సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను కూటమి సర్కార్.. అరాచకప్రదేశ్‌గా మార్చేసింది. వైస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్‌గా అడ్డూ, అదుపు లేకుండా అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్రమ కేసుల పర్వం వంద దాటగా, ఏడేళ్ల క్రితం పోస్టు పెట్టావంటూ ఇప్పుడు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అరెస్టుల పరంపర కొనసాగుతోంది.
బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఆదేశాలతో అత్యవసరంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసింది. అడ్వొకేట్ల బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులకు వైఎస్సార్‌సీపీ రంగం సిద్ధం చేసింది.
కాగా, వైఎస్సార్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా పోలీసులు తెలుపలేదు. ఉదయం రవీంద్రారెడ్డి భార్య కల్యాణి, సోదరుడు మల్లికార్జున రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని తొలుత వేముల పోలీస్ స్టేషన్‌కి తరలించగా, అనంతరం చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఎస్పీ మాట్లాడాలి.. తీసుకురమ్మని చెప్తే తెచ్చామంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే, ఉదయం నుంచి ఎస్పీ వద్దకు కూడా వారిని తీసుకెళ్లలేదు.
Comments
Please login to add a commentAdd a comment