ప్రవాసభారతీయుడి క్రికెటోత్సాహం!
అమెరికాలో 8 స్టేడియాల నిర్మాణం
వాషింగ్టన్: క్రికెట్ అంటే అమితాసక్తిగల ఓ ఇండో అమెరికన్ ఏకంగా 8 స్టేడియాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. గుజరాత్లో పుట్టిన జిగ్నేశ్ పాండ్యా అమెరికాలో స్థిరాస్థి వ్యాపారి. కోట్లు గడించిన ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. దీంతో అమెరికాలో క్రికెట్ క్రీడాభివృద్ధి కోసం భారీస్థాయిలో ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యారు.
రూ.15,600 కోట్లు (2.4 బిలియన్ డాలర్లు) వ్యయంతో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, జార్జియా, ఫ్లోరిడా, టెక్సాస్, ఇలినాయిస్, కాలిఫోర్నియాలలో క్రికెట్ స్టేడియాలు నిర్మించనున్నారు.