రాష్ట్ర పారిశ్రామిక విధానం భేష్
హైదరాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హుడా
హైదరాబాద్: దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో పారిశ్రామి కంగా ఎంతో మేలు జరుగుతోందని, ప్రధానంగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందని హైద రాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హుడా పేర్కొన్నారు. హైదరా బాద్ నాలెడ్జ్ సిటీలోని సలార్పురియా సత్వా భవనంలో సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ రెండో కార్యాలయ భవనాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. భారత్– అమెరికా దేశాల మధ్య మైత్రి వీడదీయ లేనిదని ఆమె అన్నారు. ఇటీవలే భారత ప్ర«ధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల భేటీలు ఇరుదేశాల సంబంధా లను మరింత బలోపేతం చేశాయన్నారు. ఆర్థిక, ఐటీ, సైనిక, ఎరోస్పేస్, సాంస్కృ తిక, ఇతర రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన మరింతగా పెరిగిందన్నారు.
అమెరికా దేశానికి చెందిన 130 కంపెనీలు హైదరాబాద్ నగరంలో పనిచే స్తున్నాయని ఆమె చెప్పారు. సింక్రోని ఫైనాన్షియల్ ఇండి యా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైసలుద్ధీన్ మాట్లాడుతూ.. 1999లో ఇక్కడ సైబర్ టవర్స్‌లో కార్యక్రమాలను ప్రారంభిం చామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, ఐల్యాబ్స్, సైబర్గేట్వేలలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ నిధుల కింద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో 400 మంది రోగుల కోసం ఆర్థి«క సహాయాన్ని ఆస్పత్రి ప్రతినిధి హరిహరన్‌కు అందజే శారు. అలాగే మణికొండ ప్రభుత్వ పాఠశాలలోని 1,200 మంది విద్యార్థుల కోసం ప్రిన్సిపల్ నిరంజన్‌కు చెక్‌ను అందిం చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.