ఛత్తీస్‌గఢ్ కరెంటు ఇక లేనట్లే!
కొత్త లైను ప్రతిపాదన విరమించుకున్న తెలంగాణ ప్రభుత్వం
రూ. 3 వేల కోట్లు వ్యయమవుతుందన్న అంచనా
భారీ ఖర్చు అనవసరమని భావిస్తున్న సర్కారు
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి స్పందనా కరువు
బిడ్డింగ్ లేకుండా ఏపీఈఆర్సీ అనుమతి కూడా కష్టమే
వార్ధా-మహేశ్వరం పవర్‌గ్రిడ్ లైన్పైనే ఆశలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో విద్యు త్ సమస్యను అధిగమించేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటును తెచ్చుకోవాలన్న ప్రతిపాదనకు బ్రేకులు పడ్డాయి. విద్యుత్ సరఫరా కోసం ఇరు రాష్ట్రాల మధ్య కొత్త లైన్ వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఇందుక య్యే భారీ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకునే తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త లైను ఏర్పాటుకు ఏకంగా రూ. 3 వేల కోట్లు అవసరమవుతాయని ట్రాన్స్‌కో అధికారులు అంచనా వేశారు. దీంతో రాష్ర్ట ప్రభుత్వం వెనకడుగువేసింది. రాష్ర్ట అవసరాల కో సం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రత్యేకంగా 765 కేవీ సామర్థ్యం కలిగిన లైను ఏర్పాటుపై తెలంగాణ ట్రాన్స్‌కో అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు రెండు రాష్ట్రాల్లోనూ సబ్స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. అలాగే 850 కిలోమీటర్ల దూరం లైను వేయాల్సి ఉంటుంది. ఇందులో ఏకంగా 700 కిలోమీటర్ల లైను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పరిధిలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాదాపు రూ. 3 వేల కోట్ల వ్యయమవుతుందని ట్రాన్స్‌కో తన తాజా నివేదికలో ప్రభుత్వానికి వివరించిం ది. దీంతో ఇంత భారీ మొత్తం వెచ్చించి కొత్త లైను వేయడం అనవసరమని ప్రభుత్వం భావిం చినట్లు ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి బదులుగా ఇప్పటికే మహారాష్ట్రలోని వార్ధా నుంచి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం వరకు నిర్మిస్తున్న 765 కేవీ పవర్ గ్రిడ్ లైను పనులు వేగంగా సాగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన ట్లు వివరించాయి. ఈ లైను 2018 నాటికి పూర్తవుతుందని సమాచారం. దీనివల్ల ఏకంగా 4,500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంటుంది.
అయితే, ఈ లైను ద్వారా విద్యుత్ సరఫరా పొందాలంటే బిడ్డింగ్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వం దక్కించుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. తెలంగాణకు రెండువేల మెగావాట్లు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని ఆ రాష్ర్టం లేఖ రాసింది. ఇందుకు అనుగుణంగా విద్యుత్ కొనుగోలుతో పాటు కొత్తలైను ఏర్పాటుపైనా రాష్ట్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు ఛత్తీస్‌గఢ్ వెళ్లి అధ్యయనం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ర్ట విద్యుత్ పంపిణీ సంస్థతో ముసాయిదా ఒప్పందం కూడా కుదుర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఇప్పటివరకు అటునుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ డిస్కం నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని తెలంగాణ డిస్కంలు ఇప్పటికే కోరాయి. అయితే, కేవలం బిడ్డింగ్ ద్వా రానే విద్యుత్‌ను కొనుగోలు చేయాలని, ఎంవో యూ ద్వారా అయితే అనుమతి ఇవ్వలేమని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణకు ప్రత్యేకంగా ఈఆర్సీ ఏర్పాటు చేసుకున్న తర్వా తే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంమీద ఛత్తీస్‌గఢ్ కరెం టు విషయంలో ‘అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి’ అన్నట్లుగా నడుస్తోంది.