Karimnagar meeting
-
కరీంనగర్లో సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తనను ఎన్నో అవమానాలకు గురిచేశారంటూ కరీంనగర్లో సభలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘నాకు గెలుపు ముఖ్యం కాదు.. గెలుపు కోసం పనిచేస్తా. నాకు ప్రజలే ముఖ్యం.. పదవులు కాదు. నాకు డిపాజిట్ రాదని హేళన చేశారు. కరీంనగర్ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచా’’ అని అన్నారు. కరీంనగర్ గడ్డపై గాండ్రిస్తే కొందరికి వణుకు పుట్టాలని, కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తా. బీజేపీ అధినాయకత్వం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం కార్యకర్తలే. కరీంనగర్లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోదీ, అమిత్‌షా, నడ్డా చెప్పారు. తెలంగాణ కాషాయ జెండా రెపరెపలాడాలని చెప్పారు. ధర్మ కోసం యుద్ధం చేస్తా. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఏం చేశారో కేసీఆర్ చెప్పడం లేదు. మోదీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. చదవండి: కేసీఆర్ సెంటిమెంట్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. సంజయ్ సక్సెస్ అయ్యేనా? -
కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 17న కరీంనగర్ సభలో ఆయన హిందువు లపై అమర్యాదకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు పంపింది. ‘‘ఈ హిందూ గాళ్లు.. బొందు గాళ్లూ.. దిక్కుమాలిన.. దరి ద్రపు గాళ్లు..’’అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని, అలాగే ‘‘దేశంలో అగ్గి పెట్టాలే. గత్తర లేవాలె’అంటూ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రాంరాజు చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై శుక్రవారం సాయంత్రం 5లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్ ప్రసంగాన్ని ఆంగ్లంలో తెప్పించుకోవడంతోపాటు రాష్ట్ర సీఈవో ద్వారా వాస్తవ నివేదిక తెప్పించుకొని పరిశీలించినట్లు సీఈసీ నోటీసులో పేర్కొంది. ‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చింది. మీరు చేసిన ప్రకటన.. మత సామరస్యానికి విఘా తం కలిగించేలా ఉంది. మతపర విభేదాలను పెంచేదిగా ఉంది. తద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరు ఉల్లంఘించారు. దీనిపై సంజాయిషీ ఇచ్చేం దుకు కమిషన్ మీకు ఒక అవకాశం కల్పిస్తోంది. 12వ తేదీ సాయంత్రం 5లోగా మీరు వివరణ ఇవ్వండి. ఇందులో మీరు విఫలమైతే తదుపరి ఎలాంటి నోటీసు లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. చింతమడకలో కేసీఆర్ ఓటు సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన సొంత ఊరు చింతమడకలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్ గురువారం హెలికాప్టర్లో చింతమడకకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని హెలికాప్టర్లోనే తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. హెలికాప్టర్ దిగేందుకు వీలుగా చింతమడకలో ఏర్పాట్లు చేశారు. -
కరీంనగర్ నుంచే శంఖారావం!
కేసీఆర్ సెంటిమెంట్ మేరకు తొలి సభ ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ సంసిద్ధం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వచ్చే వారాంతంలో అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ని కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ ఒక అడుగు ముందున్న విషయం తెలిసిందే. అలాగే ప్రచారాన్ని కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా మిగతా స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 11న స్థానిక సంస్థల రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే కరీంనగర్ సభతో ప్రచారం మొదలుపెట్టాలని టీఆర్ఎస్ ముఖ్య నేతలు యోచిస్తున్నారు. ఆ తర్వాత రోజుకు మూడు నుంచి ఐదు చోట్ల కేసీఆర్ ప్రసంగించేలా పర్యటన షెడ్యూల్ ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా కేసీఆర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కాగా ఇతర ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ అధినేత ప్రసంగాలను వినిపించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. తెరలను ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రసంగాలున్న త్రీడీ వీడియోలను ప్రదర్శించనున్నారు. నగర శివారులోని పార్టీ నాయకుడి ఫాంహౌజ్‌లో ఈ ప్రసంగాలను రికార్డు చేసినట్టు సమాచారం. కేసీఆర్‌ను కలసిన నారాయణమూర్తి సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి శనివారం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని, తాను రూపొందించిన ‘పోరు తెలంగాణ’ సినిమా ప్రివ్యూని చూడాలని మాత్రమే కేసీఆర్‌ని కోరినట్టు చెప్పారు. కలవలేకపోయిన జయశంకర్ సోదరుడు కాగా, టీఆర్ఎస్ అధినేతను కలిసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు వాసుదేవరాజు విఫలయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా కేసీఆర్ ఆయనకు సమయమివ్వలేదని తెలిసింది. ఉదయం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చిన వాసుదేవరాజు.. ఆ సమయంలో కేసీఆర్ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన దర్శనం కలగకపోవడంతో మళ్లీ పార్టీ కార్యాలయానికి చేరుకుని చాలా సమయం వేచి చూశారు. చివరకు కేసీఆర్ రాడనే విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.