‘హమ్ హై దేశ్ కే రక్షక్’ గీత రచయిత?
జీకే - కరెంట్ అఫైర్స్
1. సెప్టెంబర్ 9వ తేదీని హిమాలయ దివస్‌గా ఏ రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది?
ఎ) జమ్మూ కాశ్మీర్ బి) ఉత్తర ప్రదేశ్
సి) అరుణాచల్ ప్రదేశ్ డి) ఉత్తరాఖండ్
2. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను ఎవరు సాధించారు?
ఎ) కరోలిన్ వోజ్నియాకి బి) లీనా
సి) మరియా షరపోవా
డి) సెరెనా విలియమ్స్
3. భారత సంతతి రచయిత నీల్ ముఖర్జీ రచించిన ఏ పుస్తకం మ్యాన్ బుకర్ బహుమతి-2014కి సంబంధించి తుది జాబితాకు ఎంపికైంది?
ఎ) ది నేరో రోడ్ టు ద డీప్ నార్త
బి) ఎ లైఫ్ అపార్ట
సి) ద లైవ్స ఆఫ్ అదర్స
డి) టు లైవ్స
4. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన భారత తొలి అథ్లెట్ ఎవరు?
ఎ) సుశీల్ కుమార్ బి) యోగేశ్వర్ దత్
సి) అభినవ్ బింద్రా డి) జీతురాయ్
5. 2014 యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు సాధించారు?
ఎ) రోజర్ ఫెదరర్ బి) కీ నిషికోరి
సి) మారిన్ సిలిక్ డి) నొవాక్ జకోవిచ్
6. 2014 సెప్టెంబర్ 5న భారతదేశంతోపాటు పౌర అణు ఒప్పందంపై సంతకం చేసిన దేశం?
ఎ) జపాన్ బి) ఆస్ట్రేలియా
సి) బ్రెజిల్ డి) దక్షిణాఫ్రికా
7. 86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైన ‘ది గ్రేట్ బ్యూటీ’ ఏ దేశానికి చెందింది?
ఎ) ఫ్రాన్స బి) జర్మనీ
సి) ఇటలీ డి) స్పెయిన్
8. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?
ఎ) ఇమ్రాన్ ఖాన్ బి) షేక్ హసీనా
సి) ఖలీదా జియా డి) ఆంగ్‌సాన్ సూకీ
9. టూట్సీలు, హుటూలు ఏ దేశంలో రెండు ప్రధాన తెగలు?
ఎ) రువాండా బి) కెన్యా
సి) సోమాలియా డి) ఇథియోపియా
10. 2014 మార్చిలో వికలాంగుల కోసం నిర్వ హించిన వింటర్ పారాలింపిక్స్‌లో ఏ దేశం అత్యధిక పతకాలు సాధించింది?
ఎ) ఉక్రెయిన్ బి) జర్మనీ
సి) కెనడా డి) రష్యా
11. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లు -2014, రాజ్యసభలో ఆమోదం పొందిన తేది?
ఎ) ఫిబ్రవరి 18 బి) ఫిబ్రవరి 19
సి) ఫిబ్రవరి 20 డి) ఫిబ్రవరి 21
12. ఇటీవల మరణించిన బంగారు లక్ష్మణ్ ఏ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు?
ఎ) జనతాదళ్ (యునెటైడ్)
బి) జనతాదళ్ (సెక్యులర్)
సి) సమాజ్‌వాదీ పార్టీ
డి) భారతీయ జనతా పార్టీ
13. దుబాయ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్‌ను ఏ దేశం గెలుచుకుంది?
ఎ) దక్షిణాఫ్రికా బి) పాకిస్తాన్
సి) ఆస్ట్రేలియా డి) భారత్
14. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను ఏ రంగంలో ఇస్తారు?
ఎ) సాహిత్యం బి) సంగీతం
సి) శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు
డి) చలనచిత్రాలు
15. 2014 ఫిబ్రవరిలో బయో ఏషియా అంత ర్జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది?
ఎ) బెంగళూరు బి) చెన్నై
సి) కోల్‌కతా డి) హైదరాబాద్
16. భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స బ్యాంక్ ఏటీఎంను 2014 ఫిబ్రవరి 27న ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ) హైదరాబాద్ బి) ఢిల్లీ
సి) చెన్నై డి) ముంబై
17. ఫార్చూన్ మ్యాగజీన్ రూపొందించిన ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీ?
ఎ) టాటా స్టీల్ బి) ఓఎన్జీసీ సి) ఐఓసీ డి) ఎ, బి
18. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?
ఎ) ఏప్రిల్ 1, 2014 బి) జూన్ 1, 2014
సి) జూలై 1, 2014 డి) పైవేవీ కాదు
19. ఏ అధికరణను ఉపయోగించి రాష్ర్టపతి పాలనను విధిస్తారు?
ఎ) ఆర్టికల్ 352 బి) ఆర్టికల్ 354
సి) ఆర్టికల్ 356 డి) ఆర్టికల్ 358
20. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చైర్పర్సన్, మేనే జింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?
ఎ) ఉషా థొరాట్ బి) నిషీ వాసుదేవ
సి) శ్యామలా గోపీనాథ్
డి) పైవారెవరూ కాదు
21. అణుధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) జేమ్స్ చాడ్విక్ బి) జె.జె. థామ్సన్
సి) హెన్రీ బెక్వెరెల్ డి) రూథర్ ఫర్డ
22. బోడోలాండ్ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించింది?
ఎ) జీకే పిళ్లై బి) ఆర్కే సింగ్
సి) అనిల్ గోస్వామి డి) శశికాంత్ శర్మ
23. కేంద్ర పారా మిలటరీ బలగాల (సీఆర్పీ ఎఫ్) సేవలను కొనియాడుతూ రాసిన ‘హమ్‌హై దేశ్ కే రక్షక్’ గీత రచయిత?
ఎ) గుల్జార్ బి) జావేద్ అక్తర్
సి) ప్రసూన్ జోషి డి) గోవింద్ మిశ్రా
24. 2014 ఫిబ్రవరిలో లండన్‌లో విడుదలైన నివేదిక ప్రకారం భారతదేశ అత్యంత విలువైన బ్రాండ్?
ఎ) టాటా గ్రూప్ బి) ఎస్బీఐ
సి) ఎయిర్టెల్ డి) రిలయన్స ఇండస్ట్రీస్
25. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మాజీ డెరైక్టర్ జనరల్ రాజీవ్ ప్రస్తుతం ఏ పదవిలో కొనసాగుతున్నారు?
ఎ) సీబీఐ డెరైక్టర్
బి) చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషర్
సి) విజిలెన్స కమిషనర్
డి) ఏదీకాదు
26. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఏ సంవ త్సరంలో జరిగింది?
ఎ) 1911 బి) 1913
సి) 1921 డి) 1919
27. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, బెంగళూరు గవర్నర్ల బోర్డ చైర్ పర్సన్‌గా నియమితురాలైన తొలి మహిళ?
ఎ) నీతా అంబానీ బి) ఇంద్ర నూయీ
సి) చందా కొచ్చార్
డి) కిరణ్ మంజుదార్ షా
28. {పముఖ హిందీ రచయిత అమర్‌కాంత్ ఇటీవల మరణించారు. ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?
ఎ) 2009 బి) 2007
సి) 2001 డి) 2004
29. ఇటీవల మరణించిన సిల్వరిన్ స్వేర్ ఏ రాష్ర్టం నుంచి పద్మశ్రీ అవార్డును పొందిన తొలి మహిళ?
ఎ) అసోం బి) మేఘాలయ
సి) నాగాలాండ్ డి) మణిపూర్
30. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పురస్కారం- 2013 ఎవరికి లభించింది?
ఎ) వీకే సారస్వత్
బి) అవినాష్ చందర్
సి) జయంత్ విష్ణు నార్లికర్
డి) కె. రాధాకృష్ణన్
31. ఏడో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్ ఎవరు?
ఎ) గౌతమ్ గంభీర్ బి) దినేష్ కార్తీక్
సి) వీరేంద్ర సెహ్వాగ్
డి) యువరాజ్ సింగ్
32. ఇండోర్ పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన రేనాడ్ లావ్లెనీ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు?
ఎ) ఉక్రెయిన్ బి) రష్యా
సి) ఫ్రాన్స డి) స్పెయిన్
33. మీటింగ్స విత్ రిమార్కబుల్ ఉమెన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఎ) ఎ.జి. నూరాని బి) కరణ్ సింగ్
సి) నీనా వ్యాస్ డి) నట్వర్ సింగ్
34. వైశాల్యంలో అతి చిన్న దేశం?
ఎ) తువాలు బి) నౌరు
సి) మొనాకో డి) వాటికన్‌సిటీ
35. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం?
ఎ) 2010-15 బి) 2011-16
సి) 2012-17 డి) 2013-18
36. 2014 మార్చిలో బిమ్స్టెక్ దేశాల సమా వేశం ఏ దేశంలో జరిగింది?
ఎ) భారత్ బి) థాయిలాండ్
సి) మయన్మార్ డి) శ్రీలంక
37. 69వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ చాంపి యన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు?
ఎ) మిజోరాం బి) రైల్వేస్
సి) కేరళ డి) సర్వీసెస్
38. 2014 టెంపుల్టన్ ప్రైజ్ విజేత థామస్ హాలిక్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
ఎ) చెక్ రిపబ్లిక్ బి) కెనడా
సి) యూకే డి) దక్షిణాఫ్రికా
39. జకార్తా ఏ దేశానికి రాజధాని?
ఎ) ఫిలిప్పైన్‌స బి) ఇండోనేషియా సి) మలేషియా డి) థాయిలాండ్
40. ఏ బ్యాంకును గతంలో ఇంపీరియల్ బ్యాం క్ అని పిలిచేవారు?
ఎ) ఆర్బీఐ బి) ఎస్బీహెచ్
సి) ఎస్బీఐ డి) బ్యాంక్ ఆఫ్ ఇండియా
సమాధానాలు
1) డి; 2) డి; 3) సి; 4) డి; 5) సి;
6) బి; 7) సి; 8) డి; 9) ఎ; 10) డి;
11) సి; 12) డి; 13) ఎ; 14) సి; 15) డి;
16) సి; 17) డి; 18) ఎ; 19) సి; 20) బి;
21) సి; 22) ఎ; 23) బి; 24) ఎ; 25) సి;
26) డి; 27) డి; 28) ఎ; 29) బి; 30) సి;
31) డి; 32) సి; 33) బి; 34) డి; 35) సి;
36) సి; 37) ఎ; 38) ఎ; 39) బి; 40) సి.
బ్రిక్స్ ఆరో సమావేశం
బ్రెజిల్‌లోని ఫోర్తలేజా నగరంలో 2014 జూలై 14, 15 తేదీల్లో ఆరో బ్రిక్స్ సదస్సును నిర్వహించారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రోసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా హాజరయ్యారు. వీరితోపాటు అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చనర్ కూడా పాల్గొన్నారు.
ఈ సదస్సులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)ను చైనాలోని షాంగైలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికయ్యే 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఐదు దేశాలు సమానంగా భరిస్తాయి. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధులకు ప్రత్యామ్నాయంగా ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
మౌలిక వసతులను అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ బ్యాంకు మొదటి అధ్యక్షుడిని భారత్ నుంచి నియమిస్తారు. గవర్నర్ల బోర్డు తొలి చైర్మన్‌గా రష్యా దేశస్థుడిని నియమిస్తారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గలో ఆఫ్రికన్ రీజినల్ సెంటర్‌ను నెలకొల్పుతారు. మరో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రిజర్వ కరెన్సీ పూల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.
బ్రిక్స్ గురించి సంక్షిప్తంగా..
ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ బ్రిక్ (ఆఖఐఇ) అనే పదాన్ని 2001లో ప్రవేశ పెట్టాడు. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీకి చెందిన ఆయన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలను కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలుగా అభివర్ణించాడు. 2050 సంవత్సరానికి ఈ నాలుగు దేశాలు అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందుతాయని అయన పేర్కొన్నారు. ఈ నాలుగు దేశాలు జనాభాలో అతిపెద్ద దేశాలు.
బ్రిక్ మొదటి సదస్సు 2009 జూన్‌లో రష్యాలోని ఎకాతెరిన్బర్గలో జరిగింది. 2010 డిసెంబర్లో ఈ కూటమిలో ఐదో సభ్య దేశంగా దక్షిణాఫ్రికా చేరింది. అప్పటి నుంచి ఈ కూటమిని బ్రిక్స్ (ఆఖఐఇ)గా వ్యవహరి స్తున్నారు. 2011 బ్రిక్స్ సమావేశంలో మొదటి సారి పూర్తి సభ్యదేశంగా దక్షిణాఫ్రికా పాల్గొంది.