భారత మోడల్‌ను పెళ్లాడనున్న టెయిట్
లండన్: ఐపీఎల్ పార్టీ ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ షాన్ టెయిట్, భారత మోడల్ మషూమ్ సింఘాలను ఒక్కటి చేసింది. త్వరలో వీరి వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.
ముంబైకి చెందిన 29 ఏళ్ల మషూమ్ స్విమ్‌సూట్ మోడల్. 2005 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం ఆస్ట్రేలియాలో జరిగిన ఫొటో షూటింగ్లో పాల్గొన్నది. అయితే వీరిద్దరి మధ్య తొలి పరిచయం మాత్రం 2010లో ఓ ఐపీఎల్ పార్టీలో జరిగింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి... ఇప్పుడు పెళ్లిదాకా వచ్చింది.