Lalita
-
వాచీలు, చెప్పులు, గాజులకు రూ.50 వేలు ఇవ్వాలి
సాక్షి, అమరావతి: భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన నెల ఖర్చులకు గాను అడిగిన మొత్తం సర్వత్రా సంచలనంగా మారింది. వేలల్లో కాదు.. ఏకంగా లక్షల్లో ఖర్చుల కింద ఆ మహిళ అడిగిన మొత్తానికి హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. నెల ఖర్చులు రూ.6.16 లక్షలా? అంటూ కర్ణాటక హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ఒంటరి మహిళ నెలకు ఇంత మొత్తం ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. ‘ఈ స్థాయిలో ఆమె ఖర్చు చేయాలనుకుంటే భర్త సంపాదన మీద కాదు. ఆమెనే సంపాదించుకోమనండి. అప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటో. ఈ మహిళకు కుటుంబ బాధ్యతలు లేవు. అంత మొత్తం ఖర్చుల కిందే కావాలంటోంది. సింపుల్‌గా రూ.6.16 లక్షలు అడిగేసింది. భార్య ఎంత అడిగితే అంత భర్త నుంచి భరణం కింద ఇప్పించడం చట్టం ఉద్దేశం కాదు. చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయకుండా గట్టిగా సందేశం పంపాలని ఈ కోర్టు నిర్ణయించింది. భార్యతో విభేదాలు భర్తకు ఈ విధమైన పనిష్మెంట్గా మారకూడదు’ అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ అంత ఖర్చులు ఏమున్నాయని ఆ మహిళ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, ఆయన చెప్పిన వివరాలు హైకోర్టును షాక్‌కు గురి చేశాయి. భర్త విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, అందువల్ల తన క్లయింట్ అయిన మహిళ కూడా అదే స్థాయిలో జీవితాన్ని ఆస్వాదించదలచుకున్నారని ఆ న్యాయవాది చెప్పారు.‘ఇల్లు, తిండి ఖర్చుకు రూ.40 వేలు.. వాచీలు, దండలు, గాజులు, చెప్పులు ఇలాంటి కనీస అవసరాలకు రూ.50 వేలు కావాలి. వైద్యం, కాస్మోటివ్ వంటి వాటి కోసం రూ.4 – 5 లక్షలు అవుతుంది. ఇవి కాక పిల్లల ఫీజులు అవీ ఉన్నాయి. అంతేకాక బంగారం రుణం తీర్చాలి. ఇలా అన్నింటికీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది’ అని ఆ న్యాయవాది చిట్టా విప్పారు. వాస్తవ అవసరాలు ఏమిటో చెప్పకుండా ఇలా విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చులు అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయనుకుంటున్నారా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. భర్త సంపదన రూ.10 కోట్లు ఉందని, అందువల్ల తనకు రూ.5 కోట్లు కావాలని ఎవరైనా అడిగితే కోర్టులు ఇచ్చేస్తాయా? అని నిలదీసింది. అసలు వాస్తవ ఖర్చులు ఏమిటో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భర్తతో విబేధాలున్న ఓ మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6,16,300 ఖర్చుల కింద ఇప్పించేలా ఆదేశించాలంటూ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. అయితే వాస్తవ ఖర్చుల వివరాలు ఆమె సమర్పించక పోవడంతో ఆమె పిటిషన్‌ను కింది కోర్టు కొట్టేసింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
కన్నబిడ్డలనే కాల్వలోకి తోసి...
బిజినేపల్లి: కల్లు తాగొద్దని భర్త హెచ్చరించాడన్న కోపంతో ఓ తల్లి ముక్కుపచ్చలారని తన నలుగురు చిన్నారులను కాల్వలో విసిరేసింది. ఈ ఉదంతం శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. మండలంలోని లట్టుపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన లలిత మంగనూర్‌కు చెందిన శరబందను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతుళ్లు మహాలక్ష్మి (7), సాత్విక (5), మంజుల (3)తోపాటు 7 నెలల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో లలిత కొన్నాళ్లుగా మందు కల్లును తాగుతుండటంతో పలుమార్లు భర్త శరబంద మందలించాడు. దీంతో భర్త తరచూ మందలిస్తున్నాడని లలిత శనివారం బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు శరబందను స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి పిలిచారు. మధ్యాహ్నం కావడంతో పిల్లలకు ఏమైనా తినిపించుకు వస్తానని చెప్పి వెళ్లిన లలిత.. పోలీస్‌స్టేషన్ సమీపంలోని కేఎల్ఐ కాల్వలోకి చిన్నారులతో కలిసి దిగింది. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనిస్తుండగానే నలుగురు చిన్నారులను కాల్వలోకి విసిరేసింది. వెంటనే వారు బిజినేపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించి కాల్వలోకి దిగారు. పోలీసులు సైతం కాల్వ వద్దకు వచ్చి గాలించగా.. నీటి ఉధృతికి చిన్నారులు కిలోమీటరు మేర కొట్టుకుపోయారు. చివరికి ముగ్గురు కుమార్తెల మృతదేహాలు లభించగా.. బాలుడు మార్కండేయ ఆచూకీ లభించలేదు. అప్పటికే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చిన్నారులను కాల్వలో విసిరేసిన తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భర్త శరబంద సైతం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో సోదరి మృతి
సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి కన్నుమూశారు. బాలీవుడ్ దిగ్గజ హీరో గురుదత్ చెల్లెలు, నటి లలితా లాజ్మీ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆమె కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చివరగా ఆమె.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ సినిమాలో నటించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో లాజ్మీ బాధపడుతోంది. తారే జమీన్ పర్ సినిమాలో ఆర్ట్ టీచర్‌గా ఆమె నటించారు. ఆమె వేసిన పెయింటింగ్స్‌తో అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీల్లో ఎన్నో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. సినిమాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటిగానే కాకుండా రచయితగానూ పలు పుస్తకాలు రాశారు. లాజ్మీ మరణవార్త విన్న బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. It is a sad day for FHF today. Eminent artist Lalitha Lajmi passed away today. Having a family rooted in cinema, she was very supportive of our work in preserving our film heritage and attended many of our events despite her advanced age. pic.twitter.com/ZrMmgBSn3D — Film Heritage Foundation (@FHF_Official) February 13, 2023 -
నిఖత్, ప్రసాద్‌లకు కాంస్యాలు
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ (పురుషుల 52 కేజీలు), తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ 4–1తో నిఖత్‌ను ఓడించగా... లలితా ప్రసాద్ 0–5తో ఆసియా చాంపియన్ అమిత్ పంఘల్ (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 31 పతకాలు... మహిళల విభాగంలో 26 పతకాలు భారత్‌కు ఖాయమయ్యాయి. పురుషుల 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్‌తో భారత్‌కే చెందిన సచిన్ సివాచ్ తలపడతాడు. సెమీస్‌లో సచిన్ 5–0తో గౌరవ్ సోలంకిపై గెలిచాడు. పురుషుల 60 కేజీల విభాగంలో వరుసగా నాలుగు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన శివ థాపా (భారత్), మనీశ్ కౌశిక్ (భారత్) స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో శివ థాపా 5–0తో క్రిస్టియన్ జెపాన్‌స్కీ (పోలాండ్)పై, మనీశ్ 5–0తో అంకిత్ (భారత్)పై విజయం సాధించారు. పురుషుల 49 కేజీల విభాగంలోనూ ఇద్దరు భారత బాక్సర్లు దీపక్, గోవింద్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో కరోలో పాలమ్ (ఫిలిప్పీన్స్) నుంచి దీపక్‌కు వాకోవర్ లభించగా... తషీ వాంగ్డి (భూటాన్)పై గోవింద్ నెగ్గాడు. 56 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో కవిందర్ బిష్త్ 4–1తో మదన్ లాల్ (భారత్)పై, చాట్‌చాయ్ డెచా (థాయ్‌లాండ్) 5–0తో గౌరవ్ బిధురి (భారత్) పై విజయం సాధించారు. భారత్‌కే చెందిన రోహిత్ (64 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), దుర్యోధన్ సింగ్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), బ్రిజేశ్, మనీశ్ పవార్ (81 కేజీలు) ఫైనల్‌కు చేరారు. -
హత్యా?ఆత్మహత్యా?
ఇన్స్పెక్టర్ జగదీష్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతుండగా అందిన వార్త ‘ప్రముఖ యువ నటి లలితారాణి ఆకస్మిక మరణం’. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న లలితారాణి, నందకుమార్ తమ పెళ్లి వార్తను ఒక వారంలో విడుదల చేస్తామన్న లోపే ఇలా జరగడం విచారకరం అని అన్ని టీవీ చానల్స్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తూ, మధ్య మధ్యలో ఆమెది సహజ మరణమా? ఆత్మహత్య?అని మరొక ట్విస్ట్‌కు తెరలేపుతున్నాయి. అది చూసి నివ్వెరపోయాడు జగదీష్ ఎందుకంటే అతను కూడా ఆమెకు అభిమాని. ఆమె ఇప్పుడిప్పుడే ధ్రువతారగా వెలుగుతోంది, ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగానే పారితోషకం తీసుకొంటోంది అలాంటి నటీమణి మరణం పలు అనుమానాలకు దారి తీస్తోంది. జగదీష్ భృకుటి ముడిపడింది ఇందులో ఏదో మర్మం దాగివుంది అని ఆలోచిస్తూనే జీపు ఎక్కాడు.‘‘సార్! స్టేషన్ వచ్చింది’’ అని డ్రైవరు అన్నాక గాని ఈ లోకంలోకి రాలేదు. కుర్చీలో కూర్చున్నాడో లేదో టేబుల్‌పైన ఫోన్ మోగింది. ‘‘హలో ఎవరు?’’‘‘సార్! నా పేరు ప్రభాకరం. నా కూతురు సినిమా హీరోయిన్ లలితారాణి మరణించింది... మీరు వెంటనే రావాలి’’జగదీష్ తన అసిస్టెంట్ ప్రసాద్‌తో కలిసి లలితారాణి బంగళాకు పోలీసు వెహికిల్‌లో బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే ఆమె అభిమానులు గేటు బయట బారులు తీరి ఉన్నారు. ‘‘ఏంటి ప్రసాద్! మనకంటే ముందే ఇంతమంది రావడం’’ అని జగదీష్ అనేలోపే ‘‘ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం సార్!’’పోలీసు కారును చూడగానే గూర్ఖా గేటు తీశాడు అదే అదనుగా కొందరు అభిమానులు లోపలకు చొరబడబోయరు గూర్ఖా వారిని వారించాడు. లలిత నాన్న ప్రభాకరం, అతని చిన్న భార్య తులసి, హీరో నందకుమార్ విషణ్ణ వదనాలతో లలితారాణి డెడ్ బాడీకి కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. ఒక పక్కగా పనిమనిషి లక్ష్మి, ఆమె భర్త తోటమాలి శంకరయ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువవుతోందని తెలిసి పోలీసు ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి తగినంత బలగాన్ని పంపమన్నాడు జగదీష్. ‘‘ఎలా జరిగింది?’’ అని ప్రభాకరాన్ని అడిగాడు. ‘‘నిన్న రాత్రి షూటింగ్ నుంచి బాగా పొద్దు పోయాక అంటే సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చింది. మేడ మీద తన గదిలోకెళ్లిపడుకుంది. తెల్లారి ఎనిమిది గంటలైనా తలుపు తీయలేదు. లక్ష్మి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు కూడా తట్టింది. కిందికి వచ్చి మాకు విషయం చెప్పడంతో మేము పరుగున వెళ్లి తలుపును గట్టిగా తోస్తే బోల్ట్ ఊడి వచ్చింది. నిద్రపోతున్నట్టుగానే ఉంది. శరీరం పట్టుకొని చూస్తే పూర్తిగా చల్లబడింది. వెంటేనే మా ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాను. చనిపోయి కొన్ని గంటలవుతోందని చెప్పాడు’’‘‘ఆత్మహత్య చేసుకుందని కొన్ని టీవీ చానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రాణి ఆత్మ హత్య చేసుకొనేంత పిరికిది కాదు సార్!’’ అంది తులసి. ‘‘అన్ని విషయాలూ బయటకు వస్తాయి. ముందుగా క్లూస్ టీమ్ వారు వారి పనులు చేసుకుని ఫోటోలు అవి తీసుకున్నాక డెడ్ బాడీని పోస్ట్‌మార్టంకు పంపే ఏర్పాట్లు చేద్దాము’’ అని ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పంపమన్నాడు. రిపోర్ట్ రావడానికి సాయంత్రం కావచ్చు అని ఇదే విషయాన్ని అభిమానులందరికీ చెప్పాడు.‘‘సార్ మా అభిమాన నటిది ఆత్మహత్య కాదు. ఇది కచ్చితంగా హత్యే వారిని ఎలాగైనా మీరు పట్టుకోవాలి’’ అన్నాడు ఒక అభిమాని.‘‘కడసారి చూపుకోసం ఎంతసేపయినా వేచివుంటాము సార్! అన్నారు’’ ముక్త కంఠంతో. ‘‘మీ అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. దయచేసి మాకు సహకరించండి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్నాడు జగదీష్. అంబులెన్స్ డెడ్ బాడీని తీసుకెళ్లాక ప్రభాకరంగారిని ఉండమని మిగతా వారిని పంపించి, జగదీష్, ప్రసాద్‌ల పర్యవేక్షణలో క్లూస్ టీమ్ లలితారాణి గదిలో ఆధారాల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. టీపాయ్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్, దాని పక్కన సెల్ ఫోను తప్ప వారికి ఏమీ లభించలేదు. వాటిని స్వాధీనం చేసుకొని తలుపు గడియను బాగుచేయించి, తాళం వేయించి సీల్ చేసి కిందికి వచ్చారు. ఆ సమయానికి గుంటూరు నుంచి లలిత మేనత్త, ఆమె కొడుకు అంటే లలిత బావ చంద్రం వచ్చారు. వారిని మా అక్క, మా మేనల్లుడు అని జగదీష్‌కు పరిచయం చేశాడు ప్రభాకరం. ‘‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాము’’ అని జగదీష్ ప్రభాకరానికి చెప్పి, సిబ్బందితో కలసి బయల్దేరాడు.పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ప్రభాకరాన్ని రమ్మని కబురు పెట్టాడు జగదీష్. కొద్దిసేపటికి ప్రభాకరంతో పాటు నందకుమార్, చంద్రం కారులో వచ్చారు.‘‘అధిక మోతాదులో నిద్ర మాత్రలు వాడడం వల్ల లలితారాణి చనిపోయింది. ఆమె చనిపోయిన సమయం రాత్రి ఒంటిగంట’’ అని చెప్పి ప్రభాకరానికి రిపోర్ట్ ఇచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లమన్నాడు జగదీష్.వారు వెళ్ళాక ‘‘ప్రసాద్! ఆ హాండ్ బ్యాగ్‌లో చిన్న పాకెట్ డైరీ, బాల్ పెన్, సెల్‌ఫోన్ మనకు ఏమైనా ఉపయోగపడ్డాయా?’’ అన్నాడు జగదీష్. ‘‘హాండ్ బ్యాగ్, అట్టతో ఉన్న పాకెట్ డైరీ, బాల్ పెన్‌ల మీద లలితారాణి వేలి ముద్రలు తప్ప వేరే వాళ్లవి లేవు సార్! సెల్ ఫోన్ డేటా కూడా ఉపయోగ పడలేదు. కానీ డైరీలో ఈ వాక్యాలు చూడండి సార్!’’‘బావకు నా ముఖం చూపించలేను.నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’‘‘దీనిని బట్టి ఆమె ప్రెగ్నెంట్ అని అర్థమవుతోంది. అందువల్లే ఆత్మ హత్య చేసుకొని వుండవచ్చుకదా?’’ అన్నాడు ప్రసాద్. డెడ్ బాడీని అంబులెన్స్‌లో ఎక్కించే సమయంలో ప్రభాకరాన్ని, చంద్రాన్ని పిలిపించి డైరీలోని ఆ రెండు వాక్యాలను చూపించాడు. ‘‘ఆమె అంత్యక్రియలు రేపు అయిపోగానే ఎల్లుండి పరిశోధన మొదలుపెడతాము. అది పూర్తి అయ్యేవరకు ఈ విషయాలను మీరిద్దరూ చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పాడు. ‘‘అలాగే సార్’’ అన్నారు వారు. తమ అభిమాన నటిది ఆత్మహత్య కాదు, హత్య అని పలుచోట్ల ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు కొందరు అభిమానులు. పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన అభిమానులు సినీ పరిశ్రమ వారి ప్రముఖుల అశ్రునయనాల మధ్య లలితారాణి అంత్యక్రియలు జరిగాయి. జగదీష్, ప్రసాద్‌ను తీసుకొని తన మిత్రుడు డిటెక్టివ్ అయిన విశ్వంను కలవడానికి అతని ఇంటికి వెళ్లారు. ఎన్నో పరిశోధనలలో విశ్వం, జగదీష్‌కు సహాయపడ్డాడు. జగదీష్, ప్రసాద్‌లను సాధారంగా ఆహ్వానించాడు విశ్వం. స్నాక్స్ తింటూ టీ తాగుతున్న సమయంలో లలితారాణి తాలూకు డైరీని చూపించి,ఆ రెండు వాక్యాలను చదవమన్నాడు జగదీష్. అది చదివిన తరువాత విశ్వం ఫోన్ చేసి ఫోరెన్సిక్ లాబొరేటరీలో పనిచేసే కిరణ్‌ను వెంటనే రమ్మన్నాడు. కిరణ్ పావు గంటలో అక్కడకు చేరుకున్నాడు. విశ్వం అన్ని విషయాలూ చెప్పాడు. దస్తూరీ రిపోర్ట్ రావడానికి రెండు రోజుల సమయం పట్టవచ్చని డైరీని తీసుకు వెళ్లాడు.‘‘నీకు ఏ సమయంలోనైనా అందుబాటులో వుంటాను. నీ పరిశోధనను మొదలు పెట్టు’’ అన్నాడు జగదీష్‌తో విశ్వం. ‘‘అలాగే ఇప్పుడే లలితారాణి ఇంటికి వెళుతున్నాం..ఉంటా విశ్వం’’ అని చెప్పి బయలుదేరుతూ ప్రభాకరానికి వస్తున్నామని ఫోన్ చేశాడు. అక్కడకు చేరుకున్నాక ప్రభాకరం, తులసి, చంద్రం, లక్ష్మి, శంకరయ్యల నుంచి జగదీష్, ప్రసాద్‌లు విడి విడిగా విషయాలను సేకరించారు.రెండు రోజులకు వేలిముద్రల పరిశోధన రిపోర్టును, డైరీని కిరణ్ జగదీష్‌కు అందించాడు. ఆ రెండు వాక్యాలు లలితారాణివి కావని ఆ రిపోర్టులో ఉంది. లలితారాణి చనిపోయిన రోజున ఉదయం షూటింగ్ జరిగిన ప్రదేశం నుంచి కొన్ని వివరాలు సేకరించాడు ప్రసాద్, వాటిని జగదీష్ కు అందించాడు. రెండు రోజుల తరువాత అన్ని విషయాలను సమకూర్చుకొని జగదీష్. ప్రసాద్ కలిసి మళ్లీ విశ్వం వద్దకు వెళ్లారు. ‘‘మీరు సేకరించిన విషయాలలో ఎలాంటి లోపం లేదు రేపు ప్రెస్ వారిని కూడా పిలిచి దోషిని అరెస్ట్ చేయండి!’’ అన్నాడు విశ్వం. ప్రభాకరం ఇంట్లో అందరూ అందుబాటులో ఉండాలని ఒక ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని ప్రెస్ వారికి కూడా కబురు పెట్టాడు. నందకుమార్, పల్లవి కూడా అక్కడకు చేరుకున్నారు.ప్రెస్ వారితో పాటు అందరూ సమావేశమయ్యారు. ‘‘ఏ విషయమో చెప్పండి సార్!’’ అన్నారు ప్రెస్ వాళ్లు. ‘‘ఆ విషయానికి వచ్చేముందు మీకు ఓ చిన్న కథ చెబుతాను...ఒక ఊరిలో ఒక అక్క, తమ్ముడు ఉన్నారు అక్కకు కొడుకు పుట్టాక బావ చనిపోయాడు. తమ్ముడికి కూడా వివాహమయ్యింది. అతను పట్నంలో కాపురం పెట్టాడు, అక్కడే వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఏడాదికి అతనికి అమ్మాయి పుట్టింది...మేనల్లుడికే తన అమ్మాయిని ఇస్తానని అక్కకు వాగ్దానం చేశాడు.వ్యాపారంలో బాగా నష్టం రావడంవల్ల దిగులుతో అతని భార్య కన్నుమూసింది. బిడ్డను చూసుకోవడానికని అక్క తమ్ముడికి మళ్లీ పెళ్లి చేసింది. కాలచక్రం గిర్రున తిరిగింది అల్లుడు ఏజీ బియస్సీ చేసి వ్యవసాయం చూసుకుంటున్నాడు. కూతురు ఇంటర్లో చేరింది. ఆ అమ్మాయి ఒకసారి కాలేజీలో డ్రామా వేసింది. అది చూసిన ఒక నిర్మాత ఆమె సినిమాకు పనికొస్తుందని చెప్పి ప్రముఖ హీరో పక్కన హీరోయిన్ చేశాడు. అలా ఆమె మంచి పేరు తెచ్చుకుంది ఆమెకు బావ అంటే ఎంతో ఇష్టం. కానీ ఒకసారి సముద్రంలో బోటులో షూటింగ్ సన్నివేశాలు చిత్రికరిస్తుండగా ఆ స్పాట్లో బోటు ప్రమాదం నుంచి ఆమెను హీరో కాపాడాడు. అప్పటి నుంచి హీరో ప్రేమలో పడింది. హీరో కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అసలు చిక్కు అప్పుడే మొదలయ్యింది. హీరోకు కూడా ఒక మరదలు ఉంది. ఆమె బావను తప్ప ఎవ్వరినీ చేసుకోనని చెప్పింది.ఒక రోజు ఆమె హీరోయిన్ బావను కలిసి, నీవు నీ మరదలిని పెళ్లి చేసుకుంటేనే నా బావ నాకు దక్కుతాడు అని గట్టిగా చెప్పింది. కానీ లాభం లేక పోయింది. ఒక రోజు షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి వెళ్లింది. షూటింగ్ ప్యాకప్ చెప్పారు. అప్పుడు సమయం రాత్రి పదకొండు అయ్యింది. మేకప్ తీసివేయడానికి హీరో, హీరోయిన్లు మేకప్ రూమ్‌కు వెళ్లారు. ఆఫీస్ బాయ్ మూడు గ్లాసులతో పళ్ల రసాన్ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్లాడు. ఒకటి మాములుది, రెండు చల్లనివి.. మామూలు గ్లాసులో ఆమె ఇంటి నుంచి తెచ్చిన నిద్ర మాత్రలను కరిగించిన ద్రవాన్ని కలిపింది.ఎవరికి వారు వాళ్ల కార్లలో ఇళ్లకు బయలుదేరారు. హీరోయిన్ను ఆమె కారు డ్రైవరు పది నిముషాల్లో ఆమెను ఇంటి వద్ద దింపాడు. తక్కువ మోతాదు ఉన్న నిద్ర మాత్రలను ఎక్కువ శాతంలో కరిగించిన ద్రవం ఉన్న పళ్ల రసాన్ని ఆమె తీసుకోవడం వల్ల అది మెల్లగా ప్రభావం చూపి ఆమె కన్ను మూసింది’’‘‘ఆమెది ఆత్మహత్యగా రిపోర్ట్ వచ్చింది. ఎవరో ఆవిడ చెప్పండి సార్ టెన్షన్ గా వుంది’’ అన్నాడు ఒక విలేఖరి. ‘‘ఒక రోజు మేము హీరోగారి ఇంటికి వెళ్లాము అతనితో మాట్లాడుతుండగా అప్పుడు అతని మరదలు స్నాక్స్ కాఫీ తీసుకొచ్చింది. మాటల మధ్యలో మా మరదలు కవితలు బాగా రాస్తుందని చెప్పాడు. నా అసిస్టెంట్ డైరీ పెన్ను ఇచ్చి ‘మేడమ్ మా పోలీసు డిపార్ట్మెంట్ మీద ఒక కవిత వ్రాయండి వచ్చే సావనీర్లో వేస్తాము’ అన్నాడు. ఆమె కవిత వ్రాసేలోపల ఆమె గదిలోకి వెళ్లి సోదా చేశాడు. అక్కడ నిద్ర మాత్రల ప్రిస్క్రిప్షన్‌తో పాటు కొన్ని నిద్ర మాత్రలు డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో దొరికాయి’’ ‘‘సార్ ఆమె కవితలు వ్రాయడానికి హత్యకు ఎలాంటి సంబంధం ఉంది?’’ అన్నాడు ఒకతను. హీరోయిన్ డైరీలో రెండు వాక్యాలు రాసి వున్నాయి.ఒకటి’ మా బావకు నా ముఖం చూపించలేను... రెండవది నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’ ఇవి, కవితలు వాసిన వారు ఒక్కరే. ఇక కథను ముగిస్తున్నాను..ఆ హీరోయిన్ లలితారాణి ఆమెను హత్య చేసింది ఎవరో కాదు నందకుమార్ గారి మరదలు పల్లవి. అక్కడే ఉన్న పల్లవి ముఖంలో రంగులు మారాయి. ‘‘పల్లవిగారు ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటారా?’’‘‘అవును నా బావ నాకు దక్కేలా లేడని నేనే ఈ పని చేశాను’’‘‘పోలీసులు పల్లవిని అరెస్ట్ చేశారు. నందకుమార్‌తో పాటు అందరూ నివ్వెరపోయి చూడ సాగారు. ‘‘చిక్కుముడిని ఎంతో చాకచక్యంగా విడదీసిన జగదీష్‌ను, ప్రసాద్‌ను అందరూ ప్రశంసించారు’’. యు.విజయశేఖర రెడ్డి -
పసిడి పోరుకు ప్రసాద్
చబహార్ (ఇరాన్): కొత్త సీజన్‌లోని రెండో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ మక్రాన్ కప్‌లోనూ భారత బాక్సర్లు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఏకంగా ఆరుగురు బాక్సర్లు ఈ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ బాక్సర్, ప్రస్తుత జాతీయ చాంపియన్ పొలిపల్లి లలితా ప్రసాద్ (52 కేజీలు)తోపాటు దీపక్ సింగ్ (49 కేజీలు), సంజీత్ (91 కేజీలు), దుర్యోధన్ సింగ్ నేగి (69 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్లో వైజాగ్‌కు చెందిన ప్రసాద్ 5–0తో మార్విన్ తొబామో (ఫిలిప్పీన్స్)ను చిత్తుగా ఓడించాడు. నిర్ణీత మూడు రౌండ్లలోనూ ప్రసాద్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇతర సెమీఫైనల్స్‌లో మనీశ్ కౌశిక్ 4–1తో అష్కన్ రెజాయ్పై, సతీశ్ 5–0తో ఇమాన్ రమజాన్‌పై, దీపక్ 5–0తో మాలిక్ అమారిపై, సంజీత్ 5–0తో పుర్యా అమీరిపై, అలీ మొరాదీపై దుర్యోధన్ సింగ్ విజయం సాధించారు. అయితే రోహిత్ టొకాస్ (64 కేజీలు), మంజీత్ సింగ్ పంగల్ (75 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. గతవారం బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచారు. -
అమ్మక్క
‘‘ఏమాయనే ఇంకా లేత్తలేవు.. లెవ్వు! లేటయితే మేడమ్ తిడుతది’’ అంటూ నిండా కప్పుకుని పడుకున్న కూతుర్ని లేపింది లలిత. మేడమ్ పేరు వినంగనే జప్పని లేచి కూసుంది అనిత. అనితకి పదేండ్లు. కండ్లు నలుసుకుంట టైమ్ చూసింది. ఆరుంబావు దాటింది. ‘అమ్మో! లేటయింది,’ అనుకుంట నీళ్ల కుండి కాడికి పోయింది. అసలే చలికాలం. చల్లని నీళ్లు ముట్టంగనే వేళ్లు జివ్వుమన్నయి. తొందరగ మొహం కడుక్కుని అద్దం కాడికి వచ్చింది. చెదిరిన జుట్టునంత ఎనకకు అనుకుని రబ్బర్ బ్యాండు పెట్టుకుంది. ‘‘అనితా.. నడువు ఆరన్నర అయితుంది’’ తొందరపెట్టింది లలిత. గౌను కింది అంచుతో మొహం తుడుసుకుంట చెప్పులేసుకుంది అనిత. దస్తిని రెండు మడతలేసి, చెవులకు చలిరాకుండ అనితకు కట్టింది లలిత. తను కొంగు కప్పుకుంది. అమాయకంగా పడుకున్న ఏడేండ్ల కొడుకును చూసింది. కండ్లల్ల నీళ్లు తిరిగినయి. రాత్ర అన్నం పెట్టుమని అడిగిండు. లేదు అనంగనే ఏం అనకుండ పండుకున్నడు. పాపం కొడుకుకు ఇప్పుడన్న అన్నం తీస్కరావాలే అనుకుంది. తలుపులు దగ్గరికేసి వడివడిగ నడిచింది. తల్లి వెంటనే నడిచింది అనిత. లలితకు భయంతో గుండె కొట్టుకుంటాంది. ‘అసలే మేడమ్ ఇయ్యాల ఊరికి పోతా అన్నది. ఇయ్యాలనే లేటు కావట్టే. ఈ చలికి తెల్లారిందే తెలుస్తలేదు’ అనుకుంట అనితని తొందరగ నడవమని సైగ చేసింది. కూతురును తీసుకపోవద్దు అనుకుంటది. కాని తప్పదు. అనిత ఇల్లు ఊడిస్తే, ఆమె బాసండ్లు తోముతది. అట్ల టైమ్ మిగిలి ఇంకో ఇంట్లకి పనికి పోవచ్చని ఆలోచన. అనుకున్నట్టే వాకిట్లనే నిల్సుండి కోపంగా చూసింది మేడమ్. లలిత పాణం జల్లుమన్నది. ‘‘ఏమైందే లలితా! నీకోసమే చూస్తున్న. జప్పన్నే అచ్చినట్టు ఉన్నవ్..’’ అన్నది మేడమ్ వెటకారంగా. ‘‘ఇయ్యాల చలి జర ఎక్కువుంది మేడమ్. లేసుడు లేటయింది,’’అంటూ నసిగింది లలిత. ‘‘ఊరంత ఉంది చలి.. నీకొక్కదానికేనా ఏంది?’’ అన్నది మేడమ్ కోపంగా. లలిత ఏం మాట్లాడకపోవడంతో మళ్లీ తనే అంది.. ‘‘అయినా ఎన్నిసార్లు చెప్పిన్నే.. నీ బిడ్డను ఎందుకు తీసుకత్తున్నవు? నేనేదో నీ బిడ్డను పనికి పెట్టుకున్న అనుకుంటుండ్రు అందరు.’’ ‘‘ఎవరనుకుంటరు మేడమ్, అనుకుంటే నేను చెప్పనా వాళ్లకు. నాకే కొంచెం ఆసరా అయితదని తీసుకపోతున్న అని’’ అన్నది లలిత బాసండ్లు అందుకుంట. ‘‘ఆ... అనుకునేటోళ్లు నీ ఇంటికి వచ్చి చెప్తరా’’ అంటూ లోపలికి వెళ్లిపోయింది. అనితకు అవి అలవాటయిన మాటలే. లోపలికి పోయి చీపురు పట్టుకుంది. బాసండ్లు తోముతున్న లలితకు అనిత ఆలోచనలే. తన పరిస్థితిని అర్థం చేసుకుంటది. అందరు పిల్లల లెక్క ఎక్కువ ఆడియ్యదు. అందుకే అనిత అంటే తనకెంతో అభిమానం. ఇంత చిన్న వయసులోనే అంత పరిణతి. అనిత తమ్మున్ని చూసుకునే విధానానికి ఆశ్చర్యం వేస్తుంది ఆమెకు. ఒకసారి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది లలితకు. అది నడి ఎండకాలం. నల్ల నీళ్లు రాక వారమయితుంది. అప్పటికే బోర్లు ఉన్నోళ్ల ఇండ్లల్లకు పోయి నాలుగైదు బిందల నీళ్లు తెచ్చింది లలిత. మల్ల మల్ల అడుగుతే యాష్ట పడుతరు. ఇంట్లనేమో సుక్క నీళ్లులేవు. భర్త పని కానించి వచ్చే టైమయింది. ఏం చెయ్యాల్నో అర్థమైతలేదు లలితకు. అమ్మను చూసింది అనిత. పరిస్థితి అర్థం చేసుకుంది. తమ్మున్ని, బిందెను తీసుకుని పోయింది. అడిగిన కాడ మళ్ల అడగద్దు అని అనితకు తెలుసు. కొత్త ఇల్లు చూసింది. గేటు తీసుకుని లోపలికి పోయింది. ‘‘మేడమ్ రెండు బిందల నీళ్లు ఇస్తరా’’ అన్నది భయపడుతూ. ఇంతకుముందు అడగలే కాబట్టి వాళ్లూ సరే అన్నరు. అనితకి సంతోషం ఆగలేదు. తండ్రి సినిమాకు తీస్కపోతెనో, తల్లి అడిగింది కొనిస్తెనో కలిగే సంతోషం అది. ‘‘అమ్మను బిందె తెమ్మను’’ అని తమ్మున్ని పంపింది. అనితకు తెలుసు. బిందెలు రెండే. కాని మోసే నీళ్లే ఎక్కువ. అందుకే ఇంట్లోల్లు గుర్తించే లోపే వీలయినన్ని ఎక్కువ మోయాలని ఆరాటపడ్తూ ఉంది. తల్లి బిందెతో, తమ్ముడు సర్వతో వచ్చిండ్రు. ముందే నింపిన బిందెని తల్లి భుజం మీదికి ఎత్తింది. తమ్ముని సర్వ నింపి ఇచ్చింది. అట్ల ఆ ఎండకాలం అనిత తెలివితోని నీళ్ల కరువు నుండి బయటపడ్డది లలిత. అనిత ఇల్లు ఊడ్చి బోల్లు కడగటానికి రాంగనే, లలిత ఈ లోకంలోకి వచ్చింది. ‘‘నువ్వు కడగకు. సబ్బు పోలేదు అంటది మేడమ్’’ అన్నది లలిత. ‘‘పక్క మేడమ్ ఇంట్ల ఉడ్వన మరి..?’’ అనిత అడిగింది. ‘‘ఆ.. పో.. నేను గుడ వస్త ఇవి కడిగినంక’’ చెప్పింది లలిత. పక్కింటికి పరిగెత్తింది అనిత. బోల్లన్ని తెల్లగ కడిగి బోర్లించింది లలిత. మేడమ్ కోసం చూసింది. అన్నం అడుగుదామని. అచ్చేటప్పుడు అడుగుదాం అనుకొని పక్కింట్లకి నడిచింది. అనిత ఇల్లు ఊడ్సుడు అయిపోయింది. అనిత చేతిలో ఎర్ర స్వెటర్ మెరుస్తాంది. నమ్మలేనట్టుగ చూసింది లలిత. ‘‘మేడమ్ ఇచ్చింది.’’ మురిసిపోతూ చెప్పింది అనిత. లలితకు సంతోషంగ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న చిరుగులు ఉన్న.. బాగనే ఉంది స్వెటర్. బిడ్డకు రేపట్నుంచి చలిపెట్టదు అనుకుంది. లలిత బాసండ్లు తోముతున్నంత సేపు, అనిత స్వెటర్ చూసుకుంట మురిసిపోయింది. పని అయినంక ఇద్దరూ ఆనందంగ ఇంటికి పోయిండ్రు. ఇంటికి రాంగనే మొహం కడుక్కుని, తినడానికి తయారుగ ఉన్న కొడుకుని చూసింది లలిత. అప్పుడు గుర్తొచ్చింది.. అన్నం తీసుకస్తని వాడికి మాటిచ్చిన సంగతి. ‘‘అయ్యో! ఎంత పని అయిపాయె.. మేడమ్‌ని అన్నం అడుగుడు మర్చిపోతి..’’ అనుకుంట తనని తాను తిట్టుకుంది. కాని అప్పటికే కొడుకు కండ్లు మెరుస్తున్నయి. అనిత స్వెటరు కింద ఉన్న అన్నం కవరు చూసి. వాడు ఉర్కొచ్చి అనితను చుట్టుకున్నడు. వాడిని కూర్చోబెట్టి ప్లేట్ల అన్నం పెట్టింది అనిత. వాడు తింటుంటే తృప్తిగ చూస్తు.. ‘‘నువ్వు పని తొందర్లపడి మరిచిపోయినవే. కని నేను మర్చిపోలే. రాత్రి ఆకలితో వాడు ఏడ్చిన ఏడుపే గుర్తుకొచ్చింది’’ అన్నది. లలిత గుండె కరిగిపోయింది. కూతురునె చూస్తుండిపోయింది. - పెద్దింటి సాహితి -
మహిళా రెజ్లర్లు విఫలం
పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ బౌట్లలో పోటీపడిన భారత రెజ్లర్లు నిరాశపరిచారు. లలిత (55 కేజీలు), పూజా ధండా (58 కేజీలు), శిల్పి షెరాన్ (63 కేజీలు), పూజ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. గురువారం జరిగే బౌట్లలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు), శీతల్ (53 కేజీలు), సాక్షి మలిక్ (60 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు) పోటీపడతారు. -
ప్రేమకు ఆసిడ్ టెస్ట్
రాంగ్ నెంబర్ మూడు నెలల క్రితం.లలిత ఓ నెంబర్‌కి కాల్ చేసింది. అది రాంగ్ నంబర్.అయితే అది రాంగ్ నెంబర్ కాదనీ..తను కాల్ చేసిన వ్యక్తే తన జీవిత భాగస్వామి అవుతాడనిలలిత అప్పుడు ఊహించలేదు! ఆ రోజు.. ‘‘సారీ.. రాంగ్ నెంబర్’ అని ఫోన్ పెట్టేశాక.. రెండు వారాల తర్వాత అదే నెంబర్ నుంచి లలితకు ఫోన్ వచ్చింది. అటువైపు ఉన్నది రవిశంకర్ సింగ్. సీసీటీవీ ఆపరేటర్. ముంబై శివార్లలోని మలాడ్ నుంచి వచ్చింది ఆ కాల్. లలిత ఉండేది ముంబైలో. ‘‘మీ గొంతు బాగుంది’’అన్నాడు రవి. లలితకు కోపం వచ్చింది. ‘‘మీరెవరు?’’ అని అడిగింది. చెప్పాడు. ‘‘ఎందుకు చేశారు?’’ అని అడిగింది. ‘‘మీ గొంతు వినడం కోసం’’ అన్నాడు రవి. అప్పట్నుంచీ.. ఆమె గొంతు వినడం కోసం రవి ఫోన్ చేస్తుండేవాడు. అతడిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక లలిత అతడితో మాట్లాడుతుండేది. ఓరోజు సడెన్‌గా ‘‘ఐ లవ్యూ’’ చెప్పాడు రవి! లలిత బిత్తరపోయింది. కొన్ని నిముషాలు నిశ్శబ్దం! ఆమె గొంతు మూగబోవడంతో.. ‘‘ఏమైందీ..!’’అని కంగారుగా అడిగాడు రవి. ‘‘మీకు నా గొంతు మాత్రమే బాగుంటుంది. ముఖం బాగుండదు’’ అంది లలిత. ‘‘మిమ్మల్ని చూసి కాదు కదా, మీకు ఫోన్ చేసింది’’ అన్నాడు రవి. ఆ క్షణంలో.. లలితకు రవి మీద రెస్పెక్ట్ మొదలైంది. లలిత నిజమే చెప్పింది తన ముఖం బాగుండదని. నిజానికి ఆమె అందంగా ఉండేది. చూడచక్కని ముఖం. కానీ 2012లో ఓ రోజు... ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్‌కు లలిత కుటుంబ సభ్యులంతా బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు.. ఆ పెళ్లిలో లలిత చిన్న తమ్ముడికి, తమ్ముడి వరసయ్యే ఇంకొకతనికీ మధ్య గొడవ జరిగింది. ఎక్కడినుంచి వచ్చిందో.. ఓ ఆసిడ్ బాటిల్ పైకి లేచింది. అడ్డుకోడానికి పరుగున వాళ్ల మధ్యలోకి వెళ్లిపోయింది లలిత. అంతే.. ఆసిడ్ ఆమె ముఖంపై పడింది. ముఖం కాలిపోయింది. ఇప్పటికి లలిత ముఖానికి 17 సర్జరీలు జరిగాయి. ఈ ఏడాది ఇంకో 12 సర్జరీలు జరగబోతున్నాయి. ఈ కథంతా రవికి చెప్పింది లలిత. ‘‘కొంచెం ముందు చెప్పాలింది’’ అన్నాడు రవి నవ్వుతూ... ఫోన్లోనే. ‘‘ఎందుకు?’’ అంది లలిత.‘‘ఆల్రెడీ నేను మీ ప్రేమలో పడిపోయాను. వెనక్కి పోలేను’’ అన్నాడు మళ్లీ నవ్వుతూ. ‘‘జాలి చూపుతున్నారా?’’ అంది లలిత.‘‘కాదు, జాలి కాదు. మీ వాయిస్ నచ్చింది. ఇప్పుడు.. మీ ముఖం నచ్చింది. మీ అందమైన మనసు... మీ ముఖంలో ప్రతిఫలించడాన్ని నా హృదయం చూడగలుగుతోంది లలిత గారూ’’అన్నాడు రవి! లలిత ఆశ్చర్యపోయింది. ‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నాడు రవి. ఇంకా ఆశ్చర్యపోయింది. గత నెలలో దాదర్‌లోని డిసిల్వా టెక్నికల్ కాలేజీలో వీళ్ల పెళ్లి జరిగింది. ‘యాసిడ్ సర్వైవర్స్ సాహస్ ఫౌండేషన్’ వీళ్ల పెళ్లిని జరిపించింది. లలిత ఆ ఫౌండేషన్‌లో మెంబర్. పెళ్లి అరేంజ్మెంట్లన్నీ బాగా జరిగాయి. ఫుడ్డు, డెకరేషన్, భోజనాలగది, హనీమూన్ ప్యాకేజీ.. ఇలాంటివన్నీ పెళ్లికి వచ్చిన వాళ్లు ముందే సమకూర్చిపెట్టారు. లలితకైతే లెక్కలేనని పైథానీ చీరలు గిఫ్టుగా వచ్చాయి. అబుజైనీ, సందీప్ ఖోస్లాలు వధూవరులకు స్పెషల్‌గా బట్టల్ని డిజైన్ చేసి బçహూకరించారు. జీవితం అందమైనది. ప్రేమ ఇంకా అందమైనది. ఆసిడ్లు, ఆసిడ్లాంటి మనుషుల వల్ల జీవితం గానీ, జీవితంలోని ప్రేమ గానీ చెక్కు చెదరదు. -
లోక కల్యాణార్థం..
– శ్రీశైలంలో కొనసాగుతున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవం శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలోని చంద్రావతి కల్యాణమండపంలో తెనాలి శ్రీమద్భాగవత సప్తాహజ్ఞాన యజ్ఞట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి కోటి గాయత్రి, కోటి లలితానామ జపయజ్ఞ పారాయణ మహోత్సవం అత్యంతవైభవంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9 గంటల వరకు జపాలు, అనంతరం 12గంటల వరకు పారాయణలు, ఆ తర్వాత మహానివేదన, ప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు విష్ణుభట్ల తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 21 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జగద్గురువు దివ్యాశీస్సులతో లోక కల్యాణార్థం, మానవులందరికీ సంత్పంకల్పం కలగాలంటే శ్రీగాయత్రీ మాతను సమష్టిగా కోటి సంఖ్యారూపంగా ఆరాధించి, జపించడంతో పాటు మహిళలచే కోటి లలితా నామ జప పారాయణలు జరిపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న కోటి గాయత్రి, లలితానామ జపయజ్ఞ మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం సమయానికి 84 లక్షలు లలితానామ జపం, 72 లక్షల గాయత్రి నామ జపం పూర్తయినట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో ఉమ్మడిరాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ బి. శివ శంకరరావు పాల్గొన్నారు. వారికి ట్రస్ట్ నిర్వాహకులు ఆశీర్వచనాలను అందజేశారు. ముందుగా ఆయన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున్నారు. -
సీఐ నుంచిప్రాణహాని ఉందంటున్న మహిళ
చిలకలగూడ సీఐ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఓ మహిళ హెచ్చార్సీని ఆశ్రయించింది. సీతాఫల్‌మండికి చెందిన లలిత..తమను అప్పుల వాళ్లు వేధిస్తున్నారంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. అయితే, సదరు ఫైనాన్సియర్లతో రాజీ చేసుకోవాలంటూ సీఐ కావేటి శ్రీనివాస్ బెదిరిస్తున్నారని లలిత ఆరోపించింది. దీనిపై ఆమె మంగళవారం హెచ్చార్సీని ఆశ్రయించింది. -
వివాహిత ఆత్మహత్య
కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ధారూరు మండలం సర్పన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లలిత(25) అనే వివాహితకు మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామానికి చెందిన లక్ష్మన్‌తో 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహితకు తరుచూ కడుపునొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురై అనారోగ్యంగా ఉండేది. ఈ బాధను భరించలేక ఆదివారం రాత్రి తల్లిగారి ఇంట్లోనే దులానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసకుంది. ఈమెకు కొడుకు హరిప్రసాద్, కూతురు శివానిలు ఉన్నారు. తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వేధింపులకు విద్యాకుసుమం బలి
రైలు కింద పడి కేయూ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య మృతురాలి స్వగ్రామానికి చెందిన ఆకతాయిల వేధింపులతో మనస్తాపం మఠంపల్లి(నల్లగొండ) : ఆకతాయిల వేధింపులకు గిరిజన విద్యాకుసుమం రాలిపోయింది. చదువులో మేటిగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తందనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన రూపావత్ లలిత(19) స్వగ్రామం మఠంపల్లి మం డలం రాంచద్రాపురం తండా. రూపావత్ మగతనాయక్, బుజ్జి దంపతులకు కుమార్తె లలితతోపాటు కుమారుడు రమేష్ ఉన్నాడు. రమేష్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా మగత స్థానిక సిమెంట్ పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడు. తల్లి బుజ్జి రోజువారీ కూలీగా జీవనం సాగిస్తోం ది. లలిత చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తోంది. టెన్తలో 9.8 మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. కోదాడలోని ఎస్వీ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివి 974 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. ఇంజనీర్ కావాలనే ధ్యేయంతో కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్(ఈసీఈ) గ్రూప్‌లో చేరింది. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో అదే తండాకు చెందిన పలువురు ఆకతాయిలు తన ఫోన్‌కు ఎస్ఎంఎస్లు పంపడమేగాక ఫోన్ చేసి వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తామం తా ఉన్నామని నీకు భయంలేదని భరోసా కల్పించి మూడు రోజుల క్రితం కళాశాలకు పంపించారు. అనంతరం స్థానిక పెద్దమనుషులతో ఆకతాయిలను మందలింపజేశారు. అయి నా ఆకతాయిల వేధింపులు ఆగకపోవడంతో బుధవారం రాత్రంతా హాస్టల్లో ఉన్న లలిత విలపించింది. గురువారం కళాశాలకు వెళ్లి మధ్యాహ్నం తోటి స్నేహితులకు చెప్పకుండా రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో ముందుండే లలిత ఉన్నత ఉద్యోగం సాధించి తండాకు మంచి పేరు తెస్తుందని అనుకున్నామని అంతలోనే ఇంతటి అఘాయిత్యం జరుగుతుందని తాము ఊహించలేకపోయామని బంధువులు విలపిస్తూ తెలిపారు. ఈ సంఘటనపై లలిత తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమించమని వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా విచారణ చేపట్టారు. -
3వ నెల నుండి ఇగో సమస్యలు మొదలు
కేస్ స్టడీ లలిత, శ్రీనివాస్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. డాక్టర్ భార్య, ఆఫీసర్ భర్త సంసారం పెళ్లయిన 2 నెలలు గొడవల్లేకుండా గడిచిపోయింది. 3వ నెల నుండి ఇగో సమస్యలు మొదలయ్యాయి. ఒకరిమీద ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటూనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ‘నేను డాక్టర్‌ను, మంచి ప్రొఫెషనల్‌ను, నాకేంటి’ అని లలిత తరచు భర్తను కించపరిచేది. శ్రీనివాసేమో మగవాడిని, భర్తను, పైగా ఆఫీసర్‌ను అని ఇద్దరి మధ్యా తరచు గొడవలు. అలా ఒకరోజు మొదలైన గొడవ చినికి చినికి గాలివాన అయ్యింది. 6 సం॥8 సం॥వయసున్న ఇద్దరు కొడుకుల్ని భర్త ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో దేవాలయంలో వదిలేసి లలిత హాస్పిటల్‌కు వెళ్లిపోయింది. తెలిసినవారెవరో చూసి, ఏడుస్తున్న పిల్లలకు ఆశ్రయమిచ్చి శ్రీనివాస్‌కి సమాచారం అందించారు. శ్రీనివాస్ హుటాహుటిన వచ్చి వారిని ఇంటికి తీసుకువెళ్లాడు. భార్య చేసిన పనికి కోపంతో మండిపడుతూ, ఇక ఆమెతో కాపురం చేసేది లేదని తెలిసిన వాళ్ల ముందు తెగేసి చెప్పి, అప్పటికప్పుడు ఇంట్లోని సామానంతా తెచ్చేసి వేరు కాపురం మొదలెట్టేశాడు. లలిత అంతకన్నా ఎక్కువ కోపంతో భర్త మీద 498 ‘ఎ’, గృహ హింస కేస్లు ఫైల్ చేసేసింది. అలాంటి భార్యతో తెగదెంపులు చేసుకోవడమే మేలంటూ శ్రీనివాస్ తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు. ఇద్దరి వాదోపవాదాల నడుమ ఎనిమిదేళ్లు గడిచాయి. ఈ లోగా స్కూల్లో ఉన్న పిల్లలు, కాలేజ్ చదువులకు వచ్చేశారు. పిల్లల కష్టడీ తనకే అప్పగించాలంటూ లలిత భర్తపై కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజ్యూగల్ రైట్స్ (కాపురానికొస్తానని) కేసు, 498 ‘ఎ’, డీవీసీ కేసు పెట్టింది. తమను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిందన్న బాధతో పిల్లలు తాము తల్లి దగ్గరకు వెళ్లేది లేదంటూ జడ్జిగారి ముందు చెప్పడంతో కోర్టులో అన్ని కేసులూ కొట్టేశారు. ఎట్టకేలకు శ్రీనివాస్‌కు విడాకులు మంజూరయ్యాయి. కోటీశ్వరురాలైన డాక్టర్ లలిత మొగుడు, భర్త, పిల్లలు లేకుండా భారంగా బతుకీడుస్తోంది. విడాకులు మంజూరు అయినప్పటికీ కాలేజీ చదువుల్లోకొచ్చిన ఇద్దరు పిల్లల తండ్రి శ్రీనివాస్‌కు పిల్లనిచ్చేందుకు ఎవరూ ధైర్యంగా ముందుకు రాలేదు. దాంతో ఆఫీసులో అందరి గుసగుసల నడుమ ఆడదిక్కులేకుండానే పిల్లలను పెంచి పెద్ద చేసుకుంటూ శ్రీనివాస్ నిస్సారంగా జీవితాన్ని గడప వలసి వచ్చింది. కోర్టుల చుట్టు తిరిగి తిరిగి ఇద్దరికీ ఆరోగ్యం పాడయింది. ఎంత సంపాదించినా ఏం లాభం, ఇద్దరూ రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
ఆసియా చాంపియన్‌షిప్‌లో వికాస్, లలితకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు వికాస్ గౌడ, లలిత బాబర్ స్వర్ణ పతకాలు సాధించారు. మరో భారత అథ్లెట్ లక్ష్మణన్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ్ 62.03 మీటర్ల దూరం విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో లలిత (9:34.13 నిమిషాలు) టైమింగ్‌తో మొదటి స్థానం సాధించింది. 10,000 మీటర్ల రేసులో లక్ష్మణన్ (29:42.81 నిమిషాలు) రెండో స్థానం దక్కించుకున్నాడు. -
ఖాళీగా ఉన్న ఇంట్లో అస్థిపంజరం లభ్యం
బోడుప్పల్: ఖాళీగా ఉన్న ఇంట్లో అస్థిపంజరం దొరికింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లంకి రవికిరణ్‌రెడ్డి కథనం ప్రకారం... బోడుప్పల్‌కు చెందిన సోమశేఖర్ స్థానిక హేమానగర్ వీధి నం.7లోని ప్లాట్ నం. 208లో ఆరు నెలల క్రితం ఇంటిని నిర్మించారు. నెల రోజుల పాటు గోదాంకు అద్దెకిచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. సోమశేఖర్ కూడా నాలుగు నెలలుగా ఆ ఇంటి వైపు వెళ్లలేదు. సోమవారం ఆయన తన ఇంటికి వెళ్లి చూడగా... ఇంట్లో మహిళ (30) అస్థిపంజరం కనిపించింది. భయాందోళనకు గురైన ఆయన వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడు నెలల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని, ఒంటిపై పూల రంగు చీర, గాజులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అస్తిపంజరం లలితదా? బోడుప్పల్ దేవేందర్‌నగర్ కాలనీకి చెందిన సామ్యూల్ భార్య లలిత మూడు నెలల క్రితం అదృశ్యమైంది. భర్త సామ్యూల్, కుమార్తె దీప ఈ విషయంపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హేమానగర్లో లభించిన అస్థిపంజరాన్ని పోలీసులు సామ్యూల్, దీపకు చూపించగా.. మృతురాలి జుత్తు, చీర, గాజులను బట్టి అది తప్పిపోయిన లలితగా అనుమానంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అస్థిపంజరానికి, దీపకు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాలకు తావిస్తున్న గొయ్యి... సోమశేఖర్ ఇంటికి పక్కనే ఖాళీ స్థలంలో ఓ గొయ్యి కనిపించింది. నిన్న మధ్యాహ్నామే ఈ గొయ్యిని ఎవ్వరో తవ్వారని, అస్తిపంజరాన్ని అందులో వేసి కప్పెట్టేందుకే దీనిని తవ్వి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
భజరంగ్, లలితకు రజత పతకాలు
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు పతకాల 'పట్టు'పడుతున్నారు. బుధవారం రెజ్లింగ్‌లో భారత్‌కు మరో రెందు పతకాలు దక్కాయి. మహిళల 53 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ లలిత, పురుషుల 61 కిలోల విభాగంలో భజరంగ్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. కాగా వీరిద్దరూ అడుగు దూరంలో పసిడి పతకం చేజార్చుకున్నారు. ఫైనల్లో నైజీరియా రెజ్లర్ అడెక్వొరొయె చేతిలో లలిత, కెనడా రెజ్లర్ ట్రెంబ్లే చేతిలో భజరంగ్ ఓటమి చవిచూశారు. మరో ఇద్దరు భారత రెజ్లర్లు ఫైనల్స్‌కు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నారు. పోటీలు కాసేపట్లో జరగనున్నాయి. కాంస్య పతకం పోరులో మరో భారత రెజ్లర్ పోటీ పడుతోంది. -
ఆత్మ విశ్వాసమే ఆయుధంగా...
కష్టాలు కట్టగట్టుకుని వచ్చి దాడి చేశాయి. బాధలు బండెడు బరువును నెత్తిన మోపాయి. విధి మాటిమాటికీ ఆమె జీవితంతో ఆడుకుంది. అయినా ఆమె ఏనాడూ ఆశ కోల్పోలేదు. అధైర్యపడలేదు. కష్టం విసిరిన రాళ్లను విజయానికి పునాదిగా మలుచుకుంది. బాధలు చూపిన ముళ్లబాటలోనే జీవితాన్ని వెతుక్కుంది. విధిని ఎదురించి అమ్మ తోడుతో ముందుకు వెళుతోంది. ఆమె పేరు లలిత. పేరు సౌమ్యంగానే ఉన్నా... ఆమె జీవితం మాత్రం ఆటుపోట్ల మయమే. బలిజిపేట గ్రామానికి చెందిన బొత్స అప్పారావు, హైమావతిల కుమార్తె లలిత. తండ్రి గతంలో రైస్‌మిల్లులో పనిచేసేవారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆయన ఉన్న ఉద్యోగం చేయలేక ఇంటి వద్దే ఉండిపోయారు. ఇది ఆ కుటుంబానికి మొదటి దెబ్బ. విరిగిన కాలు బాగుపడిన తర్వాత చిన్న పనులు మాత్రమే చేసుకుంటున్నారు. ఆనాటి నుంచి తల్లి హైమావతి చిరు వ్యాపారం చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. లలితకు చిన్నతనంలో 11వ నెలలో జ్వరం వచ్చి పోలియో సోకింది. ఇక అప్పటి నుంచి ఆమె నడవలేదు. మొదటి దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆమెకు తగిలిన రెండో దెబ్బ ఇది. ఎంతో మంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. కానీ లలిత ఏనాడూ తన పై తాను విశ్వాసం కోల్పోలేదు. చదువు విషయంలో చాలా పట్టుదలగా ఉండేది. కుటుంబం కష్టా ల కడలిలో ఉన్నప్పటికీ ఆమె అధైర్యపడలేదు. స్థానిక ఉన్నత పాఠశాలలో 2009లో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నూజివీడులో ట్రిపుల్ ఐటీ సీటు సాధించింది. కానీ అక్కడ జాయిన్ అ యిన తర్వాత ఆమెకు అనారోగ్యం చేసింది. ఇక్కడ కూడా విధి ఆమెతో ఆడుకుంది. పెద్ద చదువులు చదవనీయకుండా అడ్డుపడింది. దీంతో ఆమె తిరిగి బలిజిపేట వచ్చి పీఎస్ఎన్ కళాశాలలో ఇంటర్లో జాయిన్ అయింది. పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించింది. అ నంతరం డైట్ ప్రవేశ పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకుని స్థానికంగా ఉండే శ్రీభారతి డైట్ శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతోంది. తాను నడవలేకపోయినా పది మందికి నడత నేర్పుతానని విశ్వాసంగా చెబుతోందీ యువతి. చదువుకునే సమయంలో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు తల్లి, తోటి విద్యార్థులు సహకరించారు. వారి సహకారంతో మూడు చక్రాల బండిపై వెళ్లి చదువుకుంటున్న లలిత అందరి మన్ననలు పొందుతోంది. - బలిజిపేట రూరల్ -
నేలకొరిగిన ‘పులి’
భాయ్‌సాబ్ ఇకలేరు.. నరేంద్ర మృతితో అన్ని పార్టీల నేతల దిగ్భ్రాంతి తరలివచ్చిన ఆయా పార్టీల ప్రముఖులు అబిడ్స్,చార్మినార్,గోల్నాక,న్యూస్‌లైన్: పులి నేలకొరిగింది. ఆయన పేరు చెబితే ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించే టైగర్ నరేంద్ర కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆలే నరేంద్రకు భార్య లలితతోపాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఆలె భాస్కర్రాజ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. చిన్న కుమారుడు జితేంద్ర బీజే వైఎం గ్రేటర్ అధ్యక్షుడు, గౌలిపురా కార్పొరేటర్‌గా ఉన్నారు. కుమార్తె సబితకు వివాహమైంది. నరేంద్రకు నలుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెలున్నారు. ఆయన మరణవార్త తెలుసుకొని అన్ని పార్టీల నేతలు ఆస్పత్రికి తరలివచి భౌతికకాయానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. పాతబస్తీలో విషాదచాయలు : నరేంద్రమృతితో ప్రధానంగా పాతబస్తీలో విషాదచాయలు అలుముకున్నాయి. నాంపల్లి కేర్ ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఆయన పార్ధివదేహాన్ని మదీనా, చార్మినార్, శాలిబండల మీదుగా గౌలిపురాలోని ఆయన నివాసానికి ర్యాలీగా తీసుకొచ్చారు. పాతబస్తీలోని ప్రధాన కూడళ్లలో ఆయన చిత్రపటాలు, నల్లజెండాలు ఉంచి సంతాపం తెలిపారు. అంబర్‌పేటతో విడదీయరాని బంధం : అప్పటి హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆలె నరేంద్రకు అంబర్‌పేటతో విడదీయరాని అనుబంధం ఉంది. పేదల పెన్నిధిగా పేరొందిన ఆయన ఇకలేరని తెలిసి పలువురు నాయకులు దిగ్భాంతికి గురయ్యారు. తొలిసారి 1983లో హిమాయత్‌నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్మిక నాయకుడిగా కూడా ఉన్న నరేంద్ర నియోజకవర్గానికి చెందిన పలువురికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పెట్టించారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వి.హనుమంతరావు చేతిలో పరాజయం పాలయ్యారు. 1994లో బీజేపీ నుంచి పోటీచేయగా 67 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ చేతిలో ఓడిపోయారు. నాటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. నరేంద్రనగర్ : అంబర్‌పేట డివిజన్లో ఆలె నరేంద్ర పేరు మీద ఒక బస్తీ ఏర్పాటైంది. ప్రస్తుతం దాన్ని నరేంద్రనగర్గా పిలుస్తున్నారు. ఈ బస్తీలోనే నరేంద్రనగర్ కమ్యూనిటీహాల్ కూడా ఉంది. -
భాస్కరుడి లలితగీతం
ఆమెని చూడగానే... ‘గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే!’ అని పాడుకుంది అబ్బాయి మనసు. ‘బొమ్మని గీస్తే నీలా ఉంది..?’ అని కూడా అనుకుంది. ‘రామసక్కని బంగారుబొమ్మ...’ అంటూ స్పీడ్ పెంచేసి ‘సారొస్తారొస్తారే.. వస్తారొస్తారొస్తారే...’ అని అమ్మాయిచేతా అనిపించింది. ఆ అబ్బాయి భాస్కరభట్ల రవికుమార్. ఆ అమ్మాయి అతని అర్ధాంగి లలిత. పాటల రచయితగా ఆయన శ్రీకారం చుట్టకముందే ప్రేమకు పల్లవి, చరణంలా వారు కలిసిపోయారు. కృతికి హంసపాదులా, గీతానికి శ్రుతితప్పడంలా కాపురంలో అప్పుడప్పుడూ వచ్చే అన్యోన్య కలహాల్లో... పరిస్థితిని చక్కదిద్దేలా సర్దుబాట్లూ అవసరమే!’’ అని చెప్పిన ఈ జంట పాడిన యుగళగీతమే ఈవారం మనసే జతగా... అబ్బాయి పుట్టింది శ్రీకాకుళంలో. ఐదుగురు తోబుట్టువుల మధ్య పెరిగింది రాజమండ్రిలో. సినిమా జర్నలిస్ట్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం. ఆ తర్వాత సినీ గీత రచయితగా ప్రయాణం. అమ్మాయి స్వస్థలం వరంగల్. ఇంటికి పెద్దకూతురు. ప్రాంతాలు వేరు. భావాలు వేరు. కులాలు వేరు. ఆర్థిక పరిస్థితులు వేరు. అనుకోకుండా కలుసుకున్నారు. మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి (ఆగస్టు 13, 1998) పెళ్లి చేసుకున్నారు. వీరికి అమంత, సంహిత ఇద్దరు సంతానం. ఇద్దరివైపు మాటవరసకు పలకరింపులే తప్ప, సహాయ సహకారాలు లేవు. ‘అభిరుచుల నుంచి అభిప్రాయాల దాకా అన్నింటా భిన్నం’ అంటున్న వీరు పదిహేనేళ్లుగా కలిసుంటున్నారు. నీ కళ్లతోటి నా కళ్లలోకి చూస్తేనే చంద్రోదయం... ‘ఈ పాటలాగే నా మనసెరిగి నడుచుకుంటూ నా జీవితంలో వెన్నెలలు నింపిన వ్యక్తి భార్యగా లభించడం నా అదృష్టం. పదిహేనేళ్ల క్రితం లలిత నా జీవితంలోకి అడుగుపెట్టి ఉండకపోతే ఈ రోజు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోయేవాడిని. పెళ్లయినకొత్తలోనే గీత రచయిత కావాలనే నా అభిలాషను అర్థం చేసుకొని, ఉద్యోగం వదులుకోమని సలహా ఇచ్చింది. ఆ సమయంలో లలిత ఇచ్చిన సహకారం ఎన్నటికీ మరవలేను. ఇల్లు గడవడానికి ఇతరత్రా ఆదాయవనరులేవీ లేవు. సెకండ్ హ్యాండ్ ఇంగ్లిష్ పుస్తకాలు, మాగజీన్లను మీద కొనుక్కొస్తే, వాటిని లలితే తెలుగు అనువాదం చేసి ఇచ్చేది. వాటికి నేను లీడ్ రాసి, ఫొటో జత చేసి అన్ని పత్రికాఫీసులకు తిరిగేవాడిని. అలా మంచి ఆదాయం సంపాదించాం. దాంతో ఇద్దరికీ ఆత్మవిశ్వాసం పెరిగింది. నాకున్న అభిరుచికి పదునుపెట్టే అవకాశం, సమయం దొరికింది. ఐదారు నెలలు ఇద్దరం కలిసి కష్టపడ్డాం. తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో నాకు ఓ ఆధారం దొరికింది. అప్పటినుంచి తను ఇంటిని చక్కదిద్దుకుంటుంటే... నేను పాటలు రాసుకుంటూ జాలీగా గడిపేస్తున్నా. ఆలుమగలు ఒకరికోసం ఒకరుగా ఉంటే, ఎంతటి కష్టమైనా దూదిపింజే అవుతుందని స్వానుభవంతో తెలుసుకున్నాను’’ అంటూ తమ సంసార ప్రయాణపు తొలి అడుగులో పంచుకున్న కష్టసుఖాలను వివరించారు. అడుగునవుతాను నీ వెంట నేను... ‘‘ఈ పదాల అల్లికలాగే ఇన్నేళ్లూ ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉన్నాం. అప్పుడప్పుడు మా మధ్య చోటుచేసుకునే చిన్న చిన్న గ్యాపులను మా ఇద్దరిలో ఎవరో ఒకరం పూరించుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాం’’ అంటూ తమ సంసారంలోని సరాగాలను వినిపించారు లలిత. ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం... ‘పదహారేళ్ల క్రితం.. అచ్చు మా మనసు భాష ఇలాగే ఉంది. అప్పటికి నేను సినిమా జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వరంగల్‌లో ఓ సినిమా హీరోయిన్ హాజరయ్యే ఫంక్షన్‌ని కవర్ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ లలితను చూశాను. అప్పటికే బి.ఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది తను. ఫంక్షన్ మొత్తం తానే అయినట్టుగా తిరుగుతున్న లలిత నాకు బాగా నచ్చింది. హైదరాబాద్ వచ్చాక అడ్రస్ కనుక్కొని ఉత్తరం రాశాను’ అంటూ తమ ప్రేమ ప్రయాణాన్ని భాస్కరభట్ల చెబుతుంటే లలిత అందుకుని - ‘‘ఆఫీస్‌కు వెళ్లేసరికి వారానికి రెండు, మూడు ఉత్తరాలు నా కోసం రెడీగా ఉండేవి. ఉత్తరాలు రాస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆ అక్షరాలు, పదాలు నన్ను అమితంగా ఆకట్టుకునేవి. తిరుగు ఉత్తరాలు రాసేలా చేశాయి. ఫలితంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నమ్మకం కలిగింది. ఓ రోజు పెళ్లి పట్ల తన అభిప్రాయం తెలపమని నేనే రాశాను. వచ్చి కలిశారు. అవి జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. కులాలు, ఉద్యోగాలు, సర్దుబాట్లు... ఇద్దరం మాట్లాడుకొని, ఇంట్లోవారు ఒప్పుకోకపోతే స్నేహంగానైనా ఉండాలనుకుని వెళ్లిపోయాం. కాని మరుసటి రోజు ఉదయమే ఈయన వచ్చి, పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుందామన్నారు. వారిని ఒప్పించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది’’ అంటూ ఉద్వేగంతో చెప్పారు లలిత. తోడునీడల పందిరి... ఇల్లు ఆహ్లాదంగా కనిపించాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. ఒకరి బాధకు ఒకరి ఓదార్పు కావాలి. దీని గురించి ప్రస్తావిస్తూ- ‘‘ఎప్పుడైనా రికార్డింగ్‌లో నా పాట ఓకే కాకపోతే, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు లలిత ఇచ్చే మనోధైర్యం మాటల్లో చెప్పలేనిది. ‘నీ పాట వినే అదృష్టం వారికి లేదు. వదిలేయ్ నాన్నా’ అంటుంది. ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. మరో పెద్ద ఛాయిస్ వస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. ఇలా చాలా విషయాల్లో లలిత మా అమ్మను తలపిస్తుంది’’ అన్నారు భాస్కరభట్ల. బాధ్యతల బంధం... ‘‘ఇన్నేళ్ల జీవితంలో అల్లకల్లోలమయిన పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కారణం ఈయన ప్లానింగ్. మమ్మల్నెప్పుడూ సెక్యూర్డ్‌గా ఉంచాలనుకుంటారు. పనిలోనూ, డబ్బు విషయంలోనూ చాలా పక్కాగా ఉంటారు. ఇద్దరికిద్దరం కానుకలు ఇచ్చుకోవాలి, బాధ్యతలు వదిలించుకోవాలి... అనుకోం. ఇంటి సరుకులు తేవడం దగ్గర్నుంచి, అవసరమైన వస్తువుల వరకూ పిల్లలనూ వెంట తీసుకెళ్లి తెచ్చుకుంటాం. ఆ సమయంలో పిల్లలకు ఏ వస్తువు ఎంతవరకు అవసరం అనేది తెలిసి వస్తుందని మా ఇద్దరి నమ్మకం. అవసరం ఉందనుకుంటే రూపాయికి వచ్చే వస్తువు పదివేలైనా పెడతాం. అవసరం కానిదనుకుంటే పదివేల రూపాయల వస్తువు రూపాయికి వస్తుందన్నా కొనం. డబ్బు ఎంతవరకు, ఎలా ఖర్చుపెట్టాలనేది మా పద్ధతుల ద్వారా పిల్లలకు తెలియచేస్తుంటాం. వాళ్లూ చక్కగా అర్థం చేసుకుంటారు. గొప్పకోసం పెద్ద పెద్ద స్కూల్స్‌లో వేయాలనుకోం. బాగా చదవాలని అనుకుంటాం. మా నిర్ణయాలు, అలవాట్ల వల్ల పిల్లలు స్కూల్లో అన్నింటా ముందుంటారు. భార్యాభర్తల బంధం బాగుంటేనే పిల్లల ఎదుగుదల ఆశించిన విధంగా ఉంటుంది’’ అని వివరించారు లలిత. ‘‘భార్యాభర్తల మాటపట్టింపులను మూడోవ్యక్తికి చెప్పకూడదు. ఎందుకంటే అవి ఎక్కువసేపు నిలబడవు. నెమ్మదిగా సర్దుబాట్లు చేసుకొని, అన్యోన్యంగా ఉంటాం. మూడో వ్యక్తికి చెప్పడం వలన వారి దగ్గర చులకన అవుతాం. అలాగే కోపతాపాలు, భావోద్వేగాలు చోటుచేసుకోవడం సహజమే. మనసెరిగి సర్దుకుపోవడమే సమంజసం’’ అని తెలిపిన ఈ జంట. - నిర్మలారెడ్డి, సాక్షిఫీచర్స్ ప్రతినిధి ‘నా పాటలకు మొదటి శ్రోత లలితే! పదాల అల్లికలో నేను కుస్తీ పడుతుంటే తను అందించిన పలుకులెన్నో ఉన్నాయి. - భాస్కరభట్ల ఈయన మదిలో కొత్తపదం తట్టిందంటే ఎంత పనిలో ఉన్నా వదిలేసి రావలసిందే! పనికన్నా పదం ముఖ్యం కాబట్టి మొదటి ప్రాధాన్యత పదానికే ఇస్తుంటాను. - లలిత