ఏప్రిల్ 24న ఇంటర్ ఫలితాలు!
ఈ నెల 8 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ∙ఐదు దశల్లో నిర్వహణకు బోర్డు చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్‌ను ఈ నెల 8 నుంచి ప్రారంభించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ఐదు దశల్లో జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనుంది. వచ్చే నెల 24న ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 8న సంస్కృతం పేపర్–1, పేపర్–2 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభిస్తామని బోర్డు పేర్కొంది. అలాగే రెండు దశల మూల్యాంకనాన్ని ఈ నెల 16న ప్రారంభిస్తామని వెల్లడించింది.
16 నుంచి ఇంగ్లిషు పేపర్–1, పేపర్–2, తెలుగు పేపర్–1, 2, హిందీ పేపర్–1, 2, మ్యాథ్స్ పేపర్ 1 (ఏ), 1 (బీ), పేపర్–2 (ఏ), 2(బీ), సివిక్స్ పేపర్–1, 2 జవాబు పత్రాల మూల్యాంకనం చేపడతామని వివరించింది. 21వ తేదీ నుంచి మూడో దశలో ఫిజిక్స్ పేపర్–1 ,2, ఎకనామిక్స్ పేపర్–1, 2 జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నట్లు బోర్డు తెలిపింది. 24 నుంచి నాలుగో దశలో కెమిస్ట్రీ పేపర్–1, 2, హిస్టరీ పేపర్–1, 2 మూల్యాంకనం చేపట్టనుంది. ఐదో దశ మూల్యాంకనాన్ని 27 నుంచి మొదలుపెట్టి కామర్స్ పేపర్–1, 2, బోటనీ పేపర్–1, 2, జువాలజీ పేపర్–1, 2 జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనుంది.