పూలే జీవితం ఆదర్శప్రాయం
ఘనంగా జ్యోతీరావుపూలే జయంతి ఉత్సవాలు
పరకాల: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహాత్మ జ్యోతీరావు పూలే జీవితం ఆదర్శప్రాయమని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి అన్నారు. జ్యోతిరావు పూలే 109వ జయంతిని పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. జ్యోతీబాపూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ సంఘాల ఐక్యత కోసం నిర్విరామంగా కృషి చేశారన్నారు. సామాజిక సంస్కరణలు చేపట్టడమే కాకుండా మహిళ విద్యాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షులు కామిడి సతీష్‌రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్, సతీష్, రాజు, రమేష్, సదయ్య, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.
డీబీఏఎస్‌ఎస్ ఆధ్వర్యంలో..
దళిత బహుజన అభివృద్ధి సాధన సమితి(డీబీఏఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మడికొండ రఘుపతి, బొమ్మకంటి సదానందం, ప్రభాకర్, వెంకటలక్ష్మీ, ఎలిషా, జన్ను జయ, మేదరి శ్రీకాంత్, డి. నరహరి పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండలకేంద్రంలో బీసీజేఏసీ నాయకుడు మిర్యాల రవికుమార్ ఆధ్వర్యంలో ఫూలేచిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్శ రవిందర్, రణధీర్, నాగరాజు, చరణ్, నితీష్, కిరణ్, సాయికిరణ్, నితిన్, వివేక్, వంశీ, కార్తికేయ, భరత్, ఓంకార్, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు. అలాగే ఊరుగొండలో అంబేద్కర్ యువజనసంఘం ప్రధానకార్యదర్శి సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో శ్రీను, శ్రీకాంత్, రమేష్, రమేష్, సుమన్, ప్రశాంత్, దయాకర్, వినయ్, విజయ్, వినీత్ పాల్గొన్నారు.
పూలే ఆశయసాధనకు కృషి చేయాలి
సంగెం : మండల కేంద్రంలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మునుకుంట్ల కోటేశ్వర్ మాట్లాడారు. కందకట్ల నరహరి, కోడూరి సదయ్య, మునుకుంట్ల మోహన్, ఆగపాటి రాజ్‌కుమార్, నల్లతీగల రవి, పులి సాంబయ్య, బాబు, లవ్‌కుమార్, రాజు, ప్రకాశ్, వెంకన్న, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
గొర్రెకుంటలో చలివేంద్రం ప్రారంభం
ధర్మారం : మహాత్మా జ్యోతీరావుపూలే జీవితం ఆదర్శనీయమని జీడబ్ల్యూఎంసీ 2వ డివిజన్ కార్పొరేటర్ ల్యాదల్ల బాలు అన్నారు. 2వ డివిజన్లోని గొర్రెకుంటలో జ్యోతీరావుపూలే జయంతిని సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేం ద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ నిర్వాహకులను అభినందిం చారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చిలువేరు రవి, అనిల్, ఉద్యోగ సంఘం కన్వీనర్ కార్తీక్, టీఆర్ఎస్ నాయకులు లవ్రాజు, నర్సయ్య, కరుణాకర్, చిన్ని, మాజీ ఎంపీటీసీ రవి పాల్గొన్నారు.