Interest subsidy
-
బాబూ.. మీ నోట వ్యవసాయం మాటా!
అసలు వ్యవసాయమే దండగ అని.. ఎంత మందిని వీలైతే అంత మంది రైతులను ఈ రంగం నుంచి బయటకు రప్పించడమే లక్ష్యం అని విజన్–2020 ద్వారా చాటిన పెద్దమనిషి చంద్రబాబు. గతంలో వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన ఘనుడూ ఈయనే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తానని కబుర్లు చెబుతున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్నదాతలకు చేస్తున్న మేలుపై నిస్సిగ్గుగా దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఎవరు నవ్వి పోయినా పర్వాలేదనుకునే, ఎవరేమన్నా తుడుచుకుని వెళ్లే రకమైన ఈ బాబు దింపుడుకళ్లం ఆశగా నోటికొచ్చిన హామీలిస్తున్నారు. – సాక్షి, అమరావతి ఆరుగాలం కాయకష్టం చేసి అందరికీ అన్నంపెట్టే అన్నదాతకు ఒకప్పుడు కంటి మీద కునుకు ఉండేది కాదు. పంట చేలకు నీరు పెట్టడానికి బోర్ల దగ్గర రేయింబవళ్లు కాపలా కాయాల్సివచ్చేది. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులుండేవి. రాత్రిళ్లు పొలాల్లో ఉండటం వల్ల రైతులు పాము కాట్లకు, కరెంటు షాకులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేది. విత్తనాల కోసం, విత్తుకున్న తర్వాత ఎరువుల కోసం ఎండనక, వాననక, పగలనకా, రేయనకా నిద్రాహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంతో ప్రభుత్వం పగటిపూటే తొమ్మిది గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలను చేయిపట్టుకుని నడిపిస్తోంది. దీనిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. తాను అధికారంలో ఉండగా రైతుల యోగ క్షేమాలను గాలికొదిలేసిన ఆయన ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రైతులకు మంచి చేస్తున్న సీఎం జగన్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దుర్మార్గం. కౌలు రైతులకు బాసట గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019ని తీసుకురావడమే కాకుండా పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఈ– క్రాప్ నమోదుతో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ ఫలాలతో కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నాలుగేళ్లలో 30 వేల మంది కౌలు రైతులకు రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీ ఇచ్చింది. 2.14 లక్షల మందికి రూ.224.27 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), 1.73 లక్షల మందికి రూ.487 కోట్ల పంటల బీమా పరిహారం ఇచ్చింది. కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందిస్తోంది. నాలుగేళ్లలో 25.38 లక్షల మందికి సీసీఆర్సీ పత్రాలు జారీ చేయగా, ఇందులో 17.71 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. మిగతా 8 లక్షల మంది రైతులు ఓసీల్లోని పేదలేనని చంద్రబాబుకు ఎవరైనా చెప్పండి. ఆక్వాకూ భరోసా గత ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు ఆక్వా సాగుకు స్లాట్ల ఆధారంగా విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.4.63 నుంచి రూ.7, 2016 నుంచి 2018 మే వరకూ యూనిట్ రూ.3.86 చొప్పున వసూలు చేసింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు యూనిట్‌కు రూ.2 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఇవ్వాల్సిన సబ్సిడీ భారం రూ.312.05 కోట్లను డిస్కంలకు చెల్లించకుండా బాకీ పెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఈ భారాన్ని భరించాల్సి వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు చెబుతున్నట్లు ఆక్వా రైతులకు రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా జరగనేలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుత ప్రభుత్వం 63,754 ఆక్వా కనెక్షన్లలో అర్హత ఉన్న 46,445 కనెక్షన్లకు యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తోంది. ఆది నుంచి రైతులకే అగ్రస్థానం వైఎస్ జగన్.. అధికారం చేపట్టిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. డిస్కంల ద్వారా దాదాపు 19.85 లక్షల వ్యవసాయ సర్వీసులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5.500 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. 30 ఏళ్ల పాటు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని కొనసాగించడం కోసం సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (సెకీ)తో ఒప్పందం చేసుకుంది. సెకీ నుంచి యూనిట్ కేవలం రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. ఆర్బీకేల వద్దకు వెళ్తే చాలు.. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఏ అవసరం ఉన్నా ఆర్బీకేల వద్దకు వెళితే చాలు. వ్యవసాయ సిబ్బంది అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. – వాసిరెడ్డి సత్తిరాజు, ఏడిద, మండపేట మండలం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులకు మద్దతు ధర నేను ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. ప్రభుత్వ చర్యలతో ధాన్యానికి మద్దతు ధర లభిస్తోంది. గతంలో వ్యాపారులు చెప్పిన ధరకు అమ్మాల్సి వచ్చేది. తడిసిన ధాన్యానికి కూడా మంచి ధర ఇస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది దగ్గరుండి ధాన్యం కొనుగోళ్లు చేయిస్తున్నారు. ధాన్యం సొమ్ము కూడా సకాలంలో అందించారు. – కోశెట్టి లోవరాజు, ఏడిద, మండపేట మండలం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎగతాళి చేసిన చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతోంది. గత ప్రభుత్వంలో వారికి కావాల్సిన కొద్ది మందికే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేవారు. గతంలో వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎగతాళి చేసిన చంద్రబాబుకు ఇప్పుడు వ్యవసాయం గురించి, అందునా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హతే లేదు. – రామిశెట్టి సుబ్బరాజు, ఏడిద, మండపేట మండలం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
మీరు దేశానికే ఆదర్శం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ‘మన అక్కచెల్లెమ్మలు దేశానికే ఆదర్శం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన పల్లెల నుంచే సాధికారతతో ఆవిర్భవించాలి. అందుకే మహిళా పక్షపాత ప్రభుత్వంగా వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయనటువంటి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత.. తదితర పథకాల ద్వారా ప్రతి అడుగు అక్క చెల్లెమ్మల కోసమే వేస్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని కోటి ఐదు లక్షల 13 వేల 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా నాలుగో ఏడాది శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రూ.1,353.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.4,969 కోట్లు లబ్ధి కలిగించామన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నారా వారిది నారీ వ్యతిరేక చరిత్ర గత చంద్రబాబు ప్రభుత్వంలో అంతా మోసమే. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు 2014 – 2019 మధ్య రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డు మీద పడేశాడు. దీనికి తోడు సున్నా వడ్డీ పథకాన్ని సైతం 2016 అక్టోబర్ నుంచి రద్దు చేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టాడు. దీంతో ఏ, బి గ్రేడ్లలో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారిపోయాయి. రూ.3,036 కోట్లు ఎదురు వడ్డీ కట్టాల్సి వచ్చింది. మొత్తంగా అప్పులన్నీ తడిసి మోపెడై 2019 ఏప్రిల్ నాటికి రూ.25,571 కోట్లకు ఎగబాకాయి. బాబు చేసిన మోసానికి 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలలో 18.36 శాతం మొండి బకాయిలుగా తేలాయి. అదీ నారా వారి నారీ వ్యతిరేక చరిత్ర. ఇప్పుడు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడింది. వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఫలితంగా ఈ రోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిలు కేవలం 0.3 శాతం మాత్రమే. 99.67 శాతం రికవరీ రేటుతో మన అక్కచెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. తేడా మీరే చూడండి. అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చాం మనందరి ప్రభుత్వానికి ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దాదాపు 90 లక్షలు ఉన్నారు. మనపై నమ్మకం పెరగడం వల్ల ఈ రోజు ఆ సంఖ్య 1.16 కోట్లకు పెరిగింది. అంటే 25 లక్షలకుపైగా పెరిగారు. సున్నా వడ్డీతో పాటు రూ.3 లక్షల వరకు రుణం అతి తక్కువ వడ్డీకే ఇప్పిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో 12–14 శాతం వడ్డీ వసూలు చేశారు. మనం దానిని 9.5 నుంచి 8.5 శాతం వరకు తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న రుణాలు రూ.25,571 కోట్లు. ఆ రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 పర్యాయాలు రూ.19,178 కోట్లు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా వారి చేతుల్లో పెట్టి వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాం. పలు విధాలా భరోసా ♦ జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.26,067 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45–65 వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,219 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1257 కోట్లు సాయం అందించాం. ♦ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు సాయం చేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,636 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ♦ పిల్లల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 25.17 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఈ పథకం కింద డిగ్రీలు, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు రెండు దఫాల్లో ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. సొంత గూడు కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ♦ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాం. ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. అంతటితో ఆగక 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో దాని విలువ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారా రెండు మూడు లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్లయింది. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 35.70 లక్షల మంది గర్భిణులు, బాలింతలు.. ఆరేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు మంచి చేస్తున్నాం. వీరి కోసం గతంలో రూ.400 కోట్లు ఖర్చు చేస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు మనం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ఇంతవరకు రూ.6,141 కోట్లు వెచ్చించాం. సూర్యోదయానికి ముందే.. ♦ దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా, సెలవు దినమైనా సరే చిక్కటి చిరునవ్వుతో తలుపులు తట్టి, అవ్వా గుడ్‌మార్నింగ్ అని చెబుతూ పింఛన్ ఇచ్చేలా మనవడు, మనవరాళ్లను మీ ఇంటికి పంపిస్తున్నాను. ♦ గతంలో వెయ్యి రూపాయలు పింఛన్ ఇస్తే గొప్ప అనే పరిస్థితి నుంచి మీ బిడ్డ హయాంలో రూ.2,750కి పెంచాం. వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం నాలుగేళ్లలో మీ బిడ్డ చేసిన ఖర్చు రూ.75 వేల కోట్లు. ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా రూ.49,845 కోట్లు వెచ్చించాం. ♦ రూపాయి లంచం, వివక్షకు తావు లేకుండా ఈ నాలుగేళ్లలో నేరుగా రూ.2,31,123 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర. ♦ నా అక్కచెల్లెమ్మలు రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లోనూ సగభాగం ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. వారి భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. దిశ యాప్‌ను 1 కోటి 24 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆపద వేళ పది నిమిషాల్లో సాయం అందేలా చూస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా రాష్ట్రంలో 30,369 మందిని కాపాడగలిగాం. అక్కచెల్లెమ్మలతో మాటామంతి సీఎం జగన్ వేదిక వద్ద డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. అక్కచెల్లెమ్మలతో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆ సమయంలో దూరంగా ఉన్న మంత్రి విశ్వరూప్‌ను దగ్గరకు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని, అందరితో కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఎంపీలు పిల్లి సుబాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీ‹Ùకుమార్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ.20 లక్షల రుణం.. రూ.80 వేల వడ్డీ రాయితి అన్నా.. గతంలో మాలాంటి పేదోళ్లకు అప్పు పుట్టేది కాదు. పుట్టినా రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలు కట్టేవాళ్లం. మీరు సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ ప«థకం ద్వారా నాలాంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అప్పు వస్తోంది. నేను ఆర్థి కంగా నిలదొక్కుకుని సొంతంగా వ్యాపారం చేసుకునే ధైర్యాన్ని కలిగించావు. నేను రూ.20 లక్షల వరకు రుణం, రూ.80 వేల వరకు వడ్డీ రాయితీ పొందాను. ఈ రోజు నేను జిరాక్స్ సెంటర్, టిఫిన్ సెంటర్‌తో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మీ పథకాలతో నాలుగేళ్లలో మా కుటుంబం రూ.3 లక్షలకు పైగా లబ్ధి పొందింది. మీ మేలు ఎప్పటికీ మరువం. – దుర్గా భవాని, ఉప్పలగుప్తం, భీమనపల్లి మండలం మేనమామగా నిరూపించుకున్నారు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నన్నెంతగానో ఆదుకుంది. గతంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే అప్పులతో భయమేసేది. మీ వల్ల నేను ఈ రోజు పాల వ్యాపారం చేస్తూ నెలకు రూ.7వేలు సంపాదిస్తున్నాను. ఇంటికి కొడుకులా, మా బిడ్డలకు మేనమామగా ఉంటానని చెప్పిన మీ మాట అక్షరాలా నిజమని నిరూపించారు. విద్యా ప«థకాల ద్వారా నా కుటుంబం రూ.2.40 లక్షల వరకూ లబ్ధి పొందింది. మీరు తెచ్చిన వలంటీర్ల వ్యవస్థ సేవలు మరువలేనివి. – పి.ధనక్ష్మి, బండార్లంక, అమలాపురం రూరల్ మండలం -
Fact Check: అండగా నిలిస్తే అభాండాలా? వాస్తవాలకు ముసుగేసిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు... పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) ఆధారంగా వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందిస్తున్నారు. అంతేకాదు.. కౌలురైతులకు ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులివ్వడమే కాదు, పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలూ అందిస్తున్నారు. ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. కానీ, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో ‘ఈనాడు’ నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రైతులను మభ్యపెట్టాలని చూస్తోంది. ‘కౌలు రైతులకు మిగిలింది కంటితుడుపే’ అంటూ సోమవారం ఆ పత్రిక వండివార్చిన కథనంపై అంశాల వారీగా ‘ఫ్యాక్ట్‌చెక్’ ఇదిగో.. ఆరోపణ: కొత్త చట్టం తెచ్చినా చిక్కుముడేనా? వాస్తవం: భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కులకు రక్షణ కల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీచేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. భూ యజమానులను ఒప్పించి మరీ కౌలుదారులకు సీసీఆర్సీలు జారీచేస్తోంది. 2019 నుంచి∙ఇప్పటివరకు 17.61 లక్షల మంది కౌలు రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు. ఆరోపణ: పంట రుణాల్లోనూ కోతే.. వాస్తవం: వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటుచేస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్దఎత్తున రుణాలు అందేలా చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల రుణాలు అందించారు. 2022–23లోనే 2.19 లక్షల మంది కౌలుదారులకు రూ.1,802.74 కోట్ల రుణాలు అందించారు. అంతేకాదు.. రూ.లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 30వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. ఆరోపణ: రైతుభరోసా సాయమేది? వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవాదాయ భూమి సాగుదారులకు కూడా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. 16 లక్షల మంది కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతుభరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు. మెజారిటీ కౌలుదారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులు సమీప ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు ‘భరోసా’ అందిస్తున్నారు. సొంత భూమిలేకుండా పూర్తిగా కౌలుకి మాత్రమే సాగుచేస్తున్న దాదాపు 1.24 లక్షల మందికి రైతుభరోసా సాయం అందిస్తున్నారు. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతుభరోసా కింద 46 నెలల్లో 3.92 లక్షల మందికి రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు.. వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఏమాత్రం వాస్తవంలేదు. వైఎస్సార్ రైతుభరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపజేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింపజేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు. ఈ–క్రాప్ బుకింగ్ ఆధారంగా 2019–20లో 6,331 మందికి రూ.5.73 కోట్లు, 2020–21లో 1.38 లక్షల మందికి రూ.140.70 కోట్లు, 2021–22లో 68,911 మందికి రూ.77.84 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), ఖరీఫ్–2020లో 51,238 మందికి రూ.156.80 కోట్లు, ఖరీఫ్–21 సీజన్లో 1,21,735 మందికి రూ.330.34 కోట్ల పంటల బీమా పరిహారంతో పాటు 2.50 లక్షల మంది రైతులకు రూ.3,500 కోట్ల సబ్సిడీతో కూడిన 8వేల క్వింటాళ్ల విత్తనాలు అందించారు. -
స్వల్పకాలిక రుణాలపై 1.5% వడ్డీ రాయితీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో రుణ వితరణను పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3 లక్షలలోపు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యింది. ఈ భేటీ వివరాలను సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలియజేశారు. సాగు కోసం తీసుకున్న స్వల్పకాలిక రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2022–23 నుంచి 2024–25 వరకూ అన్ని రకాల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కంప్యూటరైజ్డ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి తీసుకున్న రూ.3 లక్షలలోపు రుణాలపై ఈ రాయితీ వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.34,856 కోట్లు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై రాయితీ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఠాకూర్ చెప్పారు. వాస్తవానికి వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని 2020 మే నెలలో నిలిపివేశారు. బ్యాంకులు 7 శాతం వడ్డీ రేటుతో రైతులకు రుణాలిస్తున్నాయి. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును పెంచింది. దీంతో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అందుకే వడ్డీ రాయితీని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీజీఎల్‌ఎస్‌కు మరో రూ.50,000 కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీజీఎల్‌ఎస్)కు 2022–23 కేంద్ర బడ్జెట్లో రూ.4.5 లక్షల కోట్లు కేటాయించారు. ఈ పథకానికి మరో రూ.50,000 కోట్లు ఇవ్వనున్నారు. అదనపు సొమ్మును కోవిడ్‌తో దెబ్బతిన్న ఆతిథ్య, అనుబంధ రంగాలకు రుణాలిస్తారు. భారత్–ఫ్రాన్స్ ఒప్పందానికి ఆమోదం భారత రవాణా రంగంలో అంతర్జాతీయ రవాణా వేదిక(ఐటీఎఫ్) కార్యకలాపాలకు ఊతం ఇవ్వడానికి భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2022 జూలై 6న ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇకపై అందరికీ టీకేడీఎల్ డేటాబేస్ సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ(టీకేడీఎల్) డేటాబేస్‌ను ఇకపై కేవలం పేటెంట్ అధికారులే కాదు సామాన్యులు ఉపయోగించుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ యూజర్లకు దశలవారీగా ఈ డేటాబేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. చందారూపంలో రుసుము చెల్లించి వాడుకోవచ్చు. -
నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’
సాక్షి, అమరావతి: రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు. రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయం చేసింది. (చదవండి: ప్రతి ‘పార్లమెంట్’ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) -
అన్నదాతలకు శుభవార్త
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రబీ–2019లో అర్హత పొందిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేపట్టినప్పటికీ.. రబీ–2019 సీజన్‌కు ఆ నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 6,27,908 మంది రైతులకు రూ.128.47 కోట్ల మేర లబ్ధి చేకూరనుండగా.. ఈ నెల 20న నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు వర్తింపు వ్యవసాయ అవసరాల కోసం రూ.లక్షలోపు పంట రుణాన్ని తీసుకుని సకాలంలో వాయిదాలు (కిస్తీలు) చెల్లించిన రైతులకు వారు కట్టిన వడ్డీ (4 శాతం) మొత్తాన్ని ‘వడ్డీ లేని రుణ పథకం’ కింద గతంలో బ్యాంకులకు జమ చేసేవారు. రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు. అలాంటిది రూ.లక్షలోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్–2019 సీజన్లో 43,28,067 మంది రుణాలు పొందగా.. వారిలో 25,96,840 మంది రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారున్నారు. నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా చెల్లించిన 14.25 లక్షల మంది ఈ పథకం కింద అర్హత పొందారు. వీరికి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ కింద గతేడాది నవంబర్‌లో రూ.289.41 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. 6.28 లక్షల మంది రైతులకు రూ.128.47 కోట్లు రబీ–2019–20 సీజన్లో 28,08,830 మంది రుణాలు పొందగా.. వారిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారు 16,85,298 మంది ఉన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారిలో ఇప్పటివరకు 6,27,908 మంది రైతుల వివరాలను సున్న వడ్డీ పథకం రుణాలు (ఎస్వీపీఆర్) పోర్టల్‌లో బ్యాంకర్లు అప్లోడ్ చేశారు. వాస్తవ సాగుదారులకు మాత్రమే వడ్డీ రాయితీ అందించాలన్న సంకల్పంతో ఈ జాబితాను ఈ–క్రాప్‌తో సరిపోల్చి 2,50,550 మంది రైతులను వ్యవసాయ శాఖ అర్హులుగా గుర్తించింది. రైతులకు సాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. దీంతో బ్యాంకర్లు అప్లోడ్ చేసిన 6,27,906 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ఈ నెల 20వ తేదీన రూ.128.47 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. పాత బకాయిలూ చెల్లింపు వడ్డీ లేని రుణ పథకం కింద 2014–15 నుంచి 2018–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించి రైతుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ విధంగా 35 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.789.36 కోట్లను సున్నా వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం జమ చేసింది. ఇంకా సున్నా వడ్డీ రాయితీ కింద రూ.78 కోట్లతోపాటు పావలా వడ్డీ కింద రూ.42.39 కోట్ల బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకే.. రబీ 2019–20 సీజన్‌కు సంబంధించి వాస్తవ సాగుదారులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేశాం. అయితే, ఎస్వీపీఆర్ పోర్టల్‌లో బ్యాంకర్లు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. బ్యాంకర్లు అప్లోడ్ చేసిన జాబితాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకూ వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ అందనుంది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ లబ్ధిని వారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
గృహరుణంపై వడ్డీ రాయితీ 2020 మార్చి వరకూ...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద మధ్యాదాయ వర్గాల (ఎంఐజీ) వారికి ఇస్తున్న క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని (సీఎల్ఎస్ఎస్) 2020 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం కూడా చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద గృహ రుణం తీసుకున్న వారికి రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీని ఇస్తారు. డిసెంబర్ 30 నాటికి 3,39,713 మంది లబ్ధిదారులు సీఎల్‌ఎస్‌ఎస్‌ను వినియోగించుకున్నట్టు మంత్రి తెలిపారు. తొలుత వడ్డీ రాయితీతో కూడిన రుణ పథకాన్ని 2017 డిసెంబర్ వరకు ఏడాది కాల పరిమితితో కేంద్రం తీసుకొచ్చింది. నూతన నిర్మాణం, తిరిగి కొనుగోలు చేసే గృహాలపైనా దీన్ని పొందేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత దీన్ని 2019 మార్చి వరకు పొడిగించింది. తాజాగా దీన్ని మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయించింది. వార్షికంగా రూ.6– 12 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 20 ఏళ్ల కాలానికి సంబంధించి రూ.9 లక్షల రుణం మొత్తంపై 4 శాతాన్ని రాయితీగా పొందొచ్చు. రూ.12– 18 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి వడ్డీ రాయితీ మూడు శాతమే లభిస్తుంది. -
రూ.700 కోట్ల పెట్టుబడికి రూ.2,223.9 కోట్ల రాయితీలు
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ‘చారాణా కోడికి బారాణా మసాలా’ తరహాలో ఉందని అధికారులు, పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హెచ్‌సీఎల్ కంపెనీపై చూపుతున్న వల్లమాలిన ప్రేమే అందుకు నిదర్శనమంటున్నారు. 12 ఏళ్లలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు సర్కారు రూ.2,223.9 కోట్ల దాకా రాయితీలు ప్రకటించడం గమనార్హం. పోనీ ఒప్పందం ప్రకారం 7,500 మందికి ఉపాధి కల్పిసుదని చెబుతున్నారు. పెట్టుబడికి మూడు రెట్లు అదనంగా ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ పాలసీ 2014–20 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఇప్పుడు వీటికి అదనంగా హెచ్‌సీఎల్‌కు భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానికి మూడు రెట్లు కంటే ఎక్కువగా రూ.2,223.9 కోట్ల రాయితీలను ప్రభుత్వం కల్పించనుండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే హెచ్‌సీఎల్ పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో నడిచే సంస్థలా ఉందటూ ఐటీ శాఖలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూమి ద్వారానే రూ.728.9 కోట్ల లబ్ధి విజయవాడకు సమీపంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎదురుగా హెచ్‌సీఎల్‌కు 49.86 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మొదటి దశలో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 29.86 ఎకరాలు, రెండోదశలో రూ.50 లక్షలు చొప్పున మరో 20 ఎకరాలను ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్అండ్టీ మేధా టవర్స్ పక్కనే ఉన్న స్థలం కావడంతో ఇప్పుడు అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.15 కోట్లు పైనే పలుకుతోంది. అంటే 49.86 ఎకరాల భూమి విలువ రూ.747.9 కోట్లు ఉంటుంది. కానీ ఇంత ఖరీదైన భూమిని కేవలం రూ.19 కోట్లకే కేటాయిచడం ద్వారా హెచ్‌సీఎల్ కంపెనీకి ప్రభుత్వం రూ.728.9 కోట్ల మేర ప్రయోజనాన్ని కల్పించింది. ఇతర చోట్ల పనిచేసే సంస్థ ఉద్యోగులే విజయవాడకు తరలింపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రెండు దశల్లో 7,500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. మొదటి దశలో ఏడేళ్లల్లో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టి 4,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3,500కి ఉపాధి కల్పించనుంది. ఉపాధి కల్పించిన ప్రతి ఉద్యోగికి లక్ష రూపాయల చొప్పున ఈ కంపెనీకి ప్రభుత్వం ఒకేసారి రాయితీగా చెల్లించనుంది. అంటే 7,500 మందికి లక్ష రూపాయల చొప్పున లెక్కిస్తే రూ.75 కోట్లు కంపెనీకి రాయితీ రూపంలో అందనున్నాయి. కానీ ఇక్కడ కూడా ఓ మతలబు ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తామని హెచ్‌సీఎల్ పేర్కొంది. హెచ్‌సీఎల్ కేంద్రాల్లో 6,700 మంది తెలుగువారు పని చేస్తుండగా 627 మంది విజయవాడ వచ్చేందుకు ఆసక్తి చూపినట్లు సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి వి.వి.అప్పారావు తెలిపారు. అంటే ఇప్పటికే వివిధ చోట్ల పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులను విజయవాడ తరలించి కొత్త ఉద్యోగాల కల్పన పేరుతో రాయితీలను కంపెనీ అప్పనంగా పొందనున్నట్లు తేలిపోతోంది. శిక్షణ రాయితీలు రూ.144 కోట్లు.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత అంతర్గత శిక్షణ ఇవ్వడం పరిపాటి. కానీ హెచ్‌సీఎల్‌లో ఇలా శిక్షణ ఇస్తున్నందుకుగాను ప్రతి ఉద్యోగికి నెలకు రూ.5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి చెల్లించనుంది. ఇందుకోసం 1,000 సీట్ల సామర్థ్యంతో హెచ్‌సీఎల్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శిక్షణ ఆర్నెళ్లు ఉంటుందనుకున్నా ఏటా కనీసం రెండు వేల మంది ఈ కేంద్రంలో శిక్షణ పొందనున్నారు. అంటే 12 ఏళ్లలో 24,000 మంది చొప్పున లెక్కిస్తే సుమారు రూ.144 కోట్లు హెచ్‌సీఎల్‌కు శిక్షణ రాయితీలు కింద లభించనున్నాయి. తమ సంస్థలోకి తీసుకున్న వారికి మాత్రమే ఇందులో శిక్షణ ఇవ్వనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ తెలిపారు. ఇతర రాయితీల కింద మరో వంద కోట్లు ఇవికాకుండా బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై 5% వడ్డీ రాయితీ చొప్పున మొత్తం 12 ఏళ్లలో గరిష్టంగా రూ.76 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఐటీ పాలసీ 2014–015 కింద స్టాంప్ డ్యూ.టీ, రిజిస్ట్రేషన్ ఫీ, వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీల నుంచి 100% మినహాయింపు, 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 33 కేవీ–133 కేవీ ప్రత్యేక ట్రాన్స్మిషన్ ఏర్పాటు, తక్కువ ధరకు యుటిలిటీ సర్వీసులు, రవాణా వంటి అదనపు సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటే హెచ్‌సీఎల్‌కు ఏటా కనీసం రూ.100 కోట్ల వరకు ప్రయోజనం కలగనుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 ఏళ్లకు రూ.1,200 కోట్ల మేర ప్రయోజనం దక్కనుంది. మొత్తంగా రాయితీలు, ఇతర ప్రయోజనాల కింద హెచ్‌సీఎల్ రూ.2,223.9 కోట్ల మేర లబ్ధిపొందే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
పే...ద్ద ఇళ్లూ చవకే!
సాక్షి, హైదరాబాద్: ‘అందుబాటు గృహాలు’ అనగానే విస్తీర్ణం తక్కువగా ఉండే చిన్న ఫ్లాట్లనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ తాజా గా కేంద్రం అందుబాటు గృహాల విస్తీర్ణాన్ని పెంచింది. మిడిల్ ఇన్‌కం గ్రూప్ (ఎం ఐజీ)–1 కింద 160 చ.మీ., ఎంఐజీ–2 కింద 200 చ.మీ. కార్పెట్ ఏరియా ఫ్లాట్లకూ వడ్డీ రాయితీ వర్తింపజేసింది. దీంతో 2,150 చ.అ. విస్తీర్ణంలోని పే...ద్ద గృహాలకు కూడా క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కింద రూ.2.35 లక్షల వరకూ వడ్డీ రాయితీ అందుతుంది. గతంలో 30, 60 చ.మీ. కార్పెట్ ఏరియా ఉండే ఫ్లాట్లను మాత్రమే అందుబాటు గృహాలుగా పరిగణించి.. వాటికి మాత్రమే ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద వడ్డీ రాయితీలు అందించేవారు. ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తాజాగా ఎంఐజీ గృహాల కార్పెట్ ఏరియాలను 33% పెంచింది. గతంలో 120 చ.మీ.లుగా ఉన్న ఎంఐజీ–1 కార్పెట్ ఏరియాని ప్రస్తుతం 160 చ.మీ.లుగా, అలాగే గతంలో 150 చ.మీ.లుగా ఉన్న ఎంఐజీ–2 కార్పెట్ ఏరియాను ప్రస్తుతం 200 చ.మీ.లకు విస్తరించింది. వాస్తవానికి కేంద్రం ఎంఐజీ గృహాల విస్తీర్ణాలను పెంచడం ఇది రెండోసారి. పీఎంఏఐవై పథకం ప్రారంభంలో ఎంఐజీ–1 గృహాల కార్పెట్ ఏరియా 90 చ.మీ., ఎంఐజీ–2 గృహాలకు 110 చ.మీ. కార్పెట్ ఏరియాలుండేవి. నగరాల్లో ఈ విస్తీర్ణాల్లోని గృహాలకు పెద్దగా ఆదరణ లేకపోవటంతో ఎంఐజీ–1 గృహాల కార్పెట్ ఏరియాను 120 చ.మీ.లకు, ఎంఐజీ–2ని 150 చ.మీ.లకు పెంచింది. రెండు సందర్భాల్లోనూ ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ గృహాల కార్పెట్ ఏరియాల్లో, ఆదాయ పరిమితి, వడ్డీ రాయితీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. నెల జీతం లక్ష, లక్షన్నరైనా సరే.. లింగభేదంతో సంబంధం లేకుండా ఎంఐజీ గృహాలను ఎవరైనా సరే కొనుగోలు చేయవచ్చు. కాకపోతే తొలిసారి గృహ కొనుగోలుదారులై ఉండాలి. ఏడాది వేతనం రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల లోపు అంటే నెలకు లక్ష వేతనం ఉన్నవారు రూ.30 లక్షల దాకా గృహ రుణం తీసుకొని రూ.2.35 లక్షల వడ్డీ రాయితీని పొందవచ్చు. మిగిలిన మొత్తంపై మార్కెట్లో ఉండే వడ్డీ రేటు ఉంటుంది. కాకపోతే వీళ్లు కేవలం ఎంఐజీ–1 కింద 160 చ.మీ. కార్పెట్ ఏరియా ఉండే గృహాలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే 1,721 చ.అ. ఫ్లాట్లన్నమాట. ఇక, ఏడాది వేతనం రూ.18 లక్షలు అంటే నెలకు లక్షన్నర వేతనం తీసుకునేవాళ్లు రూ.60 లక్షల దాకా రుణం తీసుకొని.. రూ.2.30 లక్షల వడ్డీ రాయితీని పొందవచ్చు. వీళ్లు 200 చ.మీ. అంటే 2,152 చ.అ. ఫ్లాట్ల కొనుగోలుకు మాత్రమే అర్హులు. ఎంఐజీ గృహ కొనుగోలుదారులకు వడ్డీ రాయితీ అవకాశం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లో 25 వేల గృహాలు.. కేంద్రం తాజా నిర్ణయంతో ముంబై, ఢిల్లీ, గుర్గావ్ వంటి ప్రధాన నగరాల కంటే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కోచి, చండీగఢ్వంటి నగరాలకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయా నగరాల్లో 80 శాతం నిర్మాణాలు 200 చ.మీ. లోపే ఉంటాయని.. దీంతో ఈ గృహాలకు డిమాండ్ పెరుగుతుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ, పాత స్టాక్‌ను తొలగించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సౌత్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ చలపతి రావు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 18 వేల ఫ్లాట్లు ఇన్వెంటరీ ఉంటుంది. ఏపీలో సుమారు 6 వేల యూనిట్లుంటాయి. ఏపీ, తెలంగాణల్లో సుమారు 25 వేల యూనిట్లు ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత ఇళ్లకు, పై అంతస్తుకైనా.. వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకున్నా లేక అప్పటికే ఉన్న ఇంటి పైన మరో అంతస్తు వేసుకున్నా సరే రూ.1.50 వరకూ వడ్డీ రాయితీ లభిస్తుంది. కాకపోతే ఆయా గృహాలు అందుబాటు గృహాల కార్పెట్ ఏరియా నిబంధనలకు లోబడి ఉండాలి. 30, 60 చ.మీ. కార్పెట్ ఏరియాలోని ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ ఫ్లాట్లకు కూడా వడ్డీ రాయితీ ఉంటుంది. అయితే ఈ గృహాల కొనుగోలుకు కేవలం మహిళలే అర్హులు. కనీసం జాయింట్ ఓనర్‌గానైనా ఉండాలి. ఏడాది వేతనం రూ.6 లక్షలు లోపుండే మహిళలకు రూ.6 లక్షల రుణంపై 6.5% వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే రూ.2.67 లక్షల మినహాయింపు లభిస్తుంది. అలాగే 30, 60 చ.మీ. ఫ్లాట్ల నిర్మాణానికి కేంద్రం జీఎస్టీ, ఆదాయ పన్ను రాయితీలను అందిస్తుంది. ప్రతి యూనిట్ మీద రూ.1.5 లక్షల వరకు వడ్డీ రాయితీతో పాటూ 80 ఐబీఏ సెక్షన్ కింద ఆదాయ పన్ను రాయితీ కూడా ఉంటుంది. సాధారణ ప్రాజెక్ట్‌లకు ఎఫెక్టివ్ జీఎస్టీ 12 శాతం ఉండగా.. ఈ ప్రాజెక్ట్‌లకు 8 శాతం జీఎస్టీ ఉంటుంది. పైగా అందుబాటు గృహాలకు మౌలిక హోదా గుర్తింపు కారణంగా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు అవుతాయి. అయితే ఇక్కడొక మెలిక ఉందండోయ్.. ఈ తరహా ప్రాజెక్ట్‌ల్లో కనీసం 250 గృహాలుండాలి. వీటిల్లో కనీసం 35 శాతం ఫ్లాట్లు 60 చ.మీ. కార్పెట్ ఏరియా ఉండాలి. -
గృహ రుణాల వడ్డీ రాయితీపై శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ: గృహరుణాలపై కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదాయ వర్గాల వారికి శుభవార్త అందించింది. ఈ పథకం కింద గృహ రుణాలపై ఇచ్చే వడ్డీ సబ్సిడీని మరో 15నెలలపాటు కొనసాగించేందుకు నిర్ణయించింది. మధ్యతరగతి (ఎంఐజి) లబ్ధిదారులకు రూ. 2.60 లక్షల వరకు అందించే వడ్డీ సబ్సిడీని మార్చి , 2019 వరకు పొడిగించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) క్రింద ఎంఐజి లబ్ధిదారులకు వడ్డీ రాయితీ లభిస్తుందని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. 'రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'లో ప్రసంగించిన మిస్రా ఈ శుభవార్త అందించారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో 'హౌసింగ్ ఫర్ ఆల్'లక్ష్య సాధనలో ప్రభుత్వం నిబద్ధతను మిశ్రా పునరుద్ఘాటించారు. అలాగే సరసమైన గృహాలలో పెట్టుబడులు పెట్టమని ప్రైవేటు రంగాన్ని కోరారు. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో భారీగా ప్రోత్సాహం ఇస్తోందన్నారు. సీఎల్ఎస్ఎస్ (మధ్య ఆదాయ గ్రూపుల ఎంఐజీ) కోసం ప్రకటించిన గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం కింద రూ. 6 లక్షల పైబడిన వార్షిక ఆదాయం కలిగిన ఎంఐజీ లబ్ధిదారులు, 20సంవత్సరాల రూ.12 లక్షల వరకు రుణంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ పొందుతారు. రూ.12 వార్షిక ఆదాయం ఉన్నవారు రూ.18లక్షల రుణాలపై వడ్డీ సబ్సిడీ 3శాతం లభిస్తుంది. కాగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను (సీఎల్ఎస్ఎస్–ఎంఐజీ) ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 31న ప్రకటించారు.ఈ వడ్డీ సబ్సిడీ పథకం ఈ ఏడాది డిసెంబర్వరకు అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అందుబాటు గృహాల పరిధిలోకే!
సీఎల్ఎస్ఎస్ కింద రూ.2.35 లక్షల వరకూ వడ్డీ రాయితీ ♦ ఫ్లాట్లకే కాదు వ్యక్తిగత గృహాలు, పై అంతస్తులకూ రాయితీల వర్తింపు ♦ నెల వేతనం లక్ష, లక్షన్నరైనా సరే కొనుగోలుకు అర్హులు ♦ హైదరాబాద్‌లో 70 శాతం ఫ్లాట్లు ఈ కోవలోనివే ♦ బడా నిర్మాణ సంస్థలూ ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గు ♦ స్టాంప్ డ్యూటిని మినహాయిస్తే.. మరింత ఆదరణ: నిపుణుల సలహా ‘అందుబాటు గృహాలు’ అనగానే విస్తీర్ణం తక్కువుండే చిన్న ఫ్లాట్లని పట్టించుకోం! కానీ, మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. 1,350 చ.అ., 1,650 చ.అ. విస్తీర్ణంలోని ఫ్లాట్లూ వీటి పరిధిలోకే వస్తాయని!! అంతేకాదండోయ్.. గృహ రుణంలో రూ.2.35 లక్షల వరకు వడ్డీ రాయితీని కూడా పొందొచ్చు. లింగ భేదంతో సంబంధం లేకుండా ఏడాది వేతనం రూ.12, 18 లక్షల్లోçపున్న ఎవరైనా సరే అర్హులే! కాకపోతే తొలిసారి గృహ కొనుగోలుదారులై ఉండాలి సుమీ!! సాక్షి, హైదరాబాద్: గతంలో 30 చ.మీ., 60 చ.మీ. లోపు ఉండే ఫ్లాట్లను మాత్రమే అందుబాటు గృహాలుగా పరిగణించేవారు. వాటికి మాత్రమే వడ్డీ రాయితీలందించేవారు. కానీ, ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువగా ఉంటుండంతో నిర్మాణానికి డెవలపర్లు, కొనుగోళ్లకు కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొచ్చేవారు కాదు! దీంతో అందుబాటు గృహాల పథకం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, కేంద్రమిప్పుడు అందుబాటు గృహాల విస్తీర్ణాలను పెంచేసింది. 90 చ.మీ., 110 చ.మీ. కార్పెట్ ఏరియాలుండే ఫ్లాట్లనూ వీటి పరిధిలోకి చేర్చింది. పైగా క్రెడిట్ ఇన్పుట్ సబ్సిడీ (సీఎల్ఎస్ఎస్) పథకం కింద వడ్డీ రాయితీలనూ అందిస్తుంది. నెల జీతం లక్ష, లక్షన్నరైనా సరే అర్హులే.. నగరాల్లో నివసించే అల్పాదాయ వర్గాలతో పాటూ మధ్య, ఎగువ మధ్యతరగతి సొంతింటి కలను సాకా రం చేసేందుకు 90, 110 చ.మీ. (మిడిల్ ఇన్‌కం గ్రూ ప్ ఎంఐజీ) ఫ్లాట్లకూ కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. ఏడాది వేతనం 6 నుంచి 12 లక్షల లోపు అంటే నెలకు లక్ష వేతనమున్న వారు రూ.30 లక్షల దాకా గృహ రుణం తీసుకొని రూ.2.35 లక్షల రాయితీని పొందవచ్చు. మిగిలిన మొత్తంపై మార్కెట్లో ఉండే వడ్డీ రేటు ఉంటుంది. కాకపోతే వీళ్లు కేవలం 90 చ.మీ. కార్పెట్ ఏరియా ఉంటే గృహాలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే కనీసం 1,398 చ.అ. ఫ్లాట్లన్నమాట! అలాగే ఏడాది వేతనం రూ.18 లక్షలు అంటే నెలకు లక్షన్నర జీతం ఆర్జించే వారు రూ.60 లక్షల దాకా గృహ రుణం తీసుకొని.. రూ.2.30 లక్షలు రాయితీ పొందవచ్చు. 110 చ.మీ. కార్పెట్ ఏరియా... అంటే 1,700 చ.అ. ఫ్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలి. 1 చ.మీ.= 10.76 చ.అ.; కార్పెట్ ఏరియాను సూపర్ బిల్టప్ ఏరియాలోకి మారిస్తే.. బయటి గోడలు, మెట్లు, కారిడార్, క్లబ్ హౌజ్ వంటివి కలిపేయాలి. కార్పెట్ ఏరియాను ప్లింత్ ఏరియాకు మారిస్తే 20 శాతం, ప్లింత్ ఏరియాను సూపర్ బిల్టప్ ఏరియాకు మారిస్తే 18 శాతం స్థలం కలిసొస్తుంది. అంటే 90 చ.మీ. కార్పెట్ ఏరియా ఫ్లాట్‌ను చ.అ.ల్లోకి మారిస్తే 1,378 చ.అ., 110 చ.మీ. ఫ్లాట్ కాస్తా 1,700 చ.అ.లకు చేరుతుంది. నోట్: ప్రాజెక్ట్ డిజైన్, కామన్ ఏరియాలను బట్టి ఫ్లాట్ల విస్తీర్ణాలు మారతాయి. నిర్మాణంలో 20 వేల ఫ్లాట్లు.. అందుబాటు గృహాల విస్తీర్ణాలు పెరగడంతో హైదరాబాద్‌లో 70 శాతం నిర్మాణాలు వీటి పరిధిలోకే వస్తాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో 20 వేల ఫ్లాట్ల వరకుంటాయని.. వచ్చే 23 ఏళ్లలో సుమారు 40 వేల యూనిట్లొస్తాయని అంచనా వేశారాయన. 90 చ.మీ. ఫ్లాట్లు వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి తూర్పు జోన్లో, 110 చ.మీ. ఫ్లాట్లు పశ్చిమ జోన్లో మినహా నగరమంతా విస్తరించి ఉన్నాయి. వెస్ట్ జోన్లో ఇంకాస్త ఎక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్లు, విల్లాలుంటాయని వివరించారు. ఫ్లాట్ల సైజులూ పెరగడంతో సామాన్యులే కాదు మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజలూ ఈ గృహాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ కారణంగా నిర్మాణ సంస్థలూ ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గు చూపుతున్నాయి. గిరిధారి, శాంతా శ్రీరామ్, జనప్రియ, రామ్ కన్స్ట్రక్షన్స్, ప్రణీత్ గ్రూప్, అపర్ణా, ఎస్ఎంఆర్ వంటి నగరంలోని దాదాపు అన్ని నిర్మాణ సంస్థలూ ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. పై అంతస్తు వేసుకున్నా సరే రాయితీలు.. పీఎంఏవై, సీఎల్‌సీసీ రాయితీలు కేవలం నిర్మాణ సంస్థలు కట్టే ఫ్లాట్ల కొనుగోలుకు మాత్రమే కాదండోయ్.. సొంతంగా దగ్గరుండి కట్టించుకునే ఫ్లాట్లకు, వ్యక్తిగత గృహాలకూ వర్తిస్తాయి. అప్పటికే సొంతిల్లు ఉండి.. దాని మీద మరో అంతస్తు వేసుకున్నా సరే రాయితీలు పొందవచ్చు. కాకపోతే అందుబాటు గృహాల కార్పెట్ ఏరియా నిబంధనలకు లోబడి మాత్రమే ఆయా గృహాల విస్తీర్ణాలుండాలన్న విషయాన్ని మరిచిపోవద్దు. అందుబాటు గృహాల కూడా స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా) పరిధిలోకి వస్తాయి కాబట్టి నిర్మాణ సంస్థలూ గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాయి. అందుబాటు గృహాలకు ఆదాయానికి లింకేంటి? అందుబాటు గృహాల కొనుగోలుకు, కస్టమర్ల ఆదాయ ఆర్జనకు లింకు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే కొనుగోలుదారులు తమ ఆదాయ పరిమితిని బట్టి ఇళ్లను ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో 30,60 చ.మీ.చిన్న సైజు గృహాలు ఆదరణకు నోచుకోవటం లేదు. ఉదాహరణకు నెల జీతం రూ.50 వేల లోపుండే వాళ్లు కేవలం 60 చ.మీ. ఇళ్లను మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. 60 చ.మీ. కార్పెట్ ఏరియా అంటే సుమారు 750800 చ.అ. ఫ్లాటన్నమాట. మరి, నగరంలో ఈ విస్తీర్ణంలో ఎన్ని ఫ్లాట్లుంటాయి? ఒకవేళ ఉన్నా ఈ చిన్న సైజు ఫ్లాట్లను ఎంతమంది కొనుగోలు చేస్తారనేది సందేహం. ఎంఐజీ ఫ్లాట్ల కొనుగోలులోనూ అంతే! నెలకు లక్ష, లక్షన్నర ఆదాయం ఉన్నవాళ్లు ఈ గృహాల కొనుగోలుకు అర్హులు. పైగా తొలిసారి గృహ కొనుగోలుదారులకు మాత్రమే పథకం వర్తిస్తుందనే నిబంధన ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అందుబాటు గృహాల పథకం విజయవంతం కావాలంటే ఆదాయ ఆర్జన పరిమితిని తీసేయాలని ఏవీ కన్స్ట్రక్షన్ ఎండీ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్టాంప్ డ్యూటీని మినహాయిస్తేనే.. సక్సెస్ అందుబాటు గృహాల పథకం రాష్ట్ర స్థాయిలోనూ విజయవంతం కావాలంటే స్థానిక ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని మినహాయించాలి. స్థానిక సంస్థల ఫీజులు, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, నాలా పన్నుల్లో రాయితీలు కల్పించాలి. అప్పుడే నిర్మాణానికి డెవలపర్లు, కొనుగోళ్లకు కొనుగోలుదారులూ ముందుకొస్తారు. స్టాంప్ డ్యూటీ మినహాయింపనేది కొత్త డిమాండ్ ఏమీ కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1,200 చ.అ. లోపు గృహాల కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీలో రాయితీని కల్పించారు. – తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి -
వేశారు.. తీసేసుకున్నారు..!
► వడ్డీ రాయితీలో డ్వాక్రా మహిళలకు శఠగోపం అన్యాయం ► గందరగోళ పరిస్థితుల్లో పొదుపు సంఘాలు ► అసలేమి జరిగింది తెలియదంటున్న లీడర్లు ► సాంకేతిక లోపమంటున్న అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలకు కష్టాలు తీరడం లేదు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ మహిళలకు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా, ఆ ఊసే ఎత్తడం లేదు. చివరకు పెట్టుబడి నిధి కింద వచ్చిన మొత్తం కూడా వడ్డీకే సరిపోయిన విషయం తెలిసిందే. ఈ సమస్య నుంచి తేరుకోకమునుపే ఇటీవల వడ్డీ రాయితీని ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాగేసుకోవడంపై మహిళలు భగ్గుమంటున్నారు.. వేంపల్లె: పొదుపు సంఘాల్లో వడ్డీ రాయితీ గందరగోళం నెలకొంది. గత మార్చి 24న వడ్డీ రాయితీ కింద మంజూరైన మొత్తాన్ని సెర్ప్ నుంచి డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమైం ది. ఆ విధంగా వైఎస్సార్, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కేవలం ఏపీజీబీ శాఖల్లోనే మహిళల ఖాతాల్లో సెర్ప్ సంస్థ రూ.250 కోట్లకు పైగా జమచేసింది. జిల్లాలోని ఏపీజీబీ శాఖల్లో దాదాపు 28వేల గ్రూపులకు సంబంధించి రూ.25కోట్లు పడింది. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు, డీఆర్డీఏ అధికారులు సంబంధించిన ఏపీఎంలు, సీసీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ పడిందని దాదాపు రూ.5లక్షల రుణం ఉన్నవారికి రూ.30వేల దాకా జమ అయ్యిం ద ని చెప్పారు. అయితే వారి ఆనం దం ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 10 రోజుల్లోనే అనగా ఏప్రిల్ 6న తిరిగి సెర్ప్ సంస్థ ఆ డబ్బులను వెనక్కి తీసుకుంది. దీంతో డ్వాక్రా మహ్డి ళల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వీఓల సమావేశంలో సిబ్బందిని నిలదీస్తున్నారు. గురువారం వేంపల్లెలోని శ్రీరామ్‌నగర్‌లో వీఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీలను మహిళలు తీవ్రస్థాయిలో నిలదీశారు. డబ్బులను ఖాతాలో వేయడం దేనికి.. మళ్లీ వెనక్కు తీసుకోవడం దేనికని వారు మండిపడ్డారు. వడ్డీ రాయితీ వచ్చిన గ్రూపులకు మళ్లీ 2015 అక్టోబరు నుంచి అన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు రూ.25కోట్లకుపైగా ఈ వడ్డీ రాయితీ వచ్చింది. వడ్డీ రాయితీలో నిజాయితీ లేదు.. గతంలో పావలా వడ్డీ ఉండగా.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీలేని రుణాలను ప్రకటించింది. అయితే ప్రస్తు తం డ్వాక్రా మహిళలు 14శాతం అంటే రూ.1.50లతో వడ్డీతో తమ రుణాలను చెల్లిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడి నిధి కింద వచ్చిన హక్కు పత్రంలో కొన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ రాగా.. మరికొన్ని గ్రూపులకు వడ్డీ రాయితీ ఇంకా మంజూరు కాలేదు. కొన్ని గ్రూపులకు అరకొరగానే మంజూరైంది. ప్రభుత్వం వడ్డీ రాయితీని మంజూరు చేసేటప్పటికీ మేం చెల్లించిన వడ్డీకి సరిపోతుందని, ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఎక్కడ అందిస్తోందని డ్వాక్రా మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. సాంకేతిక లోపంతోనే ఇలా జరిగింది.. 2015 అక్టోబరులో పెట్టుబడి నిధి కింద రూ.3వేలు మంజూరైన గ్రూపులకు హక్కు పత్రాన్ని అందజేశామని, అందులో ఆ గ్రూపులకు వడ్డీ రాయితీ కూడా వచ్చిందని అటు బ్యాంకు అధికారులు, ఇటు డీఆర్డీఏ అధికారులు, ఆయా మండలాల ఏపీఎంలు వివరణ ఇస్తున్నారు. సాంకేతికలోపం కారణంగా వడ్డీ మంజూరు కానీ డ్వాక్రా సంఘాలకు కూడా ఏకంగా అన్ని ఖాతాల్లో జమ చేశారు. ఈ తప్పును తెలుసుకొని మళ్లీ పదిరోజుల వ్యవధిలోనే ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారని, మంజూరు కానీ గ్రూపులకు వడ్డీ రాయితీ వస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇది కుంభకోణమే.. వడ్డీ రాయితీ మొత్తాన్ని సెర్ప్ సంస్థ వెనక్కి తీసుకోవడం కుంభకోణంలాగా కనిపిస్తోంది. తమ గ్రూపునకు వడ్డీ రాయితీ మంజూ రైంది. డ్రా చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని డ్వాక్రా మహిళలందరికి తెలియజేశాం. వచ్చిన మొత్తం వెనక్కి పోవడంతో సమాధానం చెప్పలేకున్నాం. – ఆదిమూలం అంజన యాదవ్, డ్వాక్రా సంఘ లీడర్, వేంపల్లె స్పష్టత ఇవ్వాలి.. వడ్డీ రాయితీ ఆయా బ్యాంకు ఖాతాలలో డ్వాక్రా మహిళలకు జమ చేశారు. మార్చి 24న జమ చేసి, ఏప్రిల్ 6న మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు అధికారులను అడిగితే తమకు సంబంధంలేదని, అది డీఆర్డీఏ సంస్థకు చెందిన సమస్య అని చెబుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. – విజయలక్ష్మి, డ్వాక్రా సంఘ కోశాధికారి, వేంపల్లె వడ్డీ రాయితీ రాలేదు.. తమ గ్రూపు ఏర్పాటు చేసి ఏడాదిన్నర అయ్యింది. ఇంతవరకు వడ్డీ రాయితీ రాలేదు. ఇటీవల వడ్డీ రాయితీ వచ్చిందని అధికారులు చెప్పారు. తీసుకొనేలోపే మళ్లీ వెనక్కి పోయింది. ఎవరి ఏమి చెబుతున్నారో తెలియని పరిస్థితి. ఒక్కోసారి డ్వాక్రా సంఘంలో ఎందుకు చేరామా అని నిరాశ కలుగుతోంది. – నాగమ్మ, డ్వాక్రా సంఘ టీడర్, వేంపల్లె -
గృహ రుణాలపై వడ్డీ రాయితీ అమల్లోకి
⇒ జనవరి 1 నుంచి వర్తింపు; మార్గదర్శకాలు విడుదల... ⇒ నెలకు రూ. 2 వేల దాకా తగ్గనున్న ఈఎంఐ భారం ⇒ 70 ఆర్థిక సంస్థలతో ఎన్‌హెచ్‌బీ ఒప్పందం న్యూఢిల్లీ: మధ్య ఆదాయ వర్గాల కోసం ప్రకటించిన గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం ప్రయోజనాలను కేంద్రం జనవరి 1 నుంచి వర్తింపచేయనుంది. ఇందుకు సంబంధించిన సీఎల్ఎస్ఎస్ (మధ్య ఆదాయ గ్రూపుల – ఎంఐజీ) మార్గదర్శకాలను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీ శ్రీరామ్ కల్యాణరామన్ బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి ఈ పథకం ప్రయోజనాలను వర్తింపచేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ స్కీముతో మధ్య ఆదాయ వర్గాల లబ్దిదారులకు ఈఎంఐల భారం నెలకు రూ. 2,000 దాకా తగ్గనున్నట్లు ఆయన చెప్పారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను (సీఎల్ఎస్ఎస్–ఎంఐజీ) ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 31న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కీమ్ నిర్వహణ మార్గదర్శకాలనే కల్యాణరామన్ ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సీఎల్‌ఎస్‌ఎస్‌ను (ఎంఐజీ) అమలు చేసేందుకు 45 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, 15 బ్యాంకులతో పాటు మొత్తం 70 ఆర్థిక సంస్థలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌తో బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషించే మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి తోడ్పాటునివ్వడం అవసరమని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. స్కీము స్వరూపం ఇదీ.. సీఎల్ఎస్ఎస్ (ఎంఐజీ) కింద రూ.12 లక్షల దాకా వార్షికాదాయం గల వారు తీసుకునే గృహ రుణాల్లో రూ.9 లక్షల దాకా పరిమాణంపై 4 శాతం మేర వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. అలాగే రూ. 18 లక్షల దాకా వార్షికాదాయం గల ఉన్నవారికి రూ. 12 లక్షల దాకా గృహ రుణాలపై 3 శాతం వడ్డీ సబ్సిడీ దక్కుతుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 8.65 శాతంగా పరిగణించిన పక్షంలో... 4 శాతం వడ్డీ సబ్సిడీతో రూ.9 లక్షల హౌసింగ్ లోన్‌పై నెలకు ఈఎంఐ భారం రూ.2,062 దాకా తగ్గుతుందని కల్యాణరామన్ చెప్పారు. అలాగే 3 శాతం వడ్డీ సబ్సిడీతో రూ. 12 లక్షల రుణంపై నెలవారీ వాయిదాల భారం రూ. 2,019 మేర తగ్గగలదని వివరించారు. జనవరి 1 నుంచి స్కీమును వర్తింపచేస్తున్నందున ఈ ఏడాది ప్రారంభం నుంచి గృహ రుణం పొందినవారు లేదా దరఖాస్తులు ప్రాసెసింగ్ ప్రక్రియలో ఉన్న వారు రూ.2.35 లక్షల దాకా వడ్డీ సబ్సిడీ ప్రయోజనాలు పొందడానికి అర్హులని కల్యాణరామన్ పేర్కొన్నారు. రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల దాకా వార్షికాదాయాలు ఉన్న మధ్య ఆదాయ వర్గాలు కూడా కొత్త సీఎల్ఎస్ఎస్ (ఎంఐజీ) కింద వడ్డీ సబ్సిడీ పొందేందుకు అర్హులని ఆయన వివరించారు. -
ఇల్లు కొంటే లాభమే!
చెల్లించే వడ్డీలో కేంద్రం భారీ రాయితీలు ఏటా రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికీ వర్తింపు గరిష్టంగా రూ.2.4 లక్షల వరకు ప్రయోజనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పొందే అవకాశం మూడు శ్లాబ్‌ల కింద భిన్న రకాలుగా సబ్సిడీ న్యూఢిల్లీ: మొదటిసారి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే వారికి, కట్టించుకునే వారికి శుభవార్త. వార్షికాదాయం రూ.18 లక్షల వరకూ ఉన్నా సరే.. వారు ఇంటికోసం తీసుకునే రుణంలో కొత్త మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ ఇవ్వనుంది. 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే వారు చెల్లించే వడ్డీలో దాదాపు రూ.2.4 లక్షల మొత్తాన్ని కేంద్రం సబ్సిడీగా చెల్లిస్తుంది. ఈ మేరకు నెలసరి వాయిదాలు సుమారు రూ.2,200 మేర తగ్గడం ఇందులోని ప్రయోజనం. 2022 నాటికి అందరికీ సొంతిల్లు లక్ష్యాన్ని సాధించేం దుకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తాజాగా రెండు సబ్సిడీ పథకాలను తీసుకువచ్చింది. 20 ఏళ్ల కాల వ్యవధికి ఇంటి రుణం తీసుకునే వారు కూడా ఈ సబ్సిడీలను పొందేందుకు అర్హులు. ఇప్పటికే సొంతింటికి సంబంధించి ఓ సబ్సిడీ పథకం అమల్లో ఉంది. కానీ వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉన్నవారు, అది కూడా 15 ఏళ్ల కాల వ్యవధికి మించని రుణం తీసుకున్న వారికి మాత్రమే అది అందుతోంది. కేంద్రం తాజాగా దీన్ని మరింత సరళీకరించింది. ఒక్కొక్కరికీ ఒక్కోలా... వార్షికాదాయాన్ని బట్టి ఇంటి రుణంపై కేంద్రం భరించే సబ్సిడీ కొద్దిగా మారుతుంది. రూ.6 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారు రుణంపై ఇల్లు కొంటే.. వారికి వడ్డీపై 6.5 శాతం రాయితీ లభిస్తుంది. అయితే ఎంత రుణం తీసుకున్నా కేవలం రూ.6 లక్షల రుణం వరకే వడ్డీ సబ్సిడీ పరిమితం అవుతుంది. మిగతా రుణంపై వడ్డీ మామూలుగానే ఉంటుంది. ఉదాహరణకు 9 శాతం వడ్డీతో రూ.20 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు రూ.6 లక్షలపై 6.5 శాతం రాయితీపోను కేవలం 2.5 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. మిగతా రూ.14 లక్షలకు వడ్డీ 9 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు వడ్డీపై 4 శాతం రాయితీని అందుకోవచ్చు. ఈ రాయితీ రుణం మొత్తంలో రూ.9 లక్షలకే పరిమితం. ఏడాదికి రూ.18 లక్షల వరకు ఆదాయమున్న వారు.. వారి రుణంలో రూ.12 లక్షల మొత్తానికి 3 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ఈ మూడూ శ్లాబ్‌లలో ఉన్న వారు 20 ఏళ్ల కాల వ్యవధికి ఇంటి రుణంపై నికర వడ్డీ సబ్సిడీ రూపేణా రూ.2.4 లక్షల (9 శాతం వడ్డీ ఆధారంగా) వరకు ప్రయోజనం పొందవచ్చు. అంటే నెలసరి వాయిదా రూ.2,200 వరకు తగ్గుతుంది. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి, అసలుకు ఇప్పటికే ఆదాయపన్ను పరంగా పలు మినహాయింపులున్న విషయం తెలిసిందే. తాజా సబ్సిడీలు వాటికి అదనం కావడం మరింత ఆకర్షణీయం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), హడ్కోలకు ఈ సబ్సిడీ పథకాలను అమలు చేసే బాధ్యతను కేంద్రం కట్టబెట్టింది. -
3 లక్షలు దాటిన పంట రుణానికి వడ్డీ సబ్సిడీ కట్!
న్యూఢిల్లీ: రూ. మూడు లక్షలు దాటిన స్వల్పకాలిక పంట రుణాలపై రైతులకు వడ్డీ సబ్సిడీ ఇవ్వరాదని వ్యవసాయ రుణ పథకం మార్గదర్శకాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. అలాగే వడ్డీ సబ్సిడీ రైతులకు ఇచ్చేందుకు ఏడాది లోపు రుణం చెల్లించాలనే నిబంధన సరికాదని పేర్కొంది. ఈ కాలవ్యవధి ఏడాదికి మించి ఉంటే బాగుంటుందని సూచించింది. ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్లో పంట రుణాల లక్ష్యాన్ని రూ. 9 లక్షల కోట్లకు పెంచింది. వడ్డీ సబ్సిడీ అందించేందుకు రూ. 15 వేల కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో పంట రుణాలు అవసరమైన చిన్న, సన్నకారు రైతులకు అందించేందుకు, వడ్డీ సబ్సిడీ పథకం సమర్థంగా అమలయ్యేందుకు తగిన మార్గదర్శకాల రూపకల్పనకు నాబార్డ్ మాజీ చైర్మన్ వీసీ సారంగి నేతృత్వంలోని ఓ కమిటీ ఏర్పాైటె ంది. ప్రభుత్వానికి పలు కీలక సిఫార్సులు చేసిన ఈ కమిటీ.. ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2006-07లో వడ్డీ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రుణాల్లో పెరుగుదల కనిపించిందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా రైతుకు స్వల్పకాలిక రుణం రూ. 3 లక్షలకు మించరాదని.. అంతకు మించి ఇస్తే వడ్డీ సబ్సిడీ ఇవ్వరాదని సూచించింది. -
గృహ రుణాలపై 6.5 శాతం వడ్డీ రాయితీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)-హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాలకు 6.5 శాతం వడ్డీ రాయితీపై గృహ రుణాల ను బ్యాంకులు, ఇతర గుర్తింపు పొం దిన ఆర్థిక సంస్థల ద్వారా మంజూరు చేయనున్నాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఎండీ, సీఈవో శ్రీరాం కల్యాణరామన్ పేర్కొన్నారు. పీఎంఏవైలో అంతర్భాగమైన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం అమలుపై శనివారం నగరంలోని ఓ హోటల్లో బ్యాంకర్లతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథి గా ఆయన పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం అమలుకు ఎన్‌హెచ్‌బీ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుందన్నారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం గల బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు వార్షిక ఆదాయం గల తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలు (ఎల్ఐజీ) ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులని చెప్పారు. 15 ఏళ్ల నెల వారీ వాయిదాలకు గరిష్టంగా రూ.2.20 లక్షల వరకు వడ్డీ రాయితీని ఈ పథకం కింద మంజూరు చేస్తామన్నారు. గరిష్టంగా రూ.6 లక్షల వరకే వడ్డీ రాయితీ వర్తిస్తుందని, మిగిలిన రుణ మొత్తానికి సాధారణ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జూన్‌లోగా రూ.20 వేల కోట్ల రుణాలు పీఎంఏవై రుణాల పంపిణీకి రూ.20 వేల కోట్ల నిధులను వచ్చే జూన్ 31లోగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు విడుదల చేయనున్నట్లు శ్రీరాం కల్యాణరామన్ తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లబ్ధిదారులకు రుణాలుగా విడుదల చేస్తాయన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే ఈ రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ దానకిశోర్, ఎస్బీహెచ్ సీజీఎం వి.విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు వడ్డీ రాయితీ అందించండి...
బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం ముంబై : వడ్డీ రాయితీతో రైతులకు స్వల్పకాల పంట రుణాలను అందించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ రుణాలకు రూ.3 లక్షల వరకు 2 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వల్పకాల రుణాలకు రూ.3 లక్షల వరకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పించే పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పంట రుణం రైతుకు పంపిణీచేసిన నాటి నుంచి ఆ రుణాన్ని రైతు తిరిగి చెల్లించే తేదీ లేక పంట రుణం చెల్లించాల్సిన గడువు తేదీ ఆధారంగా 2 శాతం వడ్డీ రాయితీ లెక్కింపు జరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. రాయితీ కారణంగా క్షేత్రస్థాయిలో రైతులకు పంట రుణాలు 7 శాతం వడ్డీకి లభిస్తాయని తెలిపింది. ఇది కాక సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు 3 శాతం అదనపు వడ్డీ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు మాత్రమే పంట రుణం 4 శాతం వడ్డీకి లభిస్తుందని పేర్కొంది. సకాలంలో చెల్లించని రైతులకు ఈ 3 శాతం వడ్డీ ప్రయోజనం ఉండదని వివరించింది. గిట్టుబాటు ధరల లభించన ప్పుడు పంట ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునేందుకు, కిసాన్ క్రెడిట్ కార్డులను కల్గిన చిన్న, సన్నకారు రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రయోజనాలను మరో ఆరు నెలల వరకు పొందవచ్చని తెలిపింది. ప్రకృతి వైపరిత్యాల నుంచి రైతులను ఆదుకోవడానికి పునర్వ్యవస్థీకరించిన రుణాలకు తొలి ఏడాది ఈ 2 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని, తర్వాతి సంవత్సరం నుంచి సాధారణ వడ్డీయే వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వానికి రూ.65,896 కోట్ల మిగులు ఆర్బీఐ గురువారం తన మిగులు లాభాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదలాయించింది. ఈ మొత్తం రూ.65,896 కోట్లు. గత ఏడాది బదలాయింపులకన్నా ఇది 25 శాతం (రూ.52,679 కోట్లు) అధికం. గురువారం జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డెరైక్టర్ల సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ 553వ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశానికి గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షత వహించారు. సెంట్రల్ బోర్డ్‌లో ప్రభుత్వ నామినీ డెరైక్టర్లు, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. పావుశాతం రెపో కోత: బ్యాంకర్ల అంచనా ఆర్బీఐ రెపోను సెప్టెంబర్ 29 సమీక్ష సందర్భంగా మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని (ప్రస్తుతం 7.25 శాతం)బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో రికార్డు స్థాయి కనిష్ట స్థాయి 3.78 శాతానికి పడిపోవడం ఇందుకు కారణమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బీపీ శర్మ మాట్లాడుతూ, రేటు కోతను బ్యాంకర్లు కోరుతున్నారన్నారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయి ఈ ఆశలు పెంచుతోందన్నారు. ఆర్బీఐ బోర్డ్ సమావేశం సందర్భంగా జరిగిన విందు కార్యక్రమం అనంతరం పురి, శర్మలు విలేకరులకు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచర్, యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ తదితరులు పాల్గొన్నారు. విశ్లేషణా సంస్థలదీ ఇదే మాట...: కాగా పలు ఆర్థిక విశ్లేషణా సంస్థలు కూడా సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా రెపో రేటును తగ్గించవచ్చనే అంచనాల్లోనే ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో తక్కువగా ఉండడం దీనికి కారణంగా చూపుతూ, ఆగస్టు నెలలో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా-మిరిలించ్, డీబీఎస్, ఎస్బీఐ రిసెర్చ్‌లు విడుదల చేసిన నివేదికల్లో తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఈ ఏడాది ఆర్బీఐ రెపోను ముప్పావుశాతం తగ్గించింది. -
వసూలు సరే.. వడ్డింపులేవీ?
- మూడేళ్లుగా వడ్డీ రాయితీ విదల్చని సర్కారు - పేరుకుపోయిన రూ.49.74 కోట్ల బకాయిలు - ఆందోళనలో మహిళా సంఘాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్వయంసహాయక సంఘాలు సంకటంలో పడ్డాయి. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తలపెట్టిన వడ్డీ లేని రుణాల పథకం.. ఆర్థిక చిక్కుల్లోకి నెట్టేశాయి. దీంతో జిల్లాలోని మహిళలు గత మూడేళ్లుగా తీసుకున్న బ్యాంకు లింకు రుణాలకు వడ్డీ చెల్లిస్తుండడంతో ఆర్థిక బలోపేతం సంగతేమో గాని అసలుకే ఎసరు వచ్చింది. జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు పొందిన బ్యాంకులకు గత మూడేళ్లకాలంలో రూ. 106.36 కోట్ల మేర వడ్డీ చెల్లించాయి. కానీ ఈ వడ్డీ మొత్తాన్ని సర్కారు రద్దు చేసి నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ. 56.59 కోట్లు చెల్లించి మమ అనిపించింది. దీంతో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి వడ్డీ నిధులు రాకపోవడంతో మహిళలు సొంతంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. స్పందించని సర్కారు.. జిల్లాలో 31,719 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో దాదాపు 3.35లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళా సంఘానికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి లింకు రుణాలందిస్తోంది. ఈ రుణాన్ని పొందిన మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఈ రుణాలను ఏవిధమైన వడ్డీ లేకుండా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సంఘాలు సైతం మొగ్గుచూపాయి. దీంతో జిల్లాలో దాదాపు అన్ని సంఘాలు అర్హత ప్రకారం రుణాలు పొందాయి. అయితే రుణ చెల్లింపుల్లో భాగంగా సంఘాలు ముందుగా వడ్డీ డబ్బులు సైతం బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన తర్వాత సకాలంలో రీపేమెంట్ చేసిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బును తిరిగి ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మహిళా సంఘాలు వడ్డీ రూపంలో రూ.106.36 కోట్లు చెల్లించినట్లు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మూడేళ్లకు సంబంధించి కేవలం రూ. 56.59 కోట్లు మాత్రమే విడుదల చేసి మమ అనిపించింది. ఇంకా రూ. 49.74 కోట్లు రావాల్సి ఉండగా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. వడ్డీపై వడ్డీ.. లింకు రుణాలు పొందిన సంఘాల నుంచి బ్యాంకులు ముక్కుపిండి మరీ వసూళ్లకు ఉపక్రమిస్తున్నాయి. వాస్తవానికి వడ్డీ లేని రుణాలను ముందస్తుగా మంజూరు చేస్తే సంఘాల సభ్యులకు ఊరట లభించేంది. అదేవిధంగా తిరిగి చెల్లింపులు సైతం ఉత్సాహంతో చేసేవారు. కానీ రుణ మొత్తానికి సంబంధించి చెల్లింపులు వందశాతం పూర్తయిన తర్వాత వడ్డీ రాయితీ కల్పించడం సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం రాయితీ ప్రక్రియతో సంబంధం లేకుండా వడ్డీని కలిపి వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సరిగ్గా చెల్లింపులు చేయని సంఘాలపై వడ్డీ డబ్బులపైనా అదనంగా వడ్డీ వసూలు చేస్తున్నట్లు పలువురు మహిళలు పేర్కొంటున్నారు. -
పంటరుణాల వడ్డీపై సబ్సిడీ కొనసాగింపు
కేంద్ర కేబినెట్ నిర్ణయం నాబార్డ్‌కు రూ. 4399 కోట్లు విద్యుత్ చట్ట సవరణకు ఓకే న్యూఢిల్లీ: స్వల్పకాలిక పంట రుణాల వడ్డీపై సబ్సిడీ సదుపాయాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 3 లక్షల వరకు రుణంపై సంవత్సరానికి 7% వడ్డీ, అలాగే 2014-15 సంవత్సరానికి రుణం తీసుకున్నవారు సమయానికి రుణం చెల్లిస్తే.. వారికి అదనంగా 3% వడ్డీ తగ్గింపు సదుపాయం అందించాలన్న ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. ఇందుకోసం రూ. 18,583 కోట్లను విడుదల చేసేందుకు అంగీకరించింది. అందులో రూ. 4,399 కోట్ల ఆర్థిక సాయాన్ని సహకార బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రీఫైనాన్స్ కోసం నాబార్డ్‌కు అందించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న చిన్న రైతులకు వడ్డీపై సబ్సీడీ ఇవ్వనున్నారు. కబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. ► లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామక కమిటీలో లోక్‌సభలో అత్యధిక స్థానాలున్న ప్రతిపక్ష పార్టీ నేతకు స్థానం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం. ► 500 మెగావాట్ల సామర్ధ్యంతో వివిధ రాష్ట్రాల్లో 25 సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు రూ. 4050 కోట్ల ఆర్థిక సాయం . ► మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం భూ బదిలీ వేగవంతంగా జరిగేలా చర్యలు. ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమికి ఇకపై నగదు పరిహారమే ► సంస్కరణలకు ఊతమిచ్చేలా విద్యుత్ చట్టంలో సవరణలకు అంగీకారం. ► చక్కెర మిల్లులకు శుభవార్త. ఇథనాల్ సేకరణ రేటును లీటరుకు రూ. 48.50 నుంచి రూ. 49.50 మధ్యగా నిర్ణయించారు. ► తమిళనాడులో రూ. 1593 కోట్లతో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం. -
దిగమింగి దగా చేశాడు
ఆశాలపల్లి(సంగెం) : ఐకేపీ సీఏ నిర్లక్ష్యంతో గ్రామైక్య సంఘాల మహిళలను రూ. 50 లక్షలు నష్టపోయూరు. 48 సంఘాలకు రాయితీ వడ్డీ రాకుండా సీఏ ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఇలా ఒక్కో సంఘం రూ. లక్ష-1.8 లక్షలు నష్టపోయింది. నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. మండలంలోని ఆశాలపల్లిలో రెండు గ్రామైక్య సంఘాల్లో 48 సంఘాలకు చెందిన 580 మంది సభ్యులున్నారు. వీరంతా క్రమం తప్పకుండా పొదుపులు, బ్యాంకు రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నారు. కానీ మూడేళ్లలో ఒక్క సంఘానికీ వడ్డీ తిరిగిరాలేదు. ఇదే విషయూన్ని సీఏ బొల్లేబోయిన కుమారస్వామిని అడిగితే దాటవేస్తూ వచ్చాడు. మహిళలు వారింట్లో సమస్య చెప్పుకోగా గత నెల 22న ఏపీఎం ఝాన్సీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో అధికారులు గురువారం బహిరంగ చర్చ చేపట్టారు. తమ పొదుపులు, రుణ వాయిదాలను బ్యాంకులో చెల్లిస్తానని సీఏ కుమారస్వామి తీసుకుని సొంతానికి వాడుకునేవాడని మహిళలు ఆరోపించారు. అన్ని సంఘాల పుస్తకాలు తన వద్దే పెట్టుకునేవాడని, ఈ విషయం బయటపెట్టొద్దని బెదిరించేవాడని పేర్కొన్నారు. లింకేజీ కింద రూ. లక్ష రుణం మంజూరైతే రూ. వెయ్యిచొప్పున కమీషన్ తీసుకునేవాడని, అభయహస్తం బీమా సొమ్ము రూ. 30 వేలు మంజూరైతే రూ.4 వేల చొప్పున కోత విధించేవాడని ఆరోపించారు. ఆడిట్ కోసం రూ. 150, మొబైల్ బుక్కీపింగ్ ఇతరాల కోసం ఒక్కో సంఘం నుంచి నెలకు రూ.450ల చొప్పున వసూలు చేశాడని తెలిపారు. ఇన్ని వసూళ్లకు పాల్పడి కూడా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీని దక్కనీయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఏపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయూలని కోరారు. సీఏ కుమారస్వామి, సీసీ కొమురయ్యపై పీడీకి నివేదిక ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. సర్పంచ్ గాజే మురళి, మాజీ సర్పంచ్ కిశోర్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ సూరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళల నెత్తిన వడ్డీ రాయితీ
డ్వాక్రా మహిళా సంఘాలకు గతంలో రూ.5 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. కానీ ఇకనుంచి మేం వడ్డీ లేకుండా రూ.10లక్షల వరకు రుణాలు అందిస్తాం. అంతేకాకుండా గతంలో ఉన్న వడ్డీ బకారుులు సైతం వచ్చే నెల మొదటి వారంలో చెల్లిస్తాం’’ - ఇది మంత్రి హరీష్‌రావు శనివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో చెప్పిన మాట. మా సంఘం తరఫున ఈఏడు మార్చిలో రూ.5లక్షలు బ్యాంకు నుంచి అప్పుగా తెచ్చుకున్నం. నెలనెలా వడ్డీ రాయితీ ఇస్తామని సర్కార్ చెప్పింది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. బ్యాంకువారు ఇప్పటికే రూ.50వేల దాకా వడ్డీ వసూలు చేసిండ్లు. మాకు లోన్ ఇచ్చి ఏం లాభం’’ - ఇది మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ప్రగతి మహిళా సంఘం సభ్యుల ఆవేదన. మేడిపెల్లి: మహిళల ఆర్థిక స్వావలంబనలో భాగంగా గత ప్రభుత్వాలు పావలా వడ్డీ, వడ్డీలేని రుణం పథకాలను ప్రవేశపెట్టారుు. దీంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం వాటికి నెలనెలా వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయూలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం మొదలు ఇప్పటివరకు మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించలేదు. తమ నుంచి బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తుండడంతో అదనపు భారం పడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లేదట జిల్లాలో మొత్తం 46,738 మహిళా సంఘాలుండగా ఇందులో 45,144 సంఘాలు వివిధ బ్యాంకుల నుంచి రూ.570.31 కోట్ల రుణాలు తీసుకున్నారుు. వీరు తీసుకున్న రుణాలకు ప్రతీ నెల ప్రభుత్వం నుంచి సుమారుగా రూ.2.5 కోట్ల వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు రూ.22.62 కోట్ల వడ్డీ రాయితీ ఇంతవరకు రాలేదు. బడ్జెట్ లేదనే సాకుతో ప్రభుత్వం తొమ్మిది నెలలుగా వడ్డీ చెల్లించడం లేదు. దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు పావలావడ్డీకి రుణాలు ఇవ్వగా, అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ వడ్డీలేని రుణాలు అందజేసింది. అటు తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ అందజేయలేదు. వారి నిబంధనలు వారివే... మహిళా సంఘాలన్నింటికి వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలు ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ వాస్తవంలో బ్యాంకులు తమ నిబంధనల ప్రకారమే వడ్డీ వసూలు చేస్తున్నారుు. ఒక్కో మహిళా సంఘం రూ.3లక్షల లోపు(రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు) రుణం పొందితే రూ.0.50 వడ్డీ పడుతోంది. అలాకాకుండా రూ.3లక్షలకు పైగా(రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు) రుణం తీసుకుంటే రూ.1.25 వడ్డీ పడుతోంది. ఈ విషయంలో మహిళా సంఘాలు ఎంత మొత్తుకున్నా వారి మాట బ్యాంకర్లు వినడం లేదు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న వడ్డీని త్వరగా చెల్లించాలని, రూ.3లక్షలకుపైగా రుణాలు తీసుకున్న సంఘాలకు అదనపు వడ్డీరేటును తగ్గించాలని మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 46,738 జిల్లాలో మహిళా సంఘాలు 45,144 రుణం తీసుకున్న సంఘాలు రూ.570.31 కోట్లు తీసుకున్న రుణం మొత్తం నెల రావాల్సిన వడ్డీ (రూ.కోట్లలో) మార్చి 2.50 ఏప్రిల్ 2.70 మే 2.44 జూన్ 2.55 జూలై 2.76 ఆగస్టు 2.01 సెప్టెంబర్ 2.66 అక్టోబర్ 2.50 నవంబర్ 2.50 మొత్తం 22.62 -
రుణమాఫీ పతనం...!
ప్రభుత్వ మార్గదర్శకాల్లోని నిబంధనల వల్ల సహకార రైతులకు రుణాలు మాఫీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (సొసైటీ) రుణాలు తీసుకుంటూ 2014 మార్చి 31వ తేదీలోపు తిరిగి చెల్లిస్తే వారికి వడ్డీ రాయితీ లభిస్తుంది. అదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2013 ఖరీఫ్‌లో రుణాలు పొందిన రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. రబీలో 2014 జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ లోపు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించడం లేదు. అదే విధంగా 2014 మార్చి 31వ తేదీలోపు అప్పు చెల్లించి ఏప్రిల్ 1 తర్వాత రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం 2013 డిసెంబర్ 31లోపు మంజూరు చేసిన రుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడం వల్ల సగం మంది రైతులు నష్టపోతున్నారు. గత ఎన్నికల ప్రచార సందర్భంగా రుణమాఫీ పతనం...! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణాలు చెల్లించని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని, ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ చేస్తామని డాంబికంగా హామీలిచ్చారు. అయితే ఆచరణలో వచ్చేసరికి అది అమలు కావడం లేదు. సగం మంది రైతులకు వర్తించని వైనం జిల్లాలో పీడీసీసీ బ్యాంకు ద్వారా మొత్తం 168 సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం జిల్లాలో మొత్తం 85,265 మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి 430 కోట్ల రుణాలు మాఫీ అవుతాయి. అయితే ఆచరణ సాధ్యం కాని నిబంధనల వల్ల సగం మంది సహకార రైతులకే రుణమాఫీ వర్తిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 2014 మార్చి 31కి ముందు ఎప్పుడు రుణాలు తీసుకున్నా రుణమాఫీ వర్తిస్తే సుమారు రైతులందరికీ లబ్ధి చేకూరుతుంది. అయితే ప్రభుత్వం సాధ్యమైనంత మేర లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి రుణమాఫీ మొత్తాన్ని కుదించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల వల్ల జిల్లాలో 40 వేల మంది రైతులు రుణమాఫీని కోల్పోవలసి వస్తోంది. సుమారు *221.79 కోట్ల రుణాల మాఫీకి ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులు ఏడాది లోపు ఆ రుణాన్ని చెల్లిస్తే వాటిపై వడ్డీ చెల్లించే అవసరం ఉండదు. 24 నెలలు దాటితే రైతు డీఫాల్టర్‌గా మిగులుతాడు. దీంతో సొసైటీలో పంపిణీ చేసిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మిగలకుండా ఉండేందుకు, పరపతి స్థాయిని పెంచేందుకు ఏడాదిలోపే రుణాలను తిరగరాసి మళ్లీ రుణాలిచ్చే పరిస్థితి ఉంది. దీనిని రాష్ట్రస్థాయిలో ఆప్కాబ్ కూడా ప్రోత్సహిస్తోంది. క్షేత్రస్థాయిలో సొసైటీ సిబ్బంది కూడా రైతులకు వడ్డీ మాఫీ గురించి వివరిస్తూ రుణాలను తిరగరాస్తుంటారు. అయితే ప్రస్తుతం సొసైటీలో ఈ రుణాలను తిరగరాసినందు వల్లే 40 వేల మంది రైతులు రుణమాఫీని కోల్పోవలసి వస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా మార్గదర్శకాలను సవరించాలని రైతులు కోరుతున్నారు.