రాహుల్ గాంధీకి తీరిక లేదా: వెంకయ్య
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేరళలో ఓ న్యాయ విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైనా రాహల్కు కనిపించడం లేదా, అక్కడ పర్యటించేందుకు మాత్రం తీరిక లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్లే అక్కడ విషయాలు రాహుల్కు పట్టడం లేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. అదే హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి మృతిని రాజకీయం చేసేందుకు మాత్రం రాహుల్ హైదరాబాద్ రెండుసార్లు పర్యటించారంటూ... ఆయన ట్విట్ చేశారు.
మరోవైపు జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలకు వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ జయంతి సందర్భంగా ఆయనకు వెంకయ్య అభివాదం చేశారు.