భార్యపై వేడినీళ్లు గుమ్మరించిన భర్త
రియాద్: కట్టుకున్న భార్యతో గొడవ పడి ఆమెపై వేడినీళ్లు పోశాడు ఓ భర్త. సౌదా అరేబియాలోని జాజన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాదవ ద్రవ్యాలకు బానిసైన భర్త నుంచి విడిపోవాలని కోరుకోవడంతో అతడి దారుణానికి పాల్పడ్డాడని స్థానిక మీడియా తెలిపింది.
చాలా కాలంగా భర్త వేధింపులను మౌనంగా భరించిన బాధితురాలు గతవారం విడాకులు కావాలని అడిగింది. దీంతో రెచ్చిపోయిన అతడు వేడినీళ్లు ఆమెపై గుమ్మరించాడు. గాయాలపాలైన బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.