సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం
* ఖేల్‌రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్యం గెలిచారు.
ఇక దీప జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్‌లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్‌కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు.
తెలుగు వెలుగులు
ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది.
అవార్డు గ్రహీతలు
రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు):
పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్).
ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు):
నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్‌శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్‌లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్).
అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు):
రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్‌ప్రీత్‌సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్).
ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు):
సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్).
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్:
యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్;
క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ.
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ
వీల్‌చెయిర్‌లో...
రియో ఒలింపిక్స్‌లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది.