పాక్‌లో నర్గీస్ ఫక్రీ యాడ్‌పై విమర్శలు
ఇస్లమాబాద్: పాకిస్థాన్ ప్రముఖ ఉర్దూ వార్తా పత్రిక 'జంగ్' ప్రచురించిన ఓ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు తావిచ్చింది. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఫోటోతో ప్రధాన పేజీలో ఆదివారం ప్రచురితమైన ఫోన్ యాడ్‌పై ఆన్లైన్ విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. జంగ్ ప్రచురించిన నర్గీస్ ఫోటో అసభ్యంగా ఉందని, ఇలాంటి ఛీప్ యాడ్ వార్తా పత్రికలో కాకుండా మేగజైన్లో అయితే బాగుంటుందని పలువురు విమర్శలు గుప్పించారు.
రెడ్ డ్రెస్‌లో సెక్సీగా కన్పిస్తూ చేతిలో ఫోన్‌ను పట్టుకొని పడుకొని ఉన్న నర్గీస్ యాడ్‌ను జంగ్ పత్రిక ఫ్రంట్ పేజీలో ప్రచురించడంపై తొలుత పాకిస్తాన్ ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్ అన్సార్ అబ్బాసీ ఖండించాడు. తరువాత అతనికి జతగా పలువురు నెటీజియన్లు గొంతుకలిపారు. ఇప్పుడు నర్గీస్ ఫక్రీ ఫోటో ప్రచురించారు తరువాత సన్నీ లియోనిని ప్రచురిస్తారేమోనంటూ ఒకరు, చౌక త్రీజీ ఫోన్‌కు ఆమె అందాలకు ఎలాంటి సంబంధం లేదని మరొకరు, జంగ్ పత్రిక యాడ్‌ను ప్రచురించిన తీరు ప్లే బాయ్ మేగజైన్ ముఖచిత్రం కంటే దారుణంగా ఉందరి ఇంకొకరు ట్వీట్ల వర్షం కురిపించారు.
My strong protest to top jang group management for this absurd front page ad in today's jang. pic.twitter.com/M5SRc1p3H7
— Ansar Abbasi (@AnsarAAbbasi) December 20, 2015