డోన్ మండలంలో బాంబుల కలకలం
డోన్: కర్నూలు జిల్లా డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత మహానందిరెడ్డి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మహానందిరెడ్డి గతంలో గ్రామంలో జరిగిన ఒక హత్య కేసు నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను హతమార్చేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు బాంబులతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.