'షో' ముందు భార్యకు 10వేల రోజాలు పంపాడు!
లాస్ఏంజిల్స్: అర్ధాంగి మీద ప్రేమ అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు ర్యాపర్ జే జెడ్. ప్రాణప్రదమైన తన భార్య బియాన్సే 'సూపర్ బోల్-50'లో ప్రదర్శన ఇస్తున్న సందర్భంగా ఊహించని ఆశ్చర్యంలో ఆమెను ముంచేత్తాడు. షోకు ముందు ఏకంగా తన భార్యకు పదివేల గులాబీపూలు కానుకగా పంపాడు. సాంట్ కార్లాలో లెవిస్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన 'సూపర్ బోల్ -50'లో పాప్ స్టార్ బియాన్సే తన ప్రదర్శనతో దుమ్మురేపింది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు ముందు తన భార్యపై ప్రేమను చాటుతూ ఆమెకు పదివేల గులాబీలతో జే జెడ్ శుభాభినందనలు తెలిపాడు.
మరోవైపు 'సూపర్ బోల్' మ్యూజిక్ షోలో ఆద్యంతం తన సంగీత, నృత్య విన్యాసాలతో అదరగొట్టిన పాప్ సింగర్ బియాన్సే ఆకట్టుకుంది. బ్లాక్ పాంథర్స్ పార్టీకి మద్దతుగా ఆమె ఈ షోలో ఓ ప్రదర్శన ఇవ్వడం సంచలనం సృష్టించింది.