ఉయ్యాల ఊగుతూ మృత్యు ఒడిలోకి
సుండుపల్లి(వైఎస్సార్జిల్లా): ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని ఊపిరాడక బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం కుంటలముంద్ర గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగార్జున్(12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో చీరతో వేసిన ఉయ్యాలలో ఊగుతుండగా.. చీర మెడకు చుట్టుకొని ఊపిరాడక మృతిచెందాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించిన లాభం లేకపోయింది.