వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని హైదరాబాద్‌లో మంగళవారం ప్రకటించారు. అధ్యక్షులుగా కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్ళిగా కె. ఓబుళపతి కొనసాగనున్నారు. తాజాగా ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ఏడుగురు కార్యదర్శులతో కొత్త కార్యవర్గం ఏర్పాటయింది. సమాఖ్య గౌరవాధ్యక్షులుగా ఎం. రియాజ్ హుస్సేన్(కృష్ణా జిల్లా), అసోసియేట్ అధ్యక్షులుగా వి.శేఖర్‌రెడ్డి(చిత్తూరు), కోశాధికారిగా కె.సింహాద్రి(విశాఖ) నియమితులయ్యారు.
అలాగే ఉపాధ్యక్షులుగా పి.ఫ్రాన్సిస్ కిశోర్(గుంటూరు), బి.మోహన్(నెల్లూరు), జి.మహేశ్(కర్నూలు), కె.శ్రీనివాసులు, హెచ్.గిరిధర్ రెడ్డి(అనంతపురం), ఎన్ .శివశంకరరెడ్డి(కడప), బి.భువనేశ్వర్(కృష్ణా), కె.వెంకటరెడ్డి(ప్రకాశం)లను నియమించారు. కార్యదర్శులుగా బి.రఘురామిరెడ్డి(నెల్లూరు), డి.పూర్ణచంద్రరావు(కృష్ణా), పి.రెడ్డప్పరెడ్డి(కడప), కె.గోవిందరెడ్డి, కె.పుల్లయ్య(అనంతపురం), ఆర్.నరసింహులు(కర్నూలు), కె.ఆదిలక్ష్మి(ప్రకాశం) వ్యవహరించనున్నారు. ఆడిట్ కమిటీ సభ్యులుగా హెచ్.గంగాధర(అనంతపురం), అకడమిక్ సెల్ సభ్యులుగా పి.చెన్నారెడ్డి(అనంతపుర ం), బి.రెబెకా దేవదాస్(కడప)నియమితులయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఓబుళపతి విలేకర్లతో మాట్లాడుతూ.. పిల్లల హక్కులు కాపాడటంతోపాటు టీచర్ల పక్షాన నిలిచి సమస్యలు, హక్కుల రక్షణ సాధన లో దీక్షగా ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు.