లెజెండ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇండియా లెజెండ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్లలో సెహ్వాగ్(10) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై బద్రీనాథ్(7) కూడా నిరాశపరిచాడు.
కాగా, సచిన్ టెండూల్కర్(30; 23 బంతుల్లో 5 ఫోర్లు)లు ఆకట్టుకున్నాడు. అటు తర్వాత యువరాజ్ సింగ్- యూసఫ్ పఠాన్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. యువీ(60; 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగగా, యూసఫ్(62 నాటౌట్; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ జోడి నాల్గో వికెట్‌కు 85 పరుగులు చేసింది. శ్రీలంక లెజెండ్స్ బౌలర్లలో హెరాత్, సనత్ జయసూర్య, మహరూఫ్, వీరరత్నేలకు తలో వికెట్ లభించింది.