నారసింహునికి చందన సిరి
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల చినవెంకన్న ఉపాలయం ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై లక్షీ్మనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం చందనోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉగ్ర నారసింహుడు చందనలేపనంతో సేదతీరారు. కల్యాణోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిత్యహోమాలు, మూలమంత్ర హవనాలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌కు చందన మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛారణ నడుమ వైభవంగా నిర్వహించారు. ఉగ్రరూపంలో ఉండే లక్షీ్మనరసింహుని శాంతింపచేసే క్రమంలో జరిగిన ఉత్సవం నేత్రపర్వమైంది. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, రాత్రి ధ్వజఅవరోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.