With knife attack
-
కేటీపీఎస్ ఉద్యోగి హత్య
సాక్షి, పాల్వంచ: పాల్వంచలో కేటీపీఎస్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి వేళ మెడపై కత్తితో దాడి చేయడంతో రక్తమడుగులో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. కేటీపీఎస్ ఒఅండ్‌ఎం కర్మాగారంలోని ఐసీహెచ్‌పీలో పీఎగా విధులు నిర్వహిస్తున్న గుగ్గిళ్ళ వీరభద్రం(55) ఇంటర్మీడియట్ కాలనీలో క్వార్టర్ నంబర్ 60లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి షిఫ్ట్ విధులకు వెళ్లగా.. మద్యం సేవించి ఉన్నాడనే కారణంతో సెక్యూరిటీ అధికారులు అతడిని కేటీపీఎస్‌లోకి అనుమతించలేదు. దీంతో ఇంటికి వచ్చి పడుకున్నాడు. రాత్రి 3గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బాత్రూమ్కు వెళ్లిన వీరభద్రం ఒక్కసారిగా అరిచాడు. ఇంట్లో ఉన్న భార్య రమాదేవి, ఇద్దరు కొడుకులు రవితేజ, సంతోష్ వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. మెడపై కత్తితో నరికిన గాయం ఉంది. కుటుంబ సభ్యులు ఇంటి పక్కవారి సాయంతో మోటార్ సైకిల్‌పై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరభద్రం మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ మడత రమేష్, ఎస్ఐ ముత్యం రమేష్‌లు సందర్శించారు. జాగిలాలను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. తన భర్తను ఎవరో నరికి చంపారని భార్య రమాదేవి తెలిపింది. ఈ విషయమై సీఐ మడత రమేష్‌ను వివరణ కోరగా.. రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. తన చిన్న కొడుకు సంతోష్ ప్రేమ వివాహం విషయంలో గొడవలు జరిగాయని, అమ్మాయి తరుపు బంధువుపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో కేసును చేధిస్తామని అన్నారు. ఇటీవల మృతుడు వీరభద్రం మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేటీపీఎస్ అధికారులు రిజక్ట్ చేసినట్లు తెలిసింది. కాగా హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరభద్రం మృతదేహం -
వివాహేతర సంబంధమే కారణమా..?
ఏలూరు టౌన్: భార్య, అత్తపై భర్త కత్తితో దాడి చేశాడు. ఏలూరు శాంతినగర్ 13వ రోడ్డులో శనివారం సాయంత్రం అత్త, భార్యలపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. భార్య అద్దేపల్లి భవ్యశ్రీకి తీవ్ర గాయాలు కాగా అత్తకు గాయాలయ్యాయి. వీరి ఇరువురిని ఏలూరు అశోక్‌నగర్‌లోని చైత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అద్దేపల్లి భాస్కరరావు, భవ్యశ్రీలకు కొంతకాలం క్రితం వివాహమైంది. సత్రంపాడులో పద్మావతి సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అత్త ముమ్మిన హైమావతి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త గొడవపడుతూ ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న గుడివాకలంకకు చెందిన ముంగర గణేష్ అలియాస్ అభిషేక్ అనే వ్యక్తితో భార్య భవ్యశ్రీ సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేక తరుచూ గొడవలు పడుతున్నారు. భార్య భవ్యశ్రీకి అత్త హైమావతి వత్తాసు పలుకుతుందని, ఇద్దరిని అంతం చేయాలని శనివారం సాయంత్రం ఏలూరు శాంతినగర్ 13వ రోడ్డులో ఉన్న అత్త, భార్యలపై భాస్కరరావు కత్తితో దాడి చేశాడు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నిందితుడు భాస్కరరావు ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, అక్కడ నుంచి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య కనపడటం లేదని ఫిర్యాదు తన భార్య భవ్యశ్రీ, అత్త హైమావతి రెండు రోజులుగా కనిపించడం లేదని భాస్కరరావు శుక్రవారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం ఇరు వర్గాలను పోలీసులు పిలిపించి మాట్లాడారు. అయితే భవ్యశ్రీ విడాకులు కావాలని కోర్టులోనే తేల్చుకుంటామని పోలీసు అధికారుల వద్ద చెప్పి స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం సాయంత్రం భర్త భాస్కరరావు భార్య, అత్తలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. -
వివాహేతర సంబంధం.. భార్యపై భర్త దాడి
సాక్షి, పెద్దపల్లి: భార్య వేరొకరితో సంబంధం కలిగి ఉండటాన్ని సహించలేని ఓ భర్త ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కాలనీలో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య స్వరూప వేరొకరితో సంబంధం కలిగి ఉండగా కళ్ళారా చూశాడు. ఇది తట్టుకోలేక ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శ్రీనివాస్ పోలీసులకు లొంగిపోయాడు. -
ప్రాణం తీసిన ప్రతీకారం
డిష్ వైరు వివాదంలో వ్యక్తిహత్య చేజర్ల : డిష్ వైరుపై తలెత్తిన చిన్నపాటి వివాదం చినికిచినికి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని మామూడూరు ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులు సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మామూడూరు రమేష్ (23), దొంతాలి ప్రసాద్ మధ్య డిష్ వైరు విషయమై వివాదం ఉంది. రెండు నెలల క్రితం ఇద్దరు ఘర్షణ పడటంతో పోలీసులు ఇరువురిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసుకున్నారు. అయితే తన అన్నపై దాడి చేశాడని రమేష్‌పై ప్రసాద్ సోదరుడు చిన్నప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. కొద్ది రోజులుగా చిన్నప్రసాద్ కత్తి చేతపట్టి రమేష్‌ను హతమారుస్తానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో రమేష్, అతని స్నేహితుడు మల్లికార్జున్ కాలనీలో వెళ్తుండగా ముందుగా పథకం ప్రకారం పక్కా ప్రణాళికతో కాపు కాసిన చిన్నప్రసాద్ వెనుకాలే వచ్చి కత్తితో ఒక్కసారిగా విచక్షణ రహితంగా మెడపై, చేతిపై నరికాడు. అప్రమత్తమైన మల్లికార్జున్ అడ్డుకోగా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను ఆటోలో చేజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాలనీలో పోలీస్ పికెట్ ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన కాలనీ వాసుల్లో ఆందోళన నెల కొంది. సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, సీఐ ఖాజావళి, ఎస్సైలు కొండపనాయుడు, అబ్దుల్ రజాక్, సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. కాలనీలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. హత్యకు పాల్పడిన దొంతాలి చిన్న ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లకు తాళాలు వేసి గ్రామం విడిచి పరారయ్యారు. డీఎస్పీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.